E-Paper
Advertisement

Mercedes-Benz CLA Electric: బెంజ్ CLA ఎలక్ట్రిక్ కారు రివీల్, 5 క్రేజీ విషయాలు మీ కోసం!

Mercedes-Benz CLA Electric: బెంజ్ CLA ఎలక్ట్రిక్ కారు రివీల్, 5 క్రేజీ విషయాలు మీ కోసం!
Advertisement

మెర్సిడెస్-బెంజ్ ఇండియా భారత మార్కెట్లో కొత్త మెర్సిడెస్-బెంజ్ CLA ఎలక్ట్రిక్ కారును పరిచయం చేసింది.  CLA గతంలో ఈ కారు పెట్రో వెర్షన్ లో అందుబాటులో ఉండగా, 2020లో ఉత్పత్తిని నిలిపివేసింది. కొత్త CLA A-క్లాస్ సెడాన్ ప్లేస్ లోకి అడుగు పెట్టబోతోంది. బ్రాండ్ ఎంట్రీ లెవల్ పోర్ట్‌ ఫోలియోలో EQA, EQB EVలను కూడా ఫిల్ చేస్తుంది. కొత్త మెర్సిడెస్ బెంజ్ CLA ధర రూ. 55 లక్షల నుంచి రూ. 60 లక్షల ఎక్స్ షోరూమ్ ధరలో ఉంటుందని భావిస్తున్నారు. ఈ కారుకు పోటీగా మరే కారు లేనప్పటికీ, కొత్త CLA ధర విషయంలో BMW iX1, వోల్వో XC40 రీఛార్జ్, కియా EV6, టెస్లా మోడల్ Y లాంటి ఎలక్ట్రిక్ మోడళ్లతో పాటు రూ. 60 లక్షల ధర పలికే ఇతర EVలతో పోటీ పడుతుందని భావిస్తున్నారు. ఈ సరికొత్త EV ఏప్రిల్‌ లో విడుదలకానుంది. ప్రీ-బుకింగ్‌లు మార్చి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కారు గురించి పలు కీలక అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం..

మెర్సిడెస్ బెంజ్ CLA ఎలక్ట్రిక్ డిజైన్

కొత్త మెర్సిడెస్ బెంజ్ CLA EV పాత మోడళ్ల మాదిరిగానే ఏరోడైనమిక్స్‌ మీద ఫోకస్ పెట్టింది. 0.21 తక్కువ డ్రాగ్ కోఎఫీషియంట్‌ను కలిగి ఉంది. ఈ సెడాన్ లో స్టాన్స్, పొడవైన వీల్‌ బేస్, చిన్న ఓవర్‌ హ్యాంగ్‌ లను కలిగి ఉంది. ముందు భాగంలో స్టార్ ప్యాటర్న్ ఎలిమెంట్స్, సెంట్రల్ మెర్సిడెస్ లోగోతో గ్లోస్ బ్లాక్‌ లో క్లోజ్డ్ గ్రిల్ ప్యానెల్‌ ను కలిగి ఉంది. స్లిమ్ LED హెడ్‌ ల్యాంప్‌లు ఫాసియా అంతటా రన్ అయ్యే లైట్ బార్ ఉంటుంది. ఈ కారుకు  ఫ్రేమ్‌ లెస్ డోర్లు ఉంటాయి. ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, ఏరోడైనమిక్‌గా రూపొందించిన అల్లాయ్ వీల్స్‌ ను కూడా కలిగి ఉంటుంది.  బంపర్ క్లీన్ ఫినిషింగ్ కలిగి ఉంది. చుట్టూ క్రోమ్ ఎలిమెంట్స్, 142 చిన్న బ్యాక్‌ లిట్ స్టార్‌లతో కూడిన ఫ్రంట్ గ్రిల్, హీట్ ప్రొటెక్టివ్ కోటింగ్‌తో వచ్చే పనోరమిక్ గ్లాస్ రూఫ్, ఫైవ్ స్పోక్ ఏరో వీల్స్ ఉన్నాయి.

మెర్సిడెస్ బెంజ్ CLA ఎలక్ట్రిక్ ఇంటీరియర్, ఫీచర్లు

Advertisement

మెర్సిడెస్ బెంజ్ CLA EV మినిమలిస్ట్, స్క్రీన్ ఫోకస్డ్ క్యాబిన్‌ను కలిగి ఉంది. క్యాబిన్ లో 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, 14 అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ తో కూడిన డ్యూయల్ స్క్రీన్ లేఅవుట్ ఉంది. క్యాబిన్ టచ్ సెన్సిటివ్ నియంత్రణలతో మూడు స్పోక్ స్టీరింగ్ వీల్‌ ను కలిగి ఉంది. సెంటర్ కన్సోల్‌ లో కార్బన్ ఫైబర్ ఫినిషింగ్ స్పోర్టియర్ విజువల్ టచ్‌ ను కలిగి ఉంటుంది. 64 కలర్ యాంబియంట్ లైటింగ్, డాల్బీ అట్మాస్‌ తో కూడిన 16 స్పీకర్ బర్మెస్టర్ సౌండ్ సిస్టమ్, పవర్డ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆరు 100W USB-C ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్‌లు, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, కనెక్ట్ చేయబడిన కార్ టెక్ కలిగి ఉంటుంది.

మెర్సిడెస్ బెంజ్ CLA ఎలక్ట్రిక్ బ్యాటరీ, రేంజ్

మెర్సిడెస్ బెంజ్ CLA ఒకే CLA 250 ప్లస్ వేరియంట్‌లో అందించబడుతుంది. ఇది ఒకే ఎలక్ట్రిక్ మోటారుతో జత చేయబడిన 85 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. 268hp పవర్, 335Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది రెండు స్పీడ్ గేర్‌ బాక్స్‌ ను కలిగి ఉంటుంది. ఒకే ఛార్జ్ తో ఏకంగా 792 కిమీ రేంజ్ ను అందిస్తుంది. ఇది 320 kW వరకు వేగంతో DC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 10 నిమిషాల ఛార్జింగ్ తో దాదాపు 300 కి.మీ ప్రయాణించే అవకాశం ఉంటుంది.

మెర్సిడెస్ బెంజ్ CLA ఎలక్ట్రిక్ భద్రత

Advertisement

భద్రత పరంగా కొత్త CLA యూరో NCAP 5 స్టార్ భద్రతా రేటింగ్‌ను పొందింది. భద్రతా ఫీచర్లలో ఎనిమిది ఎయిర్‌ బ్యాగ్‌లు, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్‌తో కూడిన 360 డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ASAS ఉన్నాయి.

మెర్సిడెస్ బెంజ్ CLA ఎలక్ట్రిక్  ప్లాట్‌ఫారమ్  

కొత్త CLA ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేయబడిన మెర్సిడెస్ బెంజ్  MMA ఆర్కిటెక్చర్ ద్వారా సపోర్ట్ తీసుకుంది. కొత్త CLA దాని పెట్రో మోడల్ తో పోల్చితే పరిమాణంలో పెరిగింది.  101 లీటర్ ఫ్రంట్ స్టోరేజ్ కంపార్ట్‌ మెంట్, 405 లీటర్ల బూట్‌ స్పేస్ ను కలిగి ఉంటుంది.

Read Also: ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ వచ్చేస్తోంది, హ్యాపీగా గాల్లో ఎగిరిపోవచ్చు!

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×