Vaibhav Suryavanshi Car: టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ( Vaibhav Suryavanshi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సందర్భంగా హాట్ టాపిక్ గా మారిన వైభవ్ సూర్యవంశీ, ప్రస్తుతం అండర్ 19 జట్టులో కొనసాగుతున్నాడు. అయితే అలాంటి వైభవ్ సూర్యవంశీకి అరుదైన కానుక దక్కింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ సందర్భంగా అద్భుతంగా రాణించిన ఈ 14 సంవత్సరాల వైభవ్ సూర్య వంశీకి ఖరీదైన కారు గిఫ్ట్ గా ఇచ్చింది టాటా కంపెనీ ( Tata Motors ). మార్కెట్లోకి కొత్తగా వచ్చిన టాటా కర్వ్ ( Tata Curvv ) కారును బహుమతిగా అందజేసింది టాటా కంపెనీ. ఈ మేరకు వైభవ్ సూర్యవంశీ ఫ్యామిలీ సమక్షంలోనే ఈ గిఫ్ట్ ఇచ్చింది కంపెనీ. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ( IPL 2025 performance) సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగాడు వైభవ్ సూర్య వంశీ. ఆ సమయంలో 13 సంవత్సరాలు వయసు అతనిది. ఈ నేపథ్యంలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో అడుగుపెట్టిన అతిపిన్న వయసుకుడిగా వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. దానికి తగ్గట్టుగానే ఆట ప్రదర్శన కనబరిచాడు వైభవ్ సూర్య వంశీ. అలాంటి వైభవ్ సూర్య వంశీ టాలెంట్ గుర్తించిన టాటా కంపెనీ, తాజాగా అతనికి అరుదైన గిఫ్ట్ అందజేసింది. కొత్తగా మార్కెట్లోకి రిలీజ్ అయిన టాటా కర్వ్ కారును వైభవ్ సూర్య వంశీ ఇచ్చింది. ఈ కారు ధర దాదాపు 20 లక్షల వరకు ఉంటుందట.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ద సీజన్ అవార్డు కింద ఈ బహుమతిని అంద జేసింది టాటా కంపెనీ. పాట్నాలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఈ కారును వైభవ్ సూర్య వంశీకి అందజేశారు. ఇది ఇలా ఉండగా వైభవ్ సూర్య వంశీ ప్రస్తుత వయసు 14 సంవత్సరాలు. అతనికి డ్రైవింగ్ లైసెన్స్ ఇంకా రాలేదు. రూల్స్ ప్రకారం బదిని సంవత్సరాలు నిండితేనే డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు. అలాంటి వైభవ్ సూర్యవంశీకి టాటా కంపెనీ కారు ఇవ్వడం ఇప్పుడు వివాదంగా మారింది. డ్రైవింగ్ లైసెన్స్ లేనివాడికి ఎందుకు కారు ఇచ్చారని టాటా కంపెనీ పై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ టాటా కర్వ్ ధర 20 లక్షల వరకు ఉంటుందని చెబుతున్నారు. ఇందులో 12.3 ఇంచుల డిస్ ప్లే స్క్రీన్ కూడా ఉంటుందట. 9 స్పీకర్లతో కూడిన జేబీఎల్ సిస్టం కూడా అందిస్తున్నారు. ఈ కారు 15 నిమిషాల్లోనే 150 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఆరు ఎయిర్ బ్యాగ్స్ అందిస్తున్నారు. 360 డిగ్రీ కెమెరా కూడా ఈ కారుకు కంపెనీ అందిస్తోంది.
🚨 A NEW CAR FOR VAIBHAV 🚨
– Tata Motets gifted a "Tata Curvv" to Vaibhav Suryavanshi for the Super striker of the season Award in IPL 2025. 🚗 pic.twitter.com/XBBpTpVtbf
— Tanuj (@ImTanujSingh) February 24, 2026