E-Paper
Advertisement

టాటా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు, ఆ ఈవీపై ఏకంగా రూ. 3.50 లక్షల తగ్గింపు!

టాటా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు, ఆ ఈవీపై ఏకంగా రూ. 3.50 లక్షల తగ్గింపు!
Advertisement

Big Deals on Tata Electric Cars: ఈ నెలలో ఎలక్ట్రిక్ కార్లు కొనాలనుకునే వారికి టాటా మోటార్స్ అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. కంపెనీ తన పాపులర్ ఈవీ మోడల్స్ అయిన టాటా టియాగో ఈవీ, టాటా పంచ్ ఈవీ, టాటా నెక్సాన్ ఈవీ, టాటా కర్వ్ ఈవీ, టాటా హారియర్ ఈవీపై గరిష్టంగా రూ. 3.50 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్లలో గ్రీన్ బోనస్, ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ బోనస్ తో పాటు ఇప్పటికే టాటా కార్లు వాడుతున్న వారికి లాయల్టీ బోనస్ లాంటి  ప్రయోజనాలు ఉన్నాయి.

ఏ మోడల్ పై ఎంత తగ్గింపు అంటే?

మోడల్ వారీగా చూస్తే, టాటా టియాగో ఈవీపై సుమారు రూ. 1.60 లక్షల వరకు బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి. పాత మోడల్ టాటా పంచ్ ఈవీపై కూడా దాదాపు ఇదే స్థాయి ఆఫర్లు లభిస్తున్నాయి. ఇక టాటా నెక్సాన్ ఈవీపై తక్కువగా అయినా రూ. 70,000 వరకు తగ్గింపు ఉంది. అయితే, ఈ నెలలో అత్యధిక లాభం పొందే మోడల్ టాటా కర్వ్ ఈవీ. దీనిపై రూ. 3.50 లక్షల వరకు భారీ ఆఫర్లు అందిస్తోంది. అటు టాటా హారియర్ ఈవీపై రూ. 2.75 లక్షల వరకు ప్రయోజనాలు ఉన్నాయి. అయితే, తాజా టాటా పంచ్ ఈవీ కొత్త వెర్షన్, టాటా టిగోర్ ఈవీపై ఈ నెలలో ఎలాంటి ఆఫర్లు లేవని కంపెనీ స్పష్టం చేసింది. అంటే, ఈ మోడళ్లను కొనుగోలు చేసే వారికి ప్రస్తుతం తగ్గింపులు అందుబాటులో లేవు.

ఈవీ మార్కెట్ లో సత్తా చాటుతున్న టాటా మోటార్స్

Advertisement

నిజానికి టాటా ఈవీ మార్కెట్‌ లో బలమైన స్థానం కొనసాగిస్తోంది. FADA విడుదల చేసిన డేటా ప్రకారం, FY26లో టాటా ఈవీ దాదాపు 39.42% మార్కెట్ వాటాతో దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహన తయారీదారుగా నిలిచింది. కంపెనీ అమ్మకాలు కూడా గణనీయంగా పెరిగాయి. FY25లో 57,994 యూనిట్లు విక్రయించగా, FY26లో ఇది 78,811 యూనిట్లకు పెరిగింది. సుమారు 35.9% వృద్ధిని సూచిస్తోంది. కేవలం ఈవీలే కాకుండా, టాటా మోటార్స్ తమ సాధారణ ఇంధన (ICE) వాహనాలపై కూడా ఈ నెలలో రూ. 55,000 వరకు ఆఫర్లను అందిస్తోంది. దీంతో అన్ని విభాగాల్లో వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.

టాటాతో పోటీ పడుతున్న కంపెనీలు

ఇక పోటీదారుల విషయానికి వస్తే, మారుతి సుజుకి ఈ నెలలో తన కార్లపై రూ. 2.15 లక్షల వరకు ఆఫర్లను ప్రకటించింది. మరోవైపు హ్యుండాయ్ మోటార్ ఇండియా ఎంపిక చేసిన మోడళ్లపై రూ. 60,000 వరకు తగ్గింపులను అందిస్తోంది. మొత్తంగా ఈ ఏప్రిల్ నెలలో ఎలక్ట్రిక్ వాహనం కొనాలనుకునే వారికి టాటా మంచి అవకాశాన్ని అందిస్తోంది. ముఖ్యంగా కర్వ్,  హారియర్ లాంటి మోడళ్లపై ఉన్న భారీ ఆఫర్లు వినియోగదారులకు బాగా ఆకట్టుకుంటున్నాయి.

Advertisement

Read Also: కారు ఇండికేటర్ వేసినప్పుడు ‘టిక్ టిక్’ సౌండ్ వస్తుంది, ఎందుకో తెలుసా?

Related News

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

బజాజ్ బిగ్ రికార్డ్.. 3 లక్షల EV అమ్మకాలు దాటేసింది!

8 నెలల్లోనే 10 లక్షలు.. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్ లో అదిరిపోయే రికార్డ్!

హ్యుందాయ్ కొత్త SUV ఇంటీరియర్ లీక్.. క్రెటాకు పోటీ తప్పదా?

మాన్యువల్ కార్ల కంటే ఆటోమేటిక్ కార్లే ఫాస్టా? ఇదీ అసలు కథ!

ఏంటీ.. మారుతీ, హుందాయ్‌లో 5 స్టార్ సేఫ్టీ కార్లు ఉన్నాయా? ఇదిగో లిస్టు!

యమహా R2 వచ్చేసింది.. ఈ బైక్‌ లో అదిరిపోయే 5 హైలైట్స్ ఇవే!

సింపుల్ ఫ్లిప్ అప్ కాదు.. ఈ హెల్మెట్ 180 డిగ్రీలు తిరుగుతుంది!

Big Stories

Advertisement
×