E-Paper
Advertisement

కారు ఇండికేటర్ వేసినప్పుడు ‘టిక్ టిక్’ సౌండ్ వస్తుంది, ఎందుకో తెలుసా?

కారు ఇండికేటర్ వేసినప్పుడు ‘టిక్ టిక్’ సౌండ్ వస్తుంది, ఎందుకో తెలుసా?
Advertisement

Car Indicator Tick Sound Secret: కారు నడిపేటప్పుడు తరచుగా చిన్న సౌండ్ వినిపిస్తుంది. ఇండికేటర్ ఆన్ చేసినప్పుడు ‘టిక్ టిక్’ అని శబ్దం వస్తుంది. ఈ సౌండ్ చాలా కామన్ గా అనిపించినా, దాని వెనుక ఉన్న కారణం తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు. చాలా మంది డ్రైవర్లు ఈ శబ్దాన్ని గమనిస్తారు. కానీ, ఎందుకు వస్తుందో ఎక్కువగా ఆలోచించరు. ఇప్పుడు ఆ సౌండ్ వెనుక సీక్రెట్ గురించి తెలుసుకుందాం..

ఇండికేటర్ సౌండ్ వెనుక సీక్రెట్

వాస్తవానికి, ఇండికేటర్ సౌండ్ డ్రైవర్‌ కు గుర్తు చేసే విధంగా పని చేస్తుంది. మీరు కారు మలుపు తిరగడానికి, లేన్ మార్చడానికి ఇండికేటర్ ఆన్ చేస్తారు. పని అయిపోయిన తర్వాత దాన్ని ఆఫ్ చేయడం కొన్నిసార్లు మర్చిపోతారు. అప్పుడు ఈ  టిక్ టిక్ శబ్దం వినిపిస్తూ, ఇండికేటర్ ఇంకా ఆన్‌లోనే ఉందని గుర్తు చేస్తుంది. దీని వల్ల మీరు సమయానికి దాన్ని ఆఫ్ చేయగలుగుతారు. లేకపోతే, ఇండికేటర్ ఆన్‌ లోనే ఉండిపోతే, ఇతర డ్రైవర్లు మీ నెక్స్ మూవ్ గురించి తప్పుగా  అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ప్రమాదాలకు దారితీస్తుంది.

Advertisement

నిజానికి పాతకాలం కార్లలో ఈ శబ్దం ఒక ప్రత్యేక యాంత్రిక భాగం వల్ల వచ్చేది. దాన్ని ఫ్లాషర్ రిలే అంటారు. ఇందులో ఒక లోహపు భాగం వేడి-చల్లబడే ప్రక్రియలో వంగుతూ, మళ్లీ సరిగా మారుతూ ఉండేది. ఈ చర్య వల్లే లైట్ ఆన్ ఆఫ్ అవుతూ, టిక్ టిక్ శబ్దం వినిపించేది. అంటే, అప్పట్లో ఈ శబ్దం మెకానికల్ వ్యవస్థ కారణంగా సహజంగా వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఆధునిక కార్లలో ఎక్కువగా ఎలక్ట్రానిక్ సిస్టమ్‌లు ఉపయోగిస్తున్నారు. మైక్రోచిప్‌లు, సెన్సర్లు ఇండికేటర్‌ను నియంత్రిస్తాయి. అయినప్పటికీ, తయారీదారులు అదే టిక్ టిక్ శబ్దాన్ని కొనసాగిస్తున్నారు. అది సహజంగా రాకపోయినా, కారు స్పీకర్ల ద్వారా కృత్రిమంగా వినిపించేలా చేస్తారు. ఎందుకంటే డ్రైవర్లు ఆ శబ్దానికి అలవాటు పడిపోయారు. అది లేకపోతే, ఇండికేటర్ ఆన్‌ లో ఉందో లేదో గమనించకపోవచ్చు.

భద్రత పరంగా కీలకమైన ఫీచర్

ఈ శబ్దం భద్రత పరంగా కూడా చాలా ముఖ్యమైనది. ఇండికేటర్ సరిగ్గా పనిచేస్తోందని డ్రైవర్‌కు వెంటనే తెలియజేస్తుంది. ఒకవేళ ఆ శబ్దం అకస్మాత్తుగా వేగంగా మారితే, అసాధారణంగా వినిపిస్తే సమస్య ఉందని వెంటనే గమనించే అవకాశం ఉంటుంది. ముందుగానే సమస్యను గుర్తించే అవకాశం కూడా ఇస్తుంది. ఇప్పటి కార్లు ఎంతో ఆధునికంగా మారుతున్నా, ఈ చిన్న శబ్దాన్ని మాత్రం పూర్తిగా తీసేయడం లేదు. ఎందుకంటే డ్రైవర్‌ కు ఉపయోగపడే  ముఖ్యమైన ఫీచర్‌గా మారింది. కొన్ని ప్రీమియం కార్లలో ఈ శబ్దాన్ని మార్చుకునే ఆప్షన్ ఉంటుంది. కానీ, పూర్తిగా తొలగించే అవకాశం చాలా తక్కువ.  ఇండికేటర్ టిక్ టిక్ శబ్దం ఒక చిన్న విషయం లాగా కనిపించినా,  డ్రైవింగ్‌ను మరింత సురక్షితంగా, సులభంగా చేసే ఒక ముఖ్యమైన భాగంగా కొనసాగుతుంది.

Advertisement

Read Also: టయోటా హైరైడర్ vs హ్యుందాయ్ క్రెటా.. ఏది బెస్ట్ SUV?

Related News

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×