Massive Demand for Tata Harrier EV: టాటా నుంచి త్వరలో విడుదల కాబోతున్న హారియర్ EVకి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. బుకింగ్స్ ప్రారంభించిన తొలి రోజే ఏకంగా 10,000 బుకింగ్ అయినట్లు టాటా మోటార్స్ ప్రకటించింది. ఎలక్ట్రిక్ SUV ఉత్పత్తిని రీసెంట్ గా ప్రారంభం అయ్యింది. ఈ మోడల్ త్వరలో డీలర్‌షిప్‌లకు చేరుకుంటుంది. డెలివరీలు ఈ నెల చివరిలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
టాటా హారియర్ EV అధునాతన acti.ev+ ఆర్కిటెక్చర్‌పై రూపొందుతోంది. ఈ ఎలక్ట్రిక్ SUV రెండు డ్రైవ్ ట్రెయిన్ కాన్ఫిగరేషన్‌లలో అందించబడుతుంది. అందులో ఒకటి రియర్ వీల్ డ్రైవ్ (RWD) కాగా, మరొకటి క్వాడ్ వీల్ డ్రైవ్ (QWD). RWD వెర్షన్ వెనుక యాక్సిల్ పై ఉంచిన ఒకే మోటారును ఉపయోగిస్తుంది. అయితే QWD వేరియంట్ మెరుగైన పనితీరు, ట్రాక్షన్ కోసం డ్యూయల్ మోటార్లతో ప్రతి యాక్సిల్ పై ఒకటి అమర్చబడి ఉంటుంది.
హారియర్ EV RWD వెర్షన్ దాని సింగిల్ మోటార్ ద్వారా 235 bhp, 315 Nm టార్క్ ను అందిస్తుంది. డ్యూయల్ మోటార్లతో కూడిన QWD సెటప్, 391 bhp అవుట్ పుట్, 504 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలలో వస్తోంది. అందులో ఒకటి ప్రామాణిక 65 kWh బ్యాటరీ ఉంటుంది. ఇది ఒకే ఛార్జ్ తో 538 కి.మీ MIDC సర్టిఫైడ్ పరిధిని అందిస్తుంది. అటు 75 kWh బ్యాటరీ RWDలో 627 కి.మీ, QWD రూపంలో 622 కి.మీ రేంజ్ ను అందిస్తుంది.
హారియర్ EV ఆధునిక లక్షణాలు, సాంకేతికతను కలిగి ఉంటుంది. ఇది ఆల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, హర్మాన్ తో అభివృద్ధి చేసిన హై ఎండ్ Samsung Neo QLED ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, డాల్బీ అట్మోస్ ఆడియో ఎక్స్ పీరియెన్స్ ను అందిస్తుంది. 540 డిగ్రీల కెమెరా సిస్టమ్ వాహనం చుట్టూ చూసే అవకాశం కల్పిస్తుంది. ముఖ్యంగా ఇరుకైన ప్రదేశాలు, పార్కింగ్ ప్రదేశాల్లో ఉపయోగపడుతుంది. డిజిటల్ ఇన్సైడ్ రియర్ వ్యూ మిర్రర్, ప్రత్యేకమైన పారదర్శక హుడ్ వ్యూ ఫంక్షన్ ఉన్నాయి. ఇది కారు కింద ఉన్న పరిస్థితులను చూసే అవకాశం ఉంటుంది. అదే సమయంలో నావిగేషన్‌కు సహాయపడుతుంది.
Read Also: టాటా పంచ్ EV ఫేస్ లిఫ్ట్.. రెడ్ కలర్ లో భలే ఉంది గురూ!
టాటా హారియర్ EV నాలుగు రంగుల్లో అందుబాటులోకి రాబోతోంది. నైనిటాల్ నాక్టర్న్, ఎంపవర్డ్ ఆక్సైడ్, ప్రిస్టైన్ వైట్, ప్యూర్ గ్రే రంగుల్లో విడుదల కాబోతోంది. టాటా ప్రారంభ లాంచ్ లైనప్ లో భాగంగా బోల్డ్, ఆల్ బ్లాక్ స్టీల్త్ ఎడిషన్ ను ప్రవేశపెట్టింది. ఇది EVకి స్పోర్టియర్, మరింత అగ్రెసివ్ లుక్ ను అందిస్తుంది.
Read Also: మారుతి కార్లలో ఇప్పటికీ హాట్ ఫేవరెట్ ఆల్టో 800.. త్వరలో ఫేస్ లిఫ్ట్ వస్తుందా?