E-Paper
Advertisement

టాటా SUVలపై బంపర్ ఆఫర్లు.. హారియర్, సఫారీ మరీ ఇంత చౌకా?

టాటా SUVలపై బంపర్ ఆఫర్లు.. హారియర్, సఫారీ మరీ ఇంత చౌకా?
Advertisement

Tata May 2026 Offers: ఈ నెలలో కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి దేశీయ ఆటో మోబైల్ దిగ్గజం టాటా మోటార్స్ మంచి ఆఫర్లను ప్రకటించింది. కంపెనీ తన పెట్రోల్, డీజిల్తో పాటు CNG మోడళ్లపై భారీ డిస్కౌంట్స్ అందిస్తోంది. ముఖ్యంగా హారియర్, సఫారీ SUVలపై  పెద్ద మొత్తంలో డిస్కౌంట్లు ఇస్తోంది. క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ బెనిఫిట్స్, కార్పొరేట్ ఆఫర్లు, లాయల్టీ బోనస్‌ ల రూపంలో తగ్గింపు అందిస్తోంది. ఈ ఆఫర్లు సిటీని బట్టి మారే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. ఇంతకీ ఏ మోడల్ పై ఎంత తగ్గింపు అందిస్తుందో ఇప్పుడు చూద్దాం..

⦿ టాటా సఫారీ: రూ.75,000

ఈ నెలలో ఎక్కువ తగ్గింపు పొందుతున్న మోడళ్లలో టాటా సఫారీ ముందుంది. ఈ ఫ్లాగ్‌ షిప్ SUVపై రూ.75,000 వరకు బెనిఫిట్స్ అందిస్తుంది. MY2025 మోడళ్లపై రూ.25,000 నగదు తగ్గింపు, రూ.50,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ ఇస్తుంది.  MY2026 మోడళ్లపై కూడా రూ.45,000 వరకు తగ్గింపు ప్రకటించింది. స్క్రాపేజ్ బోనస్ కూడా అదనంగా అందిస్తుంది.

⦿ టాటా హారియర్‌: రూ.75,000

Advertisement

హారియర్ పైనా సఫారీతో సమానమైన ఆఫర్లు ఉన్నాయి. MY2025 హారియర్‌ పై గరిష్టంగా రూ.75,000 వరకు తగ్గింపు లభిస్తుంది. MY2026 మోడళ్లపై రూ.45,000 వరకు తగ్గింపు ప్రకటించింది. క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

⦿ టాటా పంచ్ CNG: రూ.60,000

అటు టాటా పంచ్ CNGపై రూ.60,000 వరకు బెనిఫిట్స్ అందిస్తుంది. వీటిలో నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్ బోనస్, లాయల్టీ బెనిఫిట్స్ ఉన్నాయి. పెట్రోల్ వేరియంట్‌పై కూడా ఇవే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. స్క్రాపేజ్ బెనిఫిట్స్ అదనంగా లభిస్తాయి.

⦿ టాటా కర్వ్‌: రూ.55,000

Advertisement

కొత్తగా వచ్చిన టాటా కర్వ్‌ పై కూడా భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. MY2026 కర్వ్ కొనుగోలు చేసే వారికి రూ.55,000 వరకు ప్రయోజనాలు లభిస్తాయి. ఇందులో నగదు తగ్గింపుతో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఉంది. MY2025 మోడళ్లపై కూడా ప్రత్యేక ఆఫర్లు కొనసాగుతున్నాయి.

⦿ టాటా నెక్సాన్‌: రూ.50,000

ఈ మోడల్ పైనా మేలో ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. పెట్రోల్, CNG, డీజిల్ వేరియంట్లపై వేర్వేరు ఆఫర్లు ప్రకటించారు. MY2025 నెక్సాన్ కొనుగోలు చేసే వారికి మొత్తం రూ.50,000 వరకు బెనిఫిట్స్ లభించే అవకాశం ఉంది. ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ ప్రోత్సాహకాలు, లాయల్టీ బోనస్ కూడా అందిస్తున్నారు.

మొత్తంగా మే 2026లో టాటా మోటార్స్ దాదాపు అన్ని పాపులర్ మోడళ్లపై భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. కొత్త SUV, హ్యాచ్‌ బ్యాక్ కొనాలని భావిస్తున్న వారికి  ఇదే బెస్ట్ టైమ్ అని ఆటో నిపుణులు చెబుతున్నారు.

Read Also: 300 కి.మీ రేంజ్.. చౌక ధర.. BYD సెల్ప్ డ్రైవింగ్ ఈవీ వచ్చేస్తోంది!

Related News

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

వర్షాకాలంలో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ఈ 4 మోడల్స్ బెస్ట్ ఛాయిస్!

Big Stories

Advertisement
×