E-Paper
Advertisement

TATA Cars Discounts Jan 2026: టాటా జనవరి డిస్కౌంట్స్, ఆ కార్లపై ఏకంగా రూ. 85 వేల తగ్గింపు!

TATA Cars Discounts Jan 2026: టాటా జనవరి డిస్కౌంట్స్, ఆ కార్లపై ఏకంగా రూ. 85 వేల తగ్గింపు!
Advertisement

ఇండియన్ ఆటో మోబైల్ దిగ్గజం టాటా మోటార్స్ కొత్త సంవత్సరంలో సరికొత్త మోడల్స్ ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ సెగ్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది. అదే సమయంలో ఆయా మోడల్స్ మీద భారీగా తగ్గింపు ఇస్తుంది. జనవరి 2026లో టాటా మోటార్స్ కార్లపై అందుబాటులో ఉన్న డిస్కౌంట్లు, బెనిఫిట్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఆఫర్లు జనవరి 1 నుంచి 31 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ తగ్గింపు కేవలంపెట్రోల్, డీజిల్, CNG మోడల్స్‌ పైనే ఉంటుంది. MY2024 నుంచి MY2025 స్టాక్‌ మీద కాస్త ఎక్కువగా డిస్కౌంట్ అందిస్తుంది. అదే సమయంలో  కార్పొరేట్ డిస్కౌంట్, SBI Yono డిస్కౌంట్, లాయల్టీ బోనస్, ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్ బోనస్ లాంటి ఎక్ట్స్టా బెనిఫిట్స్ కూడా ఇస్తుంది.

ఏ మోడల్ మీద ఎంత డిస్కౌంట్ లభిస్తుందంటే?  

 

⦿ Tiago, Tigor

Advertisement

ఈ రెండు కార్లకు సంబంధించి అన్ని వేరియంట్స్ మీద రూ. 35,000 వరకు తగ్గింపు అందిస్తుంది. Tiago XEకి మాత్రం ఇవ్వడం లేదు. ఈ మోడల్స్ కు సంబంధించి మే 2024 నుంచి మే 2025 వరకు ఉన్న మోడల్స్ కే అందిస్తుంది.

⦿ Altroz

ఈ ఫేస్ లిఫ్ట్ అన్ని వేరియంట్స్ కు రూ. 25,000 వరకు తగ్గింపు అందిస్తుంది. పెట్రోల్, డీజిల్, CNG వేరియంట్స్ ఈ తగ్గింపును పొందుతాయి. ప్రీ ఫేస్‌ లిఫ్ట్‌ పై అదనపు డిస్కౌంట్ ఉండవచ్చు.

⦿ Punch

Advertisement

ఈ మోడల్ కు సంబంధించి పెట్రోల్, CNG వేరియంట్ల మీద లాయల్టీ బోనస్ రూ.20,000 కలిపి రూ. 40,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

⦿ Nexon

ఈ మోడల్ కు సంబంధించి పెట్రోల్, డీజిల్, CNG కార్ల మీద రూ.50,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో లాయల్టీ బోనస్ రూ. 20,000 ఉంటుంది.

⦿ Curvv

ఈ మోడల్ కు కంపెనీ రూ. 40,000 బోనస్ ఇస్తుంది. కానీ, ఇందులో లాయల్టీ బోనస్ లేదు. కన్జ్యూమర్ + ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది.

⦿ Harrier & Safari

ఈ మోడల్ కు సంబంధించి డీజిల్ వేరియంట్ల అయిన పోస్ట్ X,  X+ అప్‌ డేట్ మీద రూ. 75,000 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది.  ఇందులో రూ. 25,000 కన్జ్యూమర్, రూ. 50,000 ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్ ఆఫర్ లభిస్తుంది.  పెట్రోల్ వేరియంట్లపై సెపరేట్ ఆఫర్లు ఉన్నాయి.

⦿ Altroz ఓల్డ్ వేరియంట్స్

ఈ మోడల్ కు సంబంధించి పాత వేరియంట్స్ అయిన పెట్రోల్, డీజిల్, CNG మీద ఏకంగా రూ. 85,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

మే 2025 వరకు ఉన్న స్టాక్ ను క్లియర్ చేయడానికి టాటా కంపెనీ ఈ ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొన్ని సోర్సెస్‌లో హారియర్, సఫారీ మీద ఏకంగా రూ. 1.25 లక్షల వరకు  ఆఫర్ చూపించారు. కానీ, తాజా ప్రకటన ప్రకారం రూ.75,000గా ఉంది. డిస్కౌంట్లు సిటీ, డీలర్, స్టాక్ బట్టి మారే అవకాశం ఉంది. ఒకవేళ కచ్చితమైన వివరాలు తెలుసుకోవాలంటే దగ్గర లోని టాటా డీలర్ ను సంప్రదించడం మంచిది.

Read Also:  కియా నుంచి కొత్త కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUV లాంచ్, EV2 ప్రత్యేకత ఏంటో తెలుసా?

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×