E-Paper
Advertisement

Jio Recharge Plan 2026: నెలకు రూ.82 మాత్రమే.. 11 నెలల పాటు.. ఫ్రీ కాల్స్, ఓటీటీలు, హై స్పీడ్ డేటా!

Jio Recharge Plan 2026: నెలకు రూ.82 మాత్రమే.. 11 నెలల పాటు.. ఫ్రీ కాల్స్, ఓటీటీలు, హై స్పీడ్ డేటా!
Advertisement

Jio Recharge Plan 2026: జియో తన వినియోగదారుల కోసం ఎన్నో రకాల రీఛార్జ్ ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాటిలో బడ్జెట్ పరంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ప్లాన్ ఒకటి ఉంది. అదే రూ. 895 రీఛార్జ్ ప్లాన్. తక్కువ బడ్జెట్ లో మంచి ప్లాన్ కోరుకుంటున్న వారికి ఇది బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తోంది.

ఈ ప్లాన్ ఎవరి కోసం?

ఈ ప్లాన్ కేవలం ‘జియో ఫోన్’ (JioPhone), ‘జియో భారత్’ (JioBharat) ఫోన్లను ఉపయోగిస్తున్న వారికి మాత్రమే వర్తిస్తుంది. సాధారణ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఈ ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకోవడానికి వీలుండదు.

రూ. 895 ప్లాన్ ప్రయోజనాలు

Advertisement

ఈ ప్లాన్ ను 336 రోజుల వ్యాలిడిటీతో (దాదాపు 11 నెలలు).. జియో తీసుకొచ్చింది. ప్లాన్ వ్యవధి పూర్తయ్యే వరకు దేశవ్యాప్తంగా అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. మరోవైపు ప్లాన్ మెుత్తానికి 24GB హై స్పీడ్ డేటా లభిస్తుంది. ప్రతి 28 రోజులకు 2GB చొప్పున 12 సార్లు డేటా లభిస్తుంది. అలాగే ప్రతి 28 రోజులకు 50 SMSలు చొప్పున ప్లాన్ పూర్తయ్యే నాటికి 600 SMSలు లభిస్తాయి. అలాగే అదనపు ప్రయోజనాల కింద జియో టీవీ (JioTV), జియో సినిమా (JioCinema), జియో క్లౌడ్ (JioCloud) వంటి యాప్స్‌కు ఉచిత యాక్సెస్ పొందవచ్చు.

యూజర్లకు కలిగే లాభాలు

ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడం యూజర్లకు తరుచూ రీఛార్జ్ చేసుకునే పని తప్పుతుంది. ఏడాదిలో ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే, దాదాపు 11 నెలల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా కాల్స్, డేటా సేవలను పొందవచ్చు. పైగా నెలవారీగా చూస్తే నెలకు రూ.82 మాత్రమే యూజర్ కు ఖర్చు అవుతుంది. ఒక రోజుకు అయితే రూ.3 మాత్రమే పడుతుంది. కాబట్టి దీనిని అత్యంత బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్ గా చెప్పవచ్చు.

ఎవరికి బాగా ఉపయోగం?

Advertisement

తరచుగా రీఛార్జ్ చేయడం తెలియని లేదా మర్చిపోయే వృద్ధులకు ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అలాగే ఇంటర్నెట్ వినియోగం తక్కువగా ఉండి కేవలం కాలింగ్, బేసిక్ మెసేజింగ్ కోసం ఫోన్ వాడే వారికి ఇది ఉత్తమమైన ఆప్షన్. తక్కువ ఖర్చుతో ఏడాది పాటు ఫోన్ సర్వీస్ కొనసాగించాలనుకునే వారికి సైతం ఇది ఒక గొప్ప ప్లాన్ గా చెప్పవచ్చు.

Also Read: Induction Stove Offers: అయ్యబాబోయ్.. బ్రాండెడ్ ఇండక్షన్ స్టవ్స్‌పై.. ఎగిరిగంతేసే ఆఫర్లు!

ఎలా రీఛార్జ్ చేసుకోవాలి?

మీ ఫోన్‌లో మై జియో (MyJio) యాప్‌ను ఓపెన్ చేసి ‘Recharge’ సెక్షన్‌లోకి వెళ్లండి. అక్కడ ‘JioPhone’ లేదా ‘JioBharat’ ప్లాన్‌ల కేటగిరీలో ఈ రూ. 895 ప్లాన్‌ను ఎంచుకుని పేమెంట్ పూర్తి చేయండి. యాప్ లేకుంటే జియో అధికారిక వెబ్‌సైట్ Jio.com లోకి వెళ్లి మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేసి ప్లాన్స్ లిస్ట్‌లో ఈ ప్లాన్‌ను ఎంచుకుని ఆన్‌లైన్ పేమెంట్ చేయవచ్చు. అదే విధంగా Google Pay, PhonePe, లేదా Paytm వంటి యాప్స్ ద్వారా కూడా మీ నంబర్‌కు ఈ ప్లాన్ ను రీఛార్జ్ చేసుకోవచ్చు. లేదంటే రిటైల్ షాపుల వద్దకి వెళ్లైనా ఈ ప్లాన్ ను పొందవచ్చు.

Also Read: Air Cooler: కూలర్‌ను నీరు లేకుండా వాడొచ్చా? ఒకవేళ వాడితే ఏం జరుగుతుంది?

Related News

iPhone 18 Pro కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. లేదంటే లబోదిబోమనాల్సిందే!

రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

Big Stories

Advertisement
×