E-Paper
Advertisement

TATA Feb 2026 Discounts: టాటా ఈవీలపై అదిరిపోయే ఆఫర్లు, ఆ కార్లపై ఏకంగా రూ. 3.80 లక్షల తగ్గింపు!

TATA Feb 2026 Discounts: టాటా ఈవీలపై అదిరిపోయే ఆఫర్లు, ఆ కార్లపై ఏకంగా రూ. 3.80 లక్షల తగ్గింపు!
Advertisement

TATA EVs Feb 2026 Discounts:  టాటా మోటార్స్ ఫిబ్రవరి 2026లో క్రేజీ ఆఫర్లను ప్రకటించింది. ఈ నెలలో టిగోర్ ఈవీ మినహా తన ఎలక్ట్రిక్ లైనప్ కోసం డిస్కౌంట్లను అనౌన్స్ చేసింది. ఈ బ్రాండ్ ICE మోడళ్లపై అందించే ప్రయోజనాల మాదిరిగా కాకుండా, టాటా ఈవీలపై ఫిబ్రవరి 2026 డిస్కౌంట్లు అందిస్తోంది. ఈ డిస్కౌంట్ 2025తో పాటు 2026 మోడల్స్ కూడా వర్తించనుంది.  అయితే, MY2025 కార్లపై డిస్కౌంట్లు MY2026 కార్ల కంటే ఎక్కువ డిస్కౌంట్లు ఉన్నాయి. టిగోర్ ఈవీ ధరల విషయంలో ఎలాంటి మార్పులు, చేర్పులు చేయలేదు.

⦿ కర్వ్ ఈవీపై రూ. 3,80,000 వరకు..

టాటా అన్ని ఎలక్ట్రిక్ మోడళ్లతో పోల్చితే కర్వ్ ఈవీ అత్యధిక తగ్గింపులను అందిస్తుంది. ఈ ఫిబ్రవరిలో 2025 ఇయర్ మోడల్  కర్వ్ EVప ఏకంగా రూ. 3,80,000 వరకు డిస్కౌంట్ అందిస్తుంది. అదే సమయంలో,  2026 ఇయర్ మోడల్ మీద రూ. 3,30,000 వరకు డిస్కౌంట్లు ప్రకటించింది.

⦿ టాటా పంచ్ EVపై రూ. 1,60,000 వరకు..

Advertisement

టాటా పంచ్ EV ఈ బ్రాండ్ కు చెందిన అతి చిన్న, అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ SUV. దీని ధరలు రూ. 9.99 లక్షల నుంచి రూ. 14.44 లక్షల వరకు ఉంటాయి. ఫిబ్రవరి 2026లో ఈ మోడల్ మీద రూ. 1,60,000 వరకు తగ్గింపును అందిస్తుంది. అయితే, 2025 ఇయర్ మోడల్ మీదే ఈ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి

⦿ టాటా హారియర్ EVపై 1,50,000 వరకు..

టాటా  ఫ్లాగ్‌ షిప్ ఎలక్ట్రిక్ SUV, హారియర్ EVపై రూ. 1,50,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. హారియర్ EV  2025,  2026 మోడల్స్ పైనా ఒకేలాంటి ధరల తగ్గింపు ఉంటుంది.  టాటా హారియర్ EV ఎంట్రీ లెవల్ వేరియంట్ ధర రూ. 21.49 లక్షలు ఉండగా, టాప్ వేరియంట్ మీద రూ. 30.23 లక్షలు ఉంటుంది.

⦿ టాటా టియాగో EVపై రూ. 1,50,000 వరకు..

Advertisement

అటు టాటా ఎలక్ట్రిక్ కార్లలో అత్యంత సరసమైన మోడల్ టియాగో EV పై రూ. 1,50,000 వరకు డిస్కౌంట్లు అందిస్తుంది. ఈ  టాటా హ్యాచ్‌ బ్యాక్ డిస్కౌంట్ 2025 మోడల్ యూనిట్లకు మాత్రమే వర్తిస్తుంది. 2026 మోడల్ ఇయర్ టియాగో EVని కొనుగోలు చేసే కస్టమర్లు రూ. 60,000 వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంది.  టాటా టియాగో EV ధర రూ. 7.99 లక్షల నుంచి రూ. 11.14 లక్షల మధ్య ఉంటుంది.

Read Also:  వినియోగదారులకు గుడ్ న్యూస్, హ్యుందాయ్ i20 ధర తగ్గిందోచ్!

⦿ టాటా నెక్సాన్ EVపై రూ. 1,20,000 వరకు..

అటు టాటా ప్రసిద్ధ కాంపాక్ట్ Esuv  నెక్సాన్ EV 2026 మోడల్ ఇయర్ కార్లకు రూ. 30,000 వరకు డిస్కౌంట్ అందిస్తుంది. 2025 బ్యాచ్ పై రూ.1,20,000 వరకు తగ్గింపు అందిస్తుదంఇ. వేరియంట్, ట్రిమ్ స్థాయిని బట్టి నెక్సాన్ EV  ధర రూ.12.49 లక్షల నుంచి రూ.17.49 లక్షల వరకు ఉంటుంది.

Read Also:  2026 రెనాల్ట్ డస్టర్ vs మారుతి సుజుకి విక్టోరిస్.. వీటిలో ఏది బెస్ట్ కారు అంటే?

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×