Tata Punch EV Facelift 2026: దేశీయ ఆటో మోబైల్ దిగ్గజం టాటా మోటార్స్.. టాటా పంచ్ EV ఫేస్ లిఫ్ట్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఉన్న పంచ్ ఈవీతో పోల్చితే కొత్త ఫేస్ లిఫ్ట్ మరింత చౌక ధరకు లభించనుంది. ప్రీ ఫేస్‌లిఫ్ట్ టాటా పంచ్ EV ధర రూ. 9.99 – 14.44 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, 2026 టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ ధర రూ. 9.69 – 12.59 లక్షలు (ఎక్స్-షోరూమ్). కొత్త మోడల్ బేస్ వేరియంట్‌ను రూ. 30,000 తక్కువ ధరకు లభిస్తుంది. పెద్ద బ్యాటరీతో కూడిన టాప్ వేరియంట్ రూ. 1.85 లక్షలు తక్కువ ధరకు లభించనుంది. టాటా పంచ్ EV ఫేస్ లిఫ్ట్ తో టాటా బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చింది.
టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ 3,827 mm పొడవు, 1,742 mm వెడల్పు, 1,615 mm ఎత్తు, 195 mm గ్రౌండ్ క్లియరెన్స్, 2,445 mm వీల్ బేస్, 450 mm వాటర్ వేడింగ్ కెపాసిటీని కలిగి ఉంది. టాటా పంచ్ EV ఫేస్‌లిఫ్ట్ ICE-ఆధారిత టాటా పంచ్ లాగా కనిపిస్తుంది. ముందు భాగంలో, పంచ్ EV ఫేస్‌లిఫ్ట్ క్లీన్, సింపుల్ లుక్‌ను కలిగి ఉంటుంది. గతంలో హెడ్‌ల్యాంప్‌లను లింక్ చేసిన బ్లాక్ ట్రిమ్ ను తొలిగించింది. Y ఆకారపు DRLలను కనెక్ట్ చేసే ఇల్యుమినేటెడ్ లైట్ బార్ అలాగే ఉంచబడింది. హెడ్ ల్యాంప్ అసెంబ్లీలు, ఎయిర్ డ్యామ్ అవుట్‌గోయింగ్ మోడల్ లో ఉన్న వాటి కంటే పెద్దవిగా ఉన్నాయి. పంచ్ EV ఫేస్‌లిఫ్ట్ నోస్ పై ఛార్జింగ్ ఫ్లాప్‌ను కలిగి ఉంది. పక్కపక్కనే ఏరో ఆప్టిమైజ్డ్ అల్లాయ్ వీల్స్, డోర్‌లపై ‘Tata.ev’ బ్యాడ్జ్ లను కలిగి ఉంటుంది. వెనుక డోర్ హ్యాండిల్స్ C పిల్లర్ల పై అమర్చబడి ఉంటాయి. వెనుక వైపు, పంచ్ EV కనెక్ట్ చేయబడిన టెయిల్ లాంప్‌లు, టెక్స్చర్డ్ సిల్వర్ స్కిడ్ ప్లేట్ తో బంపర్‌ను కలిగి ఉంది.
టాటా పంచ్ EV ఫేస్‌లిఫ్ట్ కొత్త డ్యూయల్ టోన్ వైట్, గ్రే ఇంటీరియర్ థీమ్‌ను మినహాయించి, అవుట్ గోయింగ్ మోడల్ తో సమానంగా ఉంటుంది. అదే డాష్‌బోర్డ్ డిజైన్, టాటా లోగోతో రెండు స్పోక్ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, HVAC కోసం గ్లోస్ బ్లాక్ టచ్ సెన్సిటివ్ ప్యానెల్, ఫ్రీ స్టాండింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా, పంచ్ EV ఫేస్‌లిఫ్ట్ సెంటర్ కన్సోల్‌లో గ్లోస్ బ్లాక్ ఫినిషింగ్‌ను కలిగి ఉంటుంది. టాటా పంచ్ EV ఫేస్ లిఫ్ట్ 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కొత్త గ్రాఫిక్స్ తో వస్తుంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 10-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జర్, సింగిల్ పేన్ సన్ రూఫ్, రెయిన్ సెన్సింగ్ వైపర్‌లతో ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంటుంది.
పంచ్ EV ఫేస్‌లిఫ్ట్ ప్రామాణికంగా 6 ఎయిర్ బ్యాగ్‌లు, EBDతో ABS, ESC, ముందు, వెనుక పార్కింగ్ సెన్సార్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఆటో హోల్డ్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, బ్లైండ్ వ్యూ మానిటర్, 360-డిగ్రీ కెమెరా, హిల్ హోల్డ్ అసిస్ట్ లాంటి సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంటుంది.
టాటా పంచ్ EV ఫేస్‌లిఫ్ట్ రెండు బ్యాటరీ ఎంపికలతో అందుబాటులో ఉంది. 30-kWh బ్యాటరీ ప్యాక్, 40-kWh బ్యాటరీ ప్యాక్. టాటా పంచ్ EV మూడు డ్రైవ్ మోడ్‌లతో వస్తుంది. సిటీ, ఎకో, స్పోర్ట్. నాలుగు స్థాయిల రీజెనరేటివ్ బ్రేకింగ్, ప్యాడిల్ షిఫ్టర్‌లతో పని చేస్తాయి. 65 kW DC ఫాస్ట్ ఛార్జింగ్‌తో పంచ్ EVని 26 నిమిషాల్లో 20 శాతం నుండిచి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. టాటా మోటార్స్ జీవితకాలం, అపరిమిత కిలోమీటర్ బ్యాటరీ వారంటీని అందిస్తోంది. 30 kWh బ్యాటరీ ప్యాక్ 88 PS, 154 Nm టార్క్ ను అందిస్తుంది. ఒకే ఛార్జ్ తో 365-375 కి.మీ రేంజ్ అందిస్తుంది. 40 kWh బ్యాటరీ ప్యాక్ 129 PS, 154 Nm టార్క్ ను అందిస్తుంది. ఒకే ఛార్జ్ 468 కి.మీ రేంజ్ అందిస్తుంది.
Read Also: వచ్చేస్తోంది హ్యుందాయ్ ఎక్స్ టర్ ఫేస్‌లిఫ్ట్, ప్రత్యేకతలు చూస్తే మతిపోవాల్సిందే!