E-Paper
Advertisement

CM Revanth Reddy: నేడు వికారాబాద్‌ జిల్లాలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: నేడు వికారాబాద్‌ జిల్లాలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు వికారాబాద్(Vikarabad) జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్‌లో నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) హెలికాప్టర్ ద్వారా అనంతగిరి హిల్స్ చేరుకుంటారు.హరిత రిసార్ట్స్‌ వేదికగా తెలంగాణ(Telangana), ఆంధ్రప్రదేశ్(AP) రాష్ట్రాలకు చెందిన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించనున్నారు.

Also Read: Toll Plaza: టోల్ గేట్ల వద్ద డిజిటల్ విప్లవం.. ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు

ట్రాఫిక్ ఆంక్షలు..

Advertisement

రెండు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం, రాబోయే రాజకీయ సవాళ్లు, క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్‌ను సమన్వయం చేయడంపై ఈ శిక్షణా తరగతుల్లో సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఆయన తిరిగి హైదరాబాద్(Hyderabada) కు రానున్నారు. అయితే ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా జిల్లా యంత్రాంగం, పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అనంతగిరి హిల్స్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో పాటు, హరిత రిసార్ట్స్ వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. సీఎం రాక సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల్లో సంతోషం నెలకొన్నది.

Also Read: TG Anganwadi Centres: మరో కీలక బాధ్యతలను సర్పంచ్‌లకు అప్పగించిన తెలంగాణ సర్కార్..!

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×