E-Paper
Advertisement

టాటా To కియా.. 2026లో లాంచ్ కానున్న 7 సీట్ల SUVలు ఇవే!

టాటా To కియా.. 2026లో లాంచ్ కానున్న 7 సీట్ల SUVలు ఇవే!
Advertisement

Upcoming New Generation 7 Seater SUVs 2026: ఇండియన్ కార్ల మార్కెట్లో 7 సీట్ల SUVలకు డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతోంది. కుటుంబంతో కలిసి లాంగ్ డ్రైవ్‌ లు, టూర్లకు వెళ్లడానికి ఈ కార్లు బెస్ట్ ఆప్షన్ గా మారుతున్నాయి. పెద్ద సైజు, ఎత్తైన డ్రైవింగ్ పొజిషన్, మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్ తో SUVలకు మంచి ఆదరణ లభిస్తోంది. గతంలో మూడు వరుసల సీటింగ్ ఉన్న SUVల్లో చివరి వరుస సీట్లు కొంత ఇరుకుగా అనిపించేవి. అయితే, ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ SUVలు ఎక్కువ స్థలం, మెరుగైన సౌకర్యాలతో వస్తున్నాయి. త్వరలో భారత మార్కెట్లోకి రానున్న టాప్ 5 7 సీట్ల SUVలు ఇప్పటికే ఆటో ప్రియులను ఆకట్టుకుంటున్నాయి.

⦿ టాటా సఫారీ EV

త్వరలో మార్కెట్ లో అడుగు పెట్టబోతున్న టాటా సఫారీ EVపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే హారియర్ EV, సియెర్రా EVలతో ఎలక్ట్రిక్ విభాగంలో దూసుకెళ్తున్న టాటా, ఇప్పుడు సఫారీని కూడా ఎలక్ట్రిక్ రూపంలో తీసుకురానుంది. ఈ SUVలో హారియర్ EVలో ఉపయోగిస్తున్న 75kWh బ్యాటరీ ప్యాక్ ఉండే అవకాశం ఉంది. మూడు వరుసల సీటింగ్ ఉన్నందున మరింత పెద్ద బ్యాటరీని కూడా అందించే అవకాశముంది. ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్, అధిక పవర్ అవుట్‌ పుట్‌ తో ఈ SUV ప్రీమియం సెగ్మెంట్‌ లో నిలవనుంది.

⦿ ఎంజీ మెజెస్టర్

Advertisement

ఇక ఎంజీ మోటార్ నుంచి రాబోతున్న మెజెస్టర్ కూడా మార్కెట్లో ఆసక్తి పెంచుతోంది. టయోటా ఫార్చ్యూనర్‌ కు గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ SUVలో మూడు డిఫరెన్షియల్ లాక్‌లు, 10 ఆఫ్‌ రోడ్ మోడ్‌ లు, పనోరమిక్ సన్‌ రూఫ్, లెవెల్ 2 ADAS లాంటి ఆధునిక ఫీచర్లు ఉంటాయి. ముందు సీట్లకు హీటింగ్, వెంటిలేషన్, మసాజ్ ఫంక్షన్ లాంటి లగ్జరీ ఫీచర్లు కూడా ఇవ్వనున్నారు. పవర్ విషయానికి వస్తే 2.0 లీటర్ ట్విన్ టర్బో డీజిల్ ఇంజన్ 213bhp పవర్‌ ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌ బాక్స్ ఉంటుంది.

⦿ కియా సోరెంటో  

కియా భారత మార్కెట్లో కొత్త సోరెంటో SUVను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇది పూర్తిగా ఆఫ్‌రోడ్ SUV కాకపోయినా, మంచి ఫీచర్లు మరియు హైబ్రిడ్ టెక్నాలజీతో ఆకట్టుకోనుంది. 1.6 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ తో పాటు ఎలక్ట్రిక్ మోటార్ కలిపిన హైబ్రిడ్ సెటప్ ఇందులో ఉండనుంది. అదనంగా 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉండొచ్చు. ఫ్రంట్ వీల్ డ్రైవ్, ఆల్ వీల్ డ్రైవ్ ఎంపికల్లో రానుంది.

⦿ స్కోడా కోడియాక్ RS

Advertisement

ఈ మోడల్ కూడా త్వరలో భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న కోడియాక్ SUVకి ఇది మరింత పవర్ ఫుల్ వెర్షన్‌ గా రానుంది. 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ తో పని చేసే ఈ SUVలో పవర్ అవుట్‌ పుట్ గణనీయంగా పెరుగుతుంది. 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 6.3 సెకన్లలో అందుకునే సామర్థ్యం దీని ప్రత్యేకతగా చెప్పొచ్చు.

⦿ వులింగ్ స్టార్‌ లైట్ 560

ఇక వులింగ్ స్టార్‌లైట్ 560 కూడా త్వరలో MG బ్రాండ్ కింద భారత మార్కెట్లోకి రానుంది. ఈ SUV పరిమాణంలో హెక్టర్ ప్లస్‌ కు సమానంగా ఉండొచ్చు. హైబ్రిడ్, ప్లగ్ ఇన్ హైబ్రిడ్ పవర్‌ ట్రెయిన్‌ లతో ఇది ప్రారంభమయ్యే అవకాశం ఉంది. భవిష్యత్తులో పూర్తి ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా వస్తుందని భావిస్తున్నారు.

Read Also: ఏథర్ EL ప్లాట్‌ ఫారమ్ రెడీ.. ఇక చవక ధరలో కొత్త ఈ-స్కూటర్లు!

Related News

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

బజాజ్ బిగ్ రికార్డ్.. 3 లక్షల EV అమ్మకాలు దాటేసింది!

8 నెలల్లోనే 10 లక్షలు.. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్ లో అదిరిపోయే రికార్డ్!

Big Stories

Advertisement
×