E-Paper
Advertisement

Tata Sierra History: మైలేజ్ టెస్ట్ లో అదరగొట్టిన టాటా సియెర్రా.. బాబోయ్ లీటర్ కు అన్ని కిలోమీటర్లా?

Tata Sierra History:  మైలేజ్ టెస్ట్ లో అదరగొట్టిన టాటా సియెర్రా.. బాబోయ్ లీటర్ కు అన్ని కిలోమీటర్లా?
Advertisement

New Tata Sierra Mileage: టాటా పాపులర్ మోడల్ సియెర్రా.. సరికొత్తగా మార్కెట్లోకి అడుగు పెట్టబోతోంది. సరికొత్త టాటా సియెర్రా నవంబర్ 25, 2025న దేశీ మార్కెట్ లో లాంచ్ అయింది. వచ్చే నెలలో డెలివరీలు ప్రారంభం కానున్నాయి. ఇది మిడ్ సైజ్ SUV సెగ్మెంట్‌ లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా లాంటి కార్లతో పోటీ పడుతుంది. ఐకానిక్ రెట్రో డిజైన్‌ ను మోడర్న్ టెక్నాలజీతో మిళితం చేసిన ఈ SUV ప్రీమియం ఫీచర్లతో అదరగొడుతుంది.

అద్భుతమైన మైలేజ్.. అదిరిపోయే ఇంజిన్ పర్ఫార్మెన్స్

టాటా సియెర్రా 2025 చక్కటి ఇంజిన్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటుంది. రీసెంట్ గా నిర్వహించిన మైలేజ్ టెస్ట్ లో ఏకంగా 29.9 kmpl సాధించింది. ఈ కారు మొత్తం మూడు ఇంజిన్ వేరియంట్స్ తో వస్తుంది.

Advertisement

⦿ 1.5L NA పెట్రోల్: 106 PS, 145 Nm (MT/DCT).

⦿ 1.5L హైపరియన్ టర్బో పెట్రోల్: 160-170 PS, 255-260 Nm (29.9 kmpl).

Advertisement

⦿ 1.5L క్రయోజెట్ టర్బో డీజిల్: 118 PS, 280 Nm.

⦿ టెర్రైన్ మోడ్స్, భవిష్యత్తులో AWD ఆప్షన్.

టాటా సియెర్రా డిజైన్ ప్రత్యేకతలు

ఈ కారు బాక్సీ, మస్క్యులర్ సిల్హౌట్ ను కలిగి ఉంటుంది. పాత సియెర్రా నుంచి ఇన్‌స్పైర్ అయి రూపొందించారు. కనెక్టెడ్ LED లైట్ బార్ ఫ్రంట్, రియర్ లో ఉంటుంది. స్లిమ్ బై-LED హెడ్‌ ల్యాంప్స్ ఉంటాయి. 19-ఇంచుల డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, పనోరమిక్ సన్‌ రూఫ్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, బాడీ క్లాడింగ్, రూఫ్ రెయిల్స్ ను కలిగి ఉంటుంది.  ఫీచర్ల విషయానికి వస్తే ట్రిపుల్ 12.3 ఇంచ్ స్క్రీన్ సెటప్, 12 స్పీకర్ JBL సౌండ్ సిస్టమ్, డాల్బీ అట్మాస్, సోనిక్ షాఫ్ట్ సౌండ్‌బార్ తో వస్తుంది. డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్, పవర్డ్ ఫ్రంట్ సీట్లు ఉంటాయి. వైర్‌ లెస్ చార్జర్, రియర్ సన్‌ షేడ్స్ ఉంటాయి. ఇల్యూమినేటెడ్ టాటా లోగోతో 4-స్పోక్ స్టీరింగ్ వీల్ ను కలిగి ఉంటుంది.

Read Also: హ్యుందాయ్ ఇయర్ ఎండ్ ఆఫర్లు, ఆ కారుపై ఏకంగా రూ. 1.68 లక్షల డిస్కౌంట్!

టాటా సియెర్రా ధర, ఇతర ప్రత్యేకతలు

ఇండియాలో ఫస్ట్ ICE వెహికల్ విత్ 5G కనెక్టివిటీ, ఈథర్నెట్-బేస్డ్ t.idal 2.0 ఆర్కిటెక్చర్ తో వస్తుంది. కనెక్టెడ్ కార్ టెక్ iRA, అలెక్సా ఇంటిగ్రేషన్ ను కలిగి ఉంటుంది. 6 కలర్ ఆప్షన్స్ తో వస్తుంది. ఈ కారు రూ. 11.49 లక్షల నుంచి రూ. 21 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. EV వేరియంట్ 2026లో రానుంది. ఒక్కచార్జ్ తో ఏకంగా 550+ km రేంజ్ రానుంది. ఈ SUV రెట్రో చార్మ్‌ తో పాటు మోడర్న్ ప్రీమియం ఎక్స్‌ పీరియన్స్ ఇస్తుంది.

Read Also: బీఎస్ 6 వాహనాలే ఎందుకు కొనాలి? పాత వెహికిల్స్‌ కు.. కొత్తవాటికి తేడా ఏమిటీ?

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×