E-Paper
Advertisement

Wedding Viral Video: అద్భుతంగా తయారైన వధువు.. వెనుకాల పరిగెత్తుకుంటూ వచ్చిన ఫోటో గ్రాఫర్, అంతలోనే నవ్వులే నవ్వుల్..

Wedding Viral Video: అద్భుతంగా తయారైన వధువు.. వెనుకాల పరిగెత్తుకుంటూ వచ్చిన ఫోటో గ్రాఫర్, అంతలోనే నవ్వులే నవ్వుల్..
Advertisement

Wedding Viral Video: మామూలుగా ఏ పెళ్లి వేడుకలో అయినా.. వధువు గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంటే అందరి కళ్లు ఆమెపైనే ఉంటాయి. కానీ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో మాత్రం అందరి దృష్టి వధువు వెనుక ఉన్న ఫోటోగ్రాఫర్‌పై పడింది. హహహహహ.. ఎందుకని అనుకుంటున్నారా..? వధువు నడక సాఫీగా సాగినా.. ఆమెను షూట్ చేస్తున్న ఫోటోగ్రాఫర్ మాత్రం కాలు జారి ఒక్కసారిగా కింద పడిపోవడం ఇప్పుడు ఇంటర్నెట్‌లో ఈ వీడియో హాట్ టాపిక్‌గా మారింది.

వివరాల ప్రకారం.. 

Advertisement

ఇటీవల జరిగిన ఒక వివాహ వేడుకలో వధువు చక్కగా ముస్తాబై తన వివాహ వేదిక వైపు నడుచుకుంటూ వస్తోంది. ఆ అద్భుతమైన క్షణాన్ని తన కెమెరాలో బంధించే క్రమంలో వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ శివమ్ కపాడియా అత్యుత్సాహంతో వెనక్కి పరిగెత్తారు. సరైన యాంగిల్ కోసం ప్రయత్నిస్తుండగా.. ఒక్కసారిగా కాలు జారి వెల్లకిలా కింద పడిపోయారు. ఆయన చేతిలోని ఖరీదైన డీఎస్‌ఎల్‌ఆర్ కెమెరా కూడా నేలపై పడింది.

?utm_source=ig_web_copy_link

Advertisement

సాధారణంగా ఎవరైనా కింద పడినప్పుడు కంగారు పడతారు లేదా నొప్పితో అలాగే ఉండిపోతారు. కానీ శివమ్ మాత్రం పడిన మరుక్షణమే ఏమీ జరగనట్లుగా నవ్వుకుంటూ పైకి లేచారు. తన దెబ్బల గురించి కూడా పట్టించుకోకుండా వెంటనే కెమెరాను అందుకుని.. వధువు ఎంట్రీని షూట్ చేయడం ప్రారంభించారు. ‘ఆమె ఎంట్రీ స్మూత్‌గా సాగింది.. కానీ నా ఎంట్రీ మాత్రం అలా జరగలేదు’ అనే ఫన్నీ క్యాప్షన్‌తో ఆయనే స్వయంగా ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.

వీడియోపై నెటిజన్లు స్పందనిదే..

నిన్న పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటివరకు 20.5 మిలియన్లకు పైగా వీక్షణలు, 6 లక్షలకు పైగా లైక్‌లను సాధించింది. నెటిజన్లు ఆయన వృత్తి పట్ల చూపిస్తున్న అంకితభావానికి ఫిదా అవుతున్నారు. వీడియో కింద పలు విధాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఓ నెటిజన్ ఈ విధంగా కామెంట్ చేశారు. కెమెరా పడిపోయినప్పుడు నా ప్రాణం పోయినంత పనైంది.. కానీ ఫోటో గ్రాఫర్ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ అని ఒక కామెంట్ చేసుకొచ్చారు.

దెబ్బ తగిలినా పట్టించుకోకుండా షూటింగ్ కొనసాగించడం మీ వృత్తి పట్ల మీకు ఉన్న గౌరవాన్ని చూపిస్తోందని మరొకరు ప్రశంసించారు. వధువు వెనుక ఏం జరిగిందో తెలియక కాసేపు అయోమయంలో చూడటం, వరుడి షాకింగ్ రియాక్షన్ కూడా ఈ వీడియోలో హైలైట్‌గా నిలిచాయి. ఒక అద్భుతమైన ఫోటో లేదా వీడియో వెనుక ఫోటోగ్రాఫర్లు ఎంతటి శ్రమను, రిస్క్‌ను తీసుకుంటారో ఈ ఘటన మరోసారి ప్రూఫ్ చేసింది. ఎంతటి అడ్డంకులు ఎదురైనా షో మస్ట్ గో ఆన్ అన్నట్లుగా శివమ్ వ్యవహరించిన తీరు నెటిజన్ల మనసు గెలుచుకుంది.

ALSO READ: UPI Offline: ఇంటర్నెట్ లేకపోయినా యూపీఐ పేమెంట్.. జస్ట్ ఇలా *99# డయల్ చేస్తే చాలు

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×