E-Paper
Advertisement

టెస్లా సైబర్‌ ట్రక్‌కు ఇండియన్ టచ్.. ఫొటోలు చూస్తే నవ్వు ఆపుకోలేరు!

టెస్లా సైబర్‌ ట్రక్‌కు ఇండియన్ టచ్.. ఫొటోలు చూస్తే నవ్వు ఆపుకోలేరు!
Advertisement

Tesla Cybertruck Gets Desi Makeover: టెస్లా సైబర్‌ ట్రక్ అంటే సాధారణంగా వెంటనే గుర్తుకొచ్చేది దాని ఫ్యూచరిస్టిక్ డిజైన్, బాడీ, మెరిసే స్టెయిన్‌ లెస్ స్టీల్ లుక్. కానీ, అమెరికాలో కనిపించిన ఓ సైబర్‌ ట్రక్ మాత్రం ఈ ఇమేజ్‌ నే పూర్తిగా మార్చేసింది. భారతీయ రోడ్లపై కనిపించే రంగురంగుల ట్రక్కులను ఇన్ స్ప్రేషన్ గా తీసుకుని దానికి ఇచ్చిన కొత్త లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

సైబర్‌ ట్రక్‌ కు పక్కా దేశీ మేకోవర్!

అమెరికాలోని ఈ టెస్లా సైబర్‌ ట్రక్‌ కు కస్టమ్ వెహికల్ స్టైలింగ్ స్టూడియో అయిన ఒరిజినల్ గ్లోబల్ గ్రాఫిక్స్ ప్రత్యేకమైన డిజైన్ ఇచ్చింది. సాధారణంగా సింపుల్‌గా కనిపించే సైబర్‌ ట్రక్‌ ను పూర్తిగా రంగురంగుల వాహనంగా మార్చేశారు. భారతీయ హైవేలపై కనిపించే ట్రక్కులపై వేసే పెయింటింగ్స్, పూల డిజైన్లు, నెమలి రంగులు వేశారు. దీంతో ఫ్యూచరిస్టిక్‌గా కనిపించే అమెరికన్ ఎలక్ట్రిక్ పికప్ ఒక్కసారిగా దేశంలో అలంకరించిన ట్రక్కులను గుర్తు చేసేలా మారిపోయింది.

ముందు భాగంలో ‘దేఖో! మగర్ ప్యార్ సే!!’

Advertisement

ఈ వెహికల్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మరో అంశం దాని ముందు భాగంలో కనిపించే హిందీ స్లోగన్. “దేఖో! మగర్ ప్యార్ సే!!” అని రాసి ఉంది. సాధారణంగా భారతీయ ట్రక్కులు, లారీలపై కనిపించే సరదా కొటేషన్ ను గుర్తు చేసే ఈ మాటను చూసి అందరూ పడీ పడీ నవ్వుతున్నారు.

పెళ్లి బరాత్ వాహనంలా ఉందంటూ కామెంట్లు!

వైరల్ అయిన ఈ సైబర్‌ట్రక్ ఫొటోలు, వీడియోలపై సోషల్ మీడియాలో సరదా కామెంట్లు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భారతీయ పెళ్లి ఊరేగింపుకు సిద్ధం చేసిన వాహనంలా ఉందంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే మన దేశంలో పెళ్లిళ్లు, పండుగలు, ప్రత్యేక కార్యక్రమాల సమయంలో వాహనాలను పూలు, రంగురంగుల అలంకరణలు, ప్రత్యేక లైట్లతో అందంగా ముస్తాబు చేయడం సాధారణం. ఈ సైబర్‌ ట్రక్‌ పై ఉన్న డిజైన్లు కూడా అదే వాతావరణాన్ని గుర్తుకు తెస్తున్నాయి. “దానికి ఒక డీజే సెట్ కూడా పెటల్సింది గిప్ప గిప్ప మ్యూజిక్ కొట్టెటట్టు” అని మరో నెటిజన్ ఫన్నీ కామెంట్ చేశాడు.

అమెరికాలో కనిపించినా.. లుక్ మాత్రం పక్కా ఇండియన్!

Advertisement

సైబర్‌ ట్రక్ డిజైన్ మొదటినుంచీ ఇతర వాహనాల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. దాని బాడీ, స్టెయిన్‌లెస్ స్టీల్ ఫినిష్ దీనికి ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి. అలాంటి వాహనంపై సంప్రదాయ భారతీయ ట్రక్ ఆర్ట్‌ను ఉపయోగించడం వల్ల రెండు పూర్తిగా భిన్నమైన స్టైల్స్ కలిసినట్టయింది. ఈ మేకోవర్ కేవలం కారుకు కొత్త రంగులు వేయడం మాత్రమే కాదు. భారతీయ రోడ్డు సంస్కృతిలో భాగమైన ట్రక్ ఆర్ట్‌ ను అమెరికన్ ఎలక్ట్రిక్ వాహనంపై చూపించిన క్రియేటివ్ ప్రయత్నంగా నిలిచింది. అందుకే ఈ సైబర్‌ట్రక్ సోషల్ మీడియాలో ప్రత్యేకంగా నిలిచి, నెటిజన్లలో ఇంట్రెస్టింగ్ కలిగిస్తోంది.

Read Also: ఈవీ రంగంలో హీరో దూకుడు.. నంబర్ వన్ కోసం అదిరిపోయే ప్లాన్!

Tags

Related News

నెక్సాన్ To కర్వ్.. సెప్టెంబర్ లో టాటా కార్లపై ఊహించని డిస్కౌంట్లు!

మహీంద్రా SUVలపై భారీ డిస్కౌంట్లు.. స్కార్పియో Nపై ఏకంగా రూ.3 లక్షల తగ్గింపు!

ఎలక్ట్రిక్ స్కూటర్లకు సూపర్ డిమాండ్.. 8 నెలల్లోనే 13 లక్షలకు పైగా అమ్మకాలు!

సింపుల్ ఎనర్జీ సూపర్ జోష్.. ఏడాదిలో 10 వేలకుపైగా ఈవీ స్కూటర్ల సేల్!

ఈవీ రంగంలో హీరో దూకుడు.. నంబర్ వన్ కోసం అదిరిపోయే ప్లాన్!

నల్లగొండ జిల్లాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ జోరు, ఏడాదిలో 11 వేలకు పైగా కొనుగోళ్లు!

432 కి.మీ రేంజ్.. అరగంటలో ఛార్జింగ్.. 11 వేల కి.మీ నడిపిన తర్వాత క్రెటా EV రివ్యూ!

Big Stories

Advertisement
×