E-Paper
Advertisement

టెస్లా కొత్త సర్‌ ప్రైజ్.. మార్కెట్ లోకి 6-సీటర్ మోడల్ Y ఎంట్రీ!

టెస్లా కొత్త సర్‌ ప్రైజ్.. మార్కెట్ లోకి 6-సీటర్ మోడల్ Y ఎంట్రీ!
Advertisement

Tesla India Update: అమెరికన్ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా భారత మార్కెట్‌ పై మళ్లీ దృష్టి పెడుతోంది. గత సంవత్సరం టెస్లా మోడల్ Yను ప్రవేశపెట్టిన తర్వాత, కంపెనీకి ఓపెనింగ్ అనుకున్న స్పీడప్ కాలేదు. ఎక్కుడ దిగుమతి పన్నులు, స్థానిక బ్రాండ్ల పోటీ కారణంగా అమ్మకాలు ఆశించిన స్థాయికి చేరుకోలేదు. అయితే, ఇప్పుడు పరిస్థితిని మార్చేందుకు కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

మోడల్ Y  6 సీటర్ వెర్షన్‌ విడుదల?

ఇందులో భాగంగా, మోడల్ Y 6 సీటర్ వెర్షన్‌ ను భారత్‌ లోకి తీసుకురావాలని కంపెనీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఏప్రిల్ 22 ఓ ప్రత్యేక ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్‌ లో ఏ మోడల్‌ ను ప్రకటిస్తారో అధికారికంగా చెప్పకపోయినా, కొత్త వేరియంట్‌ పై అంచనాలు పెరిగాయి. ప్రపంచ మార్కెట్లో అందుబాటులో ఉన్న 6-సీటర్ మోడల్ Y, డ్యూయల్ మోటార్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌ తో వస్తుంది. 82kWh సామర్థ్యం గల బ్యాటరీతో పని చేస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 750 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది. పనితీరు పరంగా కూడా ఈ కారు మరింత వేగంగా ఉంటుంది. జస్ట్ సెకెన్ల వ్యవధిలో 0 నుంచి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. గరిష్ట వేగం కూడా ఎక్కువగానే ఉంటుంది.

మూడు వరుసలో హీటింగ్ సీట్లు

Advertisement

ఈ 6-సీటర్ మోడల్‌లో 2+2+2 సీటింగ్ అమరిక ఉంటుంది. అంటే, రెండవ వరుసలో ప్రత్యేకంగా కెప్టెన్ సీట్లు ఉంటాయి. ఇవి హీటెడ్, వెంటిలేటెడ్ ఫీచర్లతో వస్తాయి. మూడవ వరుసలో కూడా సీట్లకు హీటింగ్ సదుపాయం ఉంటుంది. అందువల్ల దీర్ఘ ప్రయాణాల్లో ప్రయాణికులకు మరింత సౌకర్యంగా ఉంటుంది.

మరింత అప్ డేటెడ్ వెర్షన్ లో ఇంటీరియర్

ఇంటీరియర్ విషయానికి వస్తే, ఈ వెహికల్ పూర్తిగా ఆధునిక డిజైన్‌ ను కలిగి ఉంటుంది. ఎక్కువగా ఫిజికల్ బటన్లు ఉండవు. పెద్ద టచ్‌ స్క్రీన్ ద్వారా అన్ని కంట్రోల్స్ ఉంటాయి. ఇందులో సుమారు 16 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, వెనుక సీట్ల కోసం ప్రత్యేకంగా మరో చిన్న స్క్రీన్ కూడా ఉంటుంది. వైర్‌ లెస్ ఛార్జింగ్, ప్రీమియం సౌండ్ సిస్టమ్, గ్లాస్ రూఫ్ లాంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి.

మంచి భద్రతా ఫీచర్లు

Advertisement

భద్రత పరంగా కూడా ఈ మోడల్ మంచి స్థాయిలో ఉంటుంది. మల్టిపుల్ ఎయిర్‌ బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ అలర్ట్, ఆటోమేటిక్ బ్రేకింగ్, లేన్ అసిస్ట్ లాంటి ఆధునిక సాంకేతికతలను ఇందులో పొందుపరిచారు. అడ్వాన్స్‌ డ్ డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లు కూడా ఉంటాయి. డిజైన్ పరంగా చూస్తే, ఇది సాధారణ మోడల్ Yతో పోలిస్తే కొంచెం పెద్దదిగా కనిపిస్తుంది. మూడవ వరుస సీట్ల కోసం వీల్‌ బేస్‌ను పెంచారు. రూఫ్‌ లైన్ కూడా కొంచెం పొడిగించారు. కొత్త అల్లాయ్ వీల్స్, రియర్ స్పాయిలర్ వంటి చిన్న మార్పులు దీనికి స్పెషల్ లుక్‌ను ఇస్తాయి.

Read Also: రెనాల్ట్ డ్యూయల్ ప్లాట్‌ఫారమ్ స్ట్రాటజీ.. ఏకంగా ఏడు కొత్త మోడళ్లు వచ్చేస్తున్నాయ్!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×