E-Paper
Advertisement

తెలంగాణ సర్కార్ సంచలనం.. ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ విప్లవం

తెలంగాణ సర్కార్ సంచలనం.. ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ విప్లవం
Advertisement

AI Education: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ విద్యాశాఖలో ప్రస్తుతం జరుగుతున్న విప్లవాత్మక మార్పులు, ముఖ్యంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అక్షరాస్యత వంటి నిర్ణయాలు ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మారుస్తున్నాయి. అంతేకాకుండా నేటి ఆధునిక కాలానికి అనుగుణంగా విద్యాశాఖ దాదాపు 20 లక్షల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏఐ ద్వారా అక్షర జ్ఞానాన్ని అందించనుంది. అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ భాగస్వామ్యంతో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలకు వేల సంఖ్యలో ఇప్పటికే ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేశారు. 5 నుంచి 9వ తరగతి విద్యార్థులు ఇప్పుడు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, స్వయంగా డేటా, డిజిటల్ సిస్టమ్స్‌తో ప్రయోగాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడితోనే ఆగకుండా విద్యార్థులకు పోషకాహారం, సంక్షేమం అందించేందుకు సైతం సిద్ధమైంది.

జూన్ 12 నుంచి..

విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి పెడుతూ తెలంగాణ ప్రభుత్వం మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు ఉచిత అల్పాహారం అందించేందుకు బడ్జెట్‌లో ఇప్పటికే నిధులు కేటాయించింది. తొలిసారిగా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన సౌకర్యాన్ని 2026-27 విద్యాసంవత్సరం నుంచి కల్పించనున్నారు. ఇదిలా ఉండగా జూన్ 12 నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు షూలు, సాక్సులు, బెల్టులతో కూడిన విద్యా కిట్లను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఒకప్పుడు శిథిలావస్థలో ఉన్న భవనాలు, అరకొర వసతులతో వెలవెలబోయిన ఒక ఊరి ప్రభుత్వ పాఠశాల, నేడు కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ముస్తాబవుతున్నాయి. ఇది కేవలం ఒక పాఠశాల కథ కాదు, తెలంగాణ వ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్న విద్యాసంస్థలు తిరిగి గాడిన పడుతున్నాయి.

Advertisement

Also Read: పంది కడుపులో ఏనుగు పిల్ల కలకలం

తెలంగాణ పబ్లిక్ స్కూల్..

సర్కారు బడుల్లో మౌలిక సదుపాయల కల్పనకు ప్రజా ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. అత్యాధునిక కిచెన్ షెడ్లు, శుభ్రమైన టాయిలెట్లు, డిజిటల్ తరగతి గదులతో విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించనుంది. రాష్ట్ర ప్రభుత్వం 2026-27 విద్యా సంవత్సరానికి రూ.26,674 కోట్లను విద్యాశాఖకు కేటాయించింది. ప్రతి మండలానికి ఒక అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయడం ద్వారా పేద విద్యార్థులకు కూడా అంతర్జాతీయ స్థాయి విద్యను చేరువ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. రేపటి తరం విద్యార్థులు కేవలం ఉద్యోగాల కోసం వెతకడమే కాకుండా, ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందా? లేదా? అనేది చూడాలి. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మార్పులతో అయినా విద్యార్థులు సర్కార్ బడి బాట పట్టేనా? లేదా? అనేది చూడాలి.

Advertisement

Also Read: Vastu: వాస్తు ప్రకారం ఆలాంటి ఇంట్లో ఉంటే ఆయుఃఆరోగ్య ఐశ్వర్యాలు కలిసి వస్తాయట

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×