E-Paper
Advertisement

Tesla Model Y Discount: టెస్లా మోడల్ Yపై అదిరిపోయే డిస్కౌంట్.. ఎన్ని లక్షలో తెలుసా?

Tesla Model Y Discount: టెస్లా మోడల్ Yపై అదిరిపోయే డిస్కౌంట్.. ఎన్ని లక్షలో తెలుసా?
Advertisement

అపర కుబేరుడు ఎలన్ మస్క్ కు చెందిన టెస్లా కంపెనీ అట్టహాసంగా ఇండియాలోకి అడుగు పెట్టినా, అనుకున్న స్థాయిలో రాణించడం లేదనే చెప్పుకోవచ్చు. చారాణా కోడికి బారాణా మసాల అయినట్లు, ఆ కంపెనీకి చెందిన కార్ల అసలు ధరతో పోల్చితే భారత్ లో టాక్స్ లే ఎక్కువ కావడంతో ధర భారీగా పెరిగిపోయింది. ఫలితంగా ఈ అమెరికన్ బ్రాండ్ కంటే ఇండియన్ బ్రాండ్స్ కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు భారతీయులు. ఫలితంగా ఆ కంపెనీకి చెందిన కార్లు అనుకున్న స్థాయిలో సేల్ కావడం లేదు. ఈ నేపథ్యంలోనే తమ అమ్మకాలను పెంచుకునేందుకు టెస్లా ఇండియా ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. టెస్లా మోడల్ Y జనవరి 2026కు సంబంధించి ఎంపిక చేసిన వేరియంట్లలో రూ. 2 లక్షల వరకు ప్రయోజనాలను అందిస్తోంది. జూలై 2025లో భారత మార్కెట్లోకి ప్రవేశించినప్పటి నుంచి టెస్లా మోడల్ Y ఎలక్ట్రిక్ SUV కేవలం 227 యూనిట్లను మాత్రమే అమ్మింది. ఈ నేపథ్యంలోనే ఆఫర్లను తీసుకొచ్చింది.

టెస్లా మోడల్ Y: వేరియంట్లు, ధర

టెస్లా మోడల్ Y మొత్తం రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఒకటి స్టాండర్డ్ రియర్ వీల్ డ్రైవ్, రెండోది లాంగ్ రేంజ్ రియర్ వీల్ డ్రైవ్. స్టాండర్డ్ రియర్ వీల్ డ్రైవ్ వేరియంట్ ధర రూ. 59.89 లక్షలు కాగా, లాంగ్ రేంజ్ రియర్ వీల్ డ్రైవ్ వేరియంట్ ధర రూ. 67.89 లక్షలు. ఆన్ రోడ్ ధర మరికాస్త ఎక్కువగానే ఉంటుంది.

టెస్లా మోడల్ Y రేంజ్, ఫీచర్లు

Advertisement

మోడల్ Y క్యాబిన్ లోపల 15.4-అంగుళాల టచ్‌ స్క్రీన్‌ తో వస్తుంది. ఇది కారులోని చాలా యాక్టివిటీస్ ను కంట్రోల్ చేస్తుంది. దీనికి పనోరమిక్ గ్లాస్ సన్‌ రూఫ్, ఎలక్ట్రికల్ లిఫ్ట్‌ గేట్ కూడా ఉంది. మోడల్ Y అత్యంత అధునాతనమైన ADAS ఫీచర్లను కలిగి ఉంది. వీటిలో బ్లైండ్ స్పాట్ మానిటర్, లేన్ కీప్ అసిస్ట్ సహా పలు లేటెస్ట్ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇక టెస్లా మోడల్ Y మంచి రేంజ్ ను అందిస్తుంది. స్టాండర్డ్ వేరియంట్ ఒక ఫుల్ ఛార్జ్ మీద ఏకంగా  500 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. అయితే ఈ SUVకి చెందిన లాంగ్ రేంజ్ మోడల్ పూర్తి ఛార్జ్‌ లో 622 కిలో మీటర్ల వరకు ప్రయాణిస్తుంది.

భారతీయులను ఆకట్టుకోలేకపోయిన టెస్లా

నిజానికి ఈ కారు ఇండియన్ ఎలక్ట్రిక్ కార్లతో పోల్చితే అన్ని రకాలుగా మంచి ఫీచర్లను, స్టైల్ ను కలిగి ఉన్నప్పటికీ, భారతీయులను అంతా ఆకట్టుకోలేకపోతుంది. దీనికి ప్రభుతాన కారణం ధర. ఈ కారుకు పెట్టే ధర కంటే తక్కువ ధరలో బెస్ట్ ఇండియన్ ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధర, దేశీ బ్రాండ్స్ ను ప్రమోట్ చేసినట్లు ఉంటుందనే ఆలోచనతో చాలా మంది టెస్లా కార్ల పట్ల అనుకున్న స్థాయిలో ఆసక్తి చూపించడం లేదు. ఫలితంగా ఎన్నో ఆశలతో భారత్ లో షోరూమ్ ఓపెన్ చేసిన అపర కుబేరుడికి నిరాశే ఎదురయ్యిందని చెప్పుకోవచ్చు. ఎలాగైనా అమ్మకాలు పెంచుకోవాలనే ఉద్దేశంతో తాజాగా డిస్కౌంట్ల బాట పట్టారు. ఈ ఆఫర్లు అయినా వినియోగదారులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తాయో? లేదో? చూడాలి.

Advertisement

Read Also: సరుకులు తీసుకెళ్లొచ్చు, లాంగ్ ట్రిప్ ఎంజాయ్ చెయ్యొచ్చు.. హోండా ఎలక్ట్రిక్ వ్యాన్ భలే ఉంది గురూ!

Related News

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

Big Stories

Advertisement
×