E-Paper
Advertisement

Headache: తరచుగా తలనొప్పి వస్తున్నా.. రిపోర్ట్స్ మాత్రం నార్మల్ అని వస్తున్నాయా? ఆ తలనొప్పికి కారణాలు ఇవే

Headache: తరచుగా తలనొప్పి వస్తున్నా.. రిపోర్ట్స్ మాత్రం నార్మల్ అని వస్తున్నాయా? ఆ తలనొప్పికి కారణాలు ఇవే
Advertisement

ఈ రోజుల్లో చాలా మందికి తలనొప్పి సమస్య కనిపిస్తోంది. ఖ్యంగా యువతలో, ఉద్యోగస్తుల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. అయితే పరీక్షలు చేయించుకుంటే అన్ని రిపోర్ట్స్ నార్మల్‌గా వస్తాయి. దీంతో చాలామంది ఏ సమస్యా లేదు అని నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ వైద్యులు చెబుతున్నది మాత్రం వేరే. రిపోర్ట్స్ నార్మల్‌గా ఉన్నా కూడా తలనొప్పికి కారణాలు ఉండొచ్చని వారు చెబుతున్నారు. తరచూ వచ్చే తలనొప్పులకు ప్రధాన కారణం మన జీవనశైలే.

కారణాలు ఇవే
తరచూ వచ్చే తలనొప్పికి ముఖ్యంగా స్ట్రెస్, ఎక్కువ స్క్రీన్ టైమ్, తప్పుగా కూర్చునే అలవాట్లు ఇవన్నీ కారణాలు కావచ్చు. రోజంతా పని ఒత్తిడి, టెన్షన్, ఆలోచనలు ఎక్కువగా ఉండటం వల్ల మెదడు మీద ప్రభావం పడుతుంది. దీని వల్ల టెన్షన్ టైప్ హెడేక్ అనే సమస్య వస్తుంది. ఇది బయట పరీక్షల్లో కనిపించకపోయినా మనకు మాత్రం ఇబ్బంది పెడుతుంది. ఇక మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు… ఇవి మన జీవితంలో భాగమైపోయాయి. గంటల తరబడి స్క్రీన్ ముందు కూర్చోవడం వల్ల కళ్లపై ఒత్తిడి పెరుగుతుంది. కళ్ల అలసట నేరుగా తలనొప్పికి దారి తీస్తుంది. అంతేకాదు, చాలా మంది సరైన పొజిషన్‌లో కూర్చోరు. మెడ వంచి ఫోన్ చూడటం, కుర్చీలో వంగి కూర్చోవడం వంటివి మెడ, భుజాలపై ఒత్తిడిని పెంచుతాయి. దీని వల్ల కూడా తలనొప్పి వస్తుంది.

Advertisement

Also read: Magic Drink: ప్రతి ఉదయం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగారంటే పొట్ట మొత్తం క్లీన్ అయిపోతుంది

చిన్న చిన్న అలవాట్లు కూడా పెద్ద సమస్యలకు దారి తీస్తాయి. ఉదాహరణకు సరైన సమయానికి భోజనం చేయకపోవడం, తగినంత నీళ్లు తాగకపోవడం, నిద్ర సరిపోకపోవడం వంటి విషయాలు కూడా తలనొప్పిని ట్రిగ్గర్ చేస్తాయి. ముఖ్యంగా రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోవడం, ఉదయం లేటుగా లేవడం వల్ల శరీర గడియారం డిస్టర్బ్ అవుతుంది. ఇది కూడా తలనొప్పికి కారణమవుతుంది.

Advertisement

అన్ని సమస్యలు టెస్టుల్లో కనిపించవు. చాలా సమస్యలు మన జీవనశైలికి సంబంధించినవే. శరీరం మనకు సిగ్నల్స్ ఇస్తుంది. తలనొప్పి కూడా అలాంటి ఒక సిగ్నల్. దాన్ని నిర్లక్ష్యం చేస్తే తర్వాత పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. ఈ సమస్య ఒక సైకిల్‌లా మారిపోతుంది. స్ట్రెస్ వల్ల తలనొప్పి వస్తుంది. తలనొప్పి వల్ల నిద్రపట్టదు. నిద్రలేమి మళ్లీ తలనొప్పిని పెంచుతుంది. ఇలా ఒక చక్రంలా తిరుగుతూ ఉంటుంది. కాబట్టి దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించడం చాలా ముఖ్యం.

Also read: Garlic: చిన్న వెల్లుల్లి రెబ్బతో పెద్ద ప్రయోజనాలు, రోజుకో రెబ్బ నచ్చకపోయినా నమిలేయండి

ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
రోజుకు కనీసం 7 నుండి 8 గంటలు నిద్రపోవాలి. ప్రతి గంటకు కొద్దిసేపు స్క్రీన్ నుండి బ్రేక్ తీసుకోవాలి. సరైన పొజిషన్‌లో కూర్చోవడం అలవాటు చేసుకోవాలి. రోజూ కొద్దిసేపైనా వ్యాయామం చేయాలి. యోగా, ధ్యానం వంటి వాటితో స్ట్రెస్ తగ్గించుకోవచ్చు. కొన్ని లక్షణాలు కనిపిస్తే మాత్రం తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఉదాహరణకు, ప్రతిరోజూ తలనొప్పి రావడం, నొప్పి తీవ్రంగా పెరగడం, వాంతులు అవడం, చూపు మసకబారడం వంటి సమస్యలు ఉంటే ఆలస్యం చేయకుండా పరీక్షలు చేయించుకోవాలి.

Related News

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

Big Stories

Advertisement
×