E-Paper
Advertisement

టైర్లు బ్లాక్ కలర్‌ లోనే ఉంటాయి.. ఎందుకో తెలుసా?

టైర్లు బ్లాక్ కలర్‌ లోనే ఉంటాయి.. ఎందుకో తెలుసా?
Advertisement

Hidden Reason Of Tyres Color: మన రోజూ కార్లు, బైకులు చూస్తూనే ఉంటాం. రకరకాల రంగుల్లో ఆకట్టుకుంటాయి. వాటి టైర్లు మాత్రం నల్ల రంగులోనే ఉంటాయి. ఎందుకు ఇతర రంగుల్లో ఉండవు అని ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? అయితే, ఇప్పుడు అసలు విషయం తెలుసుకుందాం.. టైర్ నల్లరంగు వెనుక చాలా కారణాలు ఉన్నాయి. అవి ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ఒకప్పుడు తెలుపు రంగు.. ఇప్పుడు నలుపు రంగు

నిజానికి టైర్ రంగు అనేది కేవలం స్టైల్ కోసం ఉపయోగించరు. దాని వెనుక సైన్స్, భద్రత, మన్నిక లాంటి కీలకమైన అంశాలు  ఉన్నాయి. తొలి నాళ్లలో తయారైన టైర్లు నల్లగా ఉండేవి కావు. 19వ శతాబ్దం చివరలో, 20వ శతాబ్దం ప్రారంభంలో తయారైన టైర్లు సహజ రబ్బరుతో తయారయ్యేవి. సహజ రబ్బరు వైట్ లేదంటే మిల్క్ వైట్ లో ఉండటంతో ఆ టైర్లు కూడా లేత రంగులోనే కనిపించేవి. అయితే, ఆ టైర్లు చాలా త్వరగా అరిగిపోయేవి. ఎక్కువకాలం మన్నిక ఇచ్చేవి కాదు. వేడి, రోడ్డు ఘర్షణను తట్టుకోలేక పాడయ్యేవి.

టైర్ల బలం కోసం కార్బన్ బ్లాక్ ఉపయోగం

Advertisement

టైర్లను బలంగా తయారు చేసేందుకు శాస్త్రవేత్తలు, తయారీ సంస్థలు కొత్త మార్గాలు వెతికాయి. అప్పుడే  కార్బన్ బ్లాక్ అనే పదార్థాన్ని రబ్బరులో కలపడం ప్రారంభించారు. ఇది నల్లటి పొడి లాంటి పదార్థం. పెట్రోలియం ఉత్పత్తులను ప్రత్యేక పద్ధతిలో మండించడం ద్వారా దీనిని తయారు చేస్తారు. కార్బన్ బ్లాక్‌ ను రబ్బరులో కలపడం వల్ల టైర్లు చాలా బలంగా మారాయి. రోడ్డు మీద ఏర్పడే ఒత్తిడి, వేడి, బరువును తట్టుకునే శక్తి పెరిగింది. ముఖ్యంగా వాహనం వేగంగా వెళ్తున్నప్పుడు టైరు, రోడ్డుకు మధ్య ఘర్షణ వల్ల ఎక్కువ వేడి ఉత్పత్తి అవుతుంది. ఈ వేడి టైర్లను త్వరగా దెబ్బతీస్తుంది. కార్బన్ బ్లాక్ ఆ వేడిని నియంత్రించి టైరు ఎక్కువకాలం మన్నేలా చేస్తుంది. అంతేకాదు, సూర్యరశ్మి నుంచి వచ్చే అల్ట్రావయొలెట్ కిరణాలు, గాలిలో ఉండే ఓజోన్ లాంటి పదార్థాలు రబ్బరును క్రమంగా చెడిపోయేలా చేస్తాయి. టైర్లపై చిన్న చిన్న పగుళ్లు రావడానికి ఇవే కారణం. కార్బన్ బ్లాక్ ఈ ప్రభావాన్ని తగ్గించి టైర్లను రక్షిస్తుంది.

టైర్లను ఇతర రంగుల్లో తయారు చెయ్యొచ్చా?

టైర్లను ఇతర రంగుల్లో తయారు చేయలేరా? అంటే చేయొచ్చు. సాంకేతికంగా ఎరుపు, నీలం, తెలుపు లాంటి రంగుల్లో కూడా టైర్లు తయారు చేయడం సాధ్యమే. కానీ, అలాంటి టైర్లు నల్లటి టైర్లంత బలంగా ఉండవు. అందుకే, సాధారణ వాహనాల్లో వాటిని ఎక్కువగా ఉపయోగించరు. కొన్ని పాతకాల కార్లలో వైట్‌ వాల్ టైర్లు కనిపించేవి. అంటే, టైరు పక్క భాగంలో తెలుపు రంగు ఉండేది. కానీ, రోడ్డును తాకే ప్రధాన భాగం మాత్రం నల్లగానే ఉండేది. ఎందుకంటే అదే ఎక్కువ మన్నికను ఇస్తుంది.  మనం ప్రతిరోజూ చూసే నల్లటి టైర్లు కేవలం అందం కోసం కాదు. ప్రయాణం సురక్షితంగా ఉండటానికి, టైర్లు ఎక్కువకాలం మన్నికగా ఉండేందుకు, వేడి, రోడ్డు ప్రెజర్ ను తట్టుకునేందుకు నల్ల రంగు కీలక పాత్ర పోషిస్తోంది.

Advertisement

Read Also: టాటా To హ్యుందాయ్.. రూ. 10 లక్షల్లోపు సేఫ్టీలో బెస్ట్ కార్లు ఇవే!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×