E-Paper
Advertisement

టాటా To హ్యుందాయ్.. రూ. 10 లక్షల్లోపు సేఫ్టీలో బెస్ట్ కార్లు ఇవే!

టాటా To హ్యుందాయ్.. రూ. 10 లక్షల్లోపు సేఫ్టీలో బెస్ట్ కార్లు ఇవే!
Advertisement

Top 5 Safest Cars Under Rs.10 Lakh: కారు కొనే సమయంలో చాలా మంది ఇప్పుడు సేఫ్టీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒకప్పుడు భద్రత అంటే ఖరీదైన కార్లలో మాత్రమే దొరికే ఫీచర్‌ గా భావించేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. రూ.10 లక్షల లోపు ధరలోనే మంచి క్రాష్ సేఫ్టీ రేటింగ్‌ తో కార్లు అందుబాటులోకి వచ్చాయి. భారత్ NCAP క్రాష్ టెస్ట్ రేటింగ్స్ ప్రకారం ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అత్యంత సురక్షితమైన టాప్ 5 బడ్జెట్ కార్లు ఏవనేది ఇప్పుడు చూద్దాం..

5.కియా సైరోస్

సేఫ్టీ పరంగా కియా సైరోస్ ఐదో స్థానంలో నిలిచింది. ఈ SUVకి భారత్ NCAPలో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌ లో 32కి 30.21 స్కోర్ చేయగా, చైల్డ్ సేఫ్టీలో 49కి 44.42 పాయింట్స్ సాధించింది. పెద్ద క్యాబిన్, ఆధునిక ఫీచర్లు, టర్బో పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లు ఆట్టుకుంటున్నాయి. దీని ప్రారంభ ధర రూ.8.40 లక్షలు.

4.టాటా పంచ్

Advertisement

టాటా కార్లు భద్రత విషయంలో ముందుంటాయి. పంచ్ కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించింది. BNCAP పరీక్షల్లో ఈ కారు అడల్ట్ ప్రొటెక్షన్‌ లో 30.58 స్కోర్ చేయగా, పిల్లల భద్రతలో 45 మార్కులు సాధించింది. చిన్న SUV అయినప్పటికీ మంచి గ్రౌండ్ క్లియరెన్స్, స్టైలిష్ డిజైన్, CNG ఆప్షన్ లాంటి అంశాలు కుటుంబ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటాయి. దీని ధర రూ.5.65 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

3.స్కోడా కైలాక్

డ్రైవింగ్ ఇష్టపడే వారికి ఈ కారు బాగా నచ్చుతుంది. 1.0 లీటర్ TSI టర్బో పెట్రోల్ ఇంజన్‌తో వచ్చే ఈ SUV, పనితీరు,  భద్రత రెండింటినీ ఈక్వల్ గా ఉంటుంది. క్రాష్ టెస్టు ల్లో అడల్ట్ ప్రొటెక్షన్‌ లో 30.88 స్కోర్, పిల్లల భద్రతలో 45 మార్కులు సాధించింది. రూ.7.59 లక్షల ప్రారంభ ధరతో ప్రీమియం ఫీల్ ఇచ్చే కాంపాక్ట్ SUVగా కొనసాగుతోంది.

2.హ్యుందాయ్ వెన్యూ

Advertisement

హ్యుందాయ్ వెన్యూ  ఇటీవల జరిగిన BNCAP పరీక్షల్లో మంచి స్కోర్ సాధించింది. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 31.15 స్కోర్ నమోదు చేయగా, పిల్లల భద్రతలో 44.46 మార్కులు పొందింది. ఫీచర్ల పరంగా కూడా వెన్యూ మంచి ప్యాకేజీని కలిగి ఉంది.  పెట్రోల్, టర్బో పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. దీని ధర రూ.8 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

1.టాటా పంచ్ ఈవీ

సేప్టీలో టాటా పంచ్ ఈవీ నెంబర్ వన్ గా నిలిచింది. భారత్ NCAP పరీక్షల్లో ఈ కారు అత్యధిక స్కోర్ సాధించింది. అడల్ట్ ప్రొటెక్షన్‌లో 31.46 మార్కులు, చైల్డ్ ప్రొటెక్షన్‌లో 45 మార్కులు దక్కించుకుంది. రెండు బ్యాటరీ ఆప్షన్లతో వచ్చే ఈ EV, ఒక్కసారి చార్జ్ చేస్తే గరిష్టంగా 421 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. భద్రత, ఎలక్ట్రిక్ టెక్నాలజీ, తక్కువ మెయింటెనెన్స్  ఖర్చు దీని ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు.

Read Also: టాటా ప్లాట్‌ ఫారమ్‌ పై కొత్త జీప్ SUV.. 2028లో గ్రాండ్ ఎంట్రీ!

Related News

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

Big Stories

Advertisement
×