E-Paper
Advertisement

సముద్ర తీర జిల్లాల్లో ఏసీ కొంటున్నారా? జాగ్రత్త భయ్యో.. ఈ తప్పులు అస్సలు చేయకండి!

సముద్ర తీర జిల్లాల్లో ఏసీ కొంటున్నారా? జాగ్రత్త భయ్యో.. ఈ తప్పులు అస్సలు చేయకండి!
Advertisement

AC for Coastal Areas: సాధారణంగా సముద్ర తీర జిల్లాల్లో వాతావరణం ఇతర ప్రాంతాల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. వేసవిలో అక్కడి వాతారవణం.. తేమతో, ఉక్కపోతతో నిండి ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రదేశాలకు సాధారణ ఏసీలు సరిపోవని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లు ఉన్న ఏసీలు మాత్రమే అక్కడి తేమ వాతావరణాన్ని, ఉప్పు గాలులను తట్టుకొని పనిచేయగలవని పేర్కొంటున్నారు. కాబట్టి గాలిలోని జిగటతనాన్ని (Stickiness) పోగొట్టే ఏసీని ఎలా ఎంచుకోవాలో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

ఇన్వర్టర్ ఏసీలు బెస్ట్

కోస్తా తీర ప్రాంతాల్లో సహజంగానే ఎండాకాలం, వర్షాకాలంలో గాలిలో తేమ శాతం విపరీతంగా పెరుగుతుంది. దీనివల్ల చర్మం జిగటగా మారి ఉక్కపోత పెరుగుతుంది. ఇలాంటి వాతావరణానికి ‘ఇన్వర్టర్ ఏసీలు’ (Inverter ACs) చాలా బెస్ట్ అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇవి నిరంతరం కంప్రెసర్‌ వేగాన్ని మారుస్తూ గాలిలోని తేమను క్రమబద్ధీకరిస్తాయని పేర్కొంటున్నారు. ఇన్వర్టర్ ఏసీల్లో మరికొన్ని ఫీచర్లు తప్పనిసరిగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అవి ఏంటంటే..

డ్రై మోడ్ (Dry Mode)

Advertisement

తేమ వాతావరణంలో పనిచేసే ఏసీల్లో తప్పనిసరిగా డ్రై మోడ్ ఫీచర్ ఉండాల్సిందేనని నిపుణులు సూచిస్తున్నారు. రిమోట్‌లో వాటర్‌ డ్రాప్ (చుక్క) సింబల్‌తో ఉండే ఈ మోడ్‌ ఆన్ చేస్తే.. ఏసీ పెద్దగా కూలింగ్ పెంచకుండానే గాలిలోని తేమ మొత్తాన్ని పీల్చేస్తుందని పేర్కొంటున్నారు. ఫలితంగా చర్మంపై జిగటదనం మాయమవుతుందని వివరిస్తున్నారు.

PM 2.5 ఫిల్టర్లు

తీర ప్రాంతాల్లోని వాతావరణంలో సాధారణంగానే తేమ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల గాలిలో బ్యాక్టీరియా, ఫంగస్ వేగంగా పెరుగుతాయి. కాబట్టి అడ్వాన్స్‌డ్ PM 2.5 ఫిల్టర్లు ఉన్న ఏసీలు.. గాలిని శుభ్రం చేసి దుర్వాసన రాకుండా చూస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఆటో క్లీన్ ఫీచర్ ఉన్న ఏసీని కొనుగోలు చేస్తే.. అవి కాయిల్స్ పై తేమ పేరుకుపోకుండా ఆటోమేటిక్ గా డ్రై చేస్తాయని స్పష్టం చేస్తున్నారు. దీనివల్ల ఏసీ లోపల బూజు పట్టదని వివరిస్తున్నారు.

Advertisement

Also Read: Flight Mode: ‘ఫ్లైట్ మోడ్‌’తో ఇన్ని లాభాలా? ఇన్నాళ్లు తెలియలేదే.. ఎంత డబ్బు వృథా చేశారో..!

మరికొన్ని జాగ్రత్తలు..

కొత్త ఏసీ కొనేటప్పుడు పైన పేర్కొన్న ఫీచర్లు ఉండేలా చూసుకోవడంతో పాటు మరికొన్ని జాగ్రత్తలు సైతం పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. గది పరిమాణాన్ని బట్టి సరైన టన్ను (1 Ton or 1.5 Ton) ఏసీని ఎంచుకోవాలని హితవు పలుకుతున్నారు. ముఖ్యంగా ఏసీ కాయిల్స్ ‘కాపర్’ (Copper) తో తయారైనవి అయితే తేమ వాతావరణంలో కూడా త్వరగా పాడవకుండా ఎక్కువ కాలం మన్నుతాయని స్పష్టం చేస్తున్నారు. బ్లూ ఫినో లేదా గోల్డ్ ఫిన్ కోటింగ్ ఉన్న కండెన్సర్లు.. ఉప్పు గాలులను తట్టుకొని తుప్పు పట్టకుండా ఉంటాయని వివరిస్తున్నారు. మెుత్తంగా ఉక్కపోతతో కూడిన వాతావరణానికి 100% ఇన్వర్టర్ టెక్నాలజీతో పాటు డ్రై మోడ్ సమర్థవంతంగా పనిచేసే బ్రాండెడ్ ఏసీలను ఎంచుకోవడం బెస్ట్ అని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: Window AC: టెక్నాలజీ మారినా.. కాలం మారినా.. విండో ఏసీల రూటే సెపరేటు!

Related News

ఇంట్లో Wi-Fi డెడ్ జోన్స్‌కు సింపుల్ సొల్యూషన్.. పాత ఆండ్రాయిడ్ ఫోన్‌తో ఇలా చేయండి!

వాషింగ్ మెషీన్‌ను ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? ఈ విషయం తెలుసా?

AIతో పెరుగుతున్న సైబర్ మోసాలు.. మీ డబ్బు, వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోండిలా!

BSNL కనివిని ఎరుగని ప్లాన్స్.. రోజుకు రూ.5 మాత్రమే.. 80 రోజులపాటు మీ ఇష్టం!

కొత్త 5G ఫోన్‌తో ఫిలిప్స్ రీ-ఎంట్రీ.. సెప్టెంబర్ 2న ఏం లాంచ్ చేయనుందంటే?

బ్యాటరీ ఎక్కువకాలం మన్నాలంటే 80-20 రూల్ పాటించాల్సిందేనా?

ఒకప్పుడు ఇవే స్టేటస్ సింబల్.. 90లలో ఫేమస్ అయిన 5 ఫోన్లు ఇవే!

మ్యాక్‌లో సిస్టమ్ స్టోరేజ్ పెరిగిపోయిందా? ఈ సింపుల్ ప్రాసెస్ ద్వారా ఖాళీ చేసి స్పీడ్ పెంచండి!

Big Stories

Advertisement
×