బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

రెస్టారెంట్ స్టైల్ పనీర్ బటర్ మసాలా.. ఒక్కసారి తింటే ఈ రుచిని అస్సలు మర్చిపోలేరు!

రెస్టారెంట్ స్టైల్ పనీర్ బటర్ మసాలా.. ఒక్కసారి తింటే ఈ రుచిని అస్సలు మర్చిపోలేరు!

Paneer Butter Masala: పనీర్ వంటకం అంటే ఇష్టపడని చాలా తక్కువ. ముఖ్యంగా రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు ఎక్కువ మంది ముందుగా ఆర్డర్ చేసేది పనీర్ బటర్ మసాలా. ఆ కమ్మని రుచి, నోట్లో వేసుకోగానే కరిగిపోయే పనీర్ ముక్కలు ఇంట్లోనే అచ్చం అదే రుచితో వస్తే ఎంత బాగుంటుందో అనిపిస్తుంటుంది కొన్నిసార్లు. అతిథులు అకస్మాత్తుగా ఇంటికి వచ్చినప్పుడు లేదంటే ఇంట్లో వాళ్లే ఏదైనా స్పెషల్‌గా చేసి పెట్టమని అడిగినప్పుడు పెద్దగా కష్టపడకుండా.. తక్కువ సమయంలోనే చేసుకునే ఇన్స్టంట్ పనీర్ బటర్ మసాలా తయారీ విధానం గురించి తెలుసుకుందాం రండి..

కావాల్సిన పదార్థాలు:

పనీర్ ముక్కలు – ఒక కప్పు
ఉల్లిపాయలు – రెండు (చిన్నగా కట్ చేసినవి)
టమోటాలు – రెండు (పెద్ద సైజువి)
జీడి పప్పు – 8 నుంచి 10 పలుకులు
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీస్పూన్
వెన్న – కొద్దిగా
ఫ్రెష్ క్రీమ్ – ఒక టీస్పూన్
కారం, పసుపు, గరం మసాల, కసూరి మేతి – తగినతం
చెక్క, లవంగాలు, యాలకులు – తగినంత
ఉప్పు, నూనె – రుచికి సరిపడా.

Also Read: తెలంగాణ స్టైల్ బగారా అన్నం.. ముద్దపప్పు లేదా నాటుకోడి కూరతో తింటే ఇక స్వర్గమే!

తయారీ విధానం ఇలా:

ఒక పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు, జీడిపప్పు వేసి మెత్తబడే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లో రెండు చెంచాల వెన్న వేసి కరిగిన తర్వాత చెక్క, లవంగాలు, యాలకులు వేసి వేయించాలి.

తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించి, ముందుగానే సిద్ధం చేసుకున్న టమోటా, ఉల్లిపాయ మిశ్రమాన్ని వేయాలి. ఈ గ్రేవీ నుండి నూనె విడిపోయే వరకు ఉడికించి, ఆపై తగినంత కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా కలిపి కొద్దిగా నీళ్లు పోయాలి.

గ్రేవీ చిక్కబడటం ప్రారంభించినప్పుడు పనీర్ ముక్కలను వేసి ఐదు నిమిషాల పాటు తక్కువ మంటపై ఉడికించాలి. చివరగా కసూరి మేతిని చేతులతో నలిపి వేసి, రెండు చెంచాల ఫ్రెష్ క్రీమ్ కలిపితే ఎంతో రుచికరమైన పనీర్ బటర్ మసాలా రెడీ. దీనిని వేడివేడి రోటీలు లేదంటే నాన్లతో తింటే ఆ రుచిని ఎప్పటికీ మర్చిపోలేరు.

Also Read: రాయలసీమ స్పెషల్ నాటు కోడి పులుసు.. రాగి సంకటిలోకి అదిరిపోయే రుచి!

Related News

పిల్లలు ఇష్టంగా తినే ఈజీ బ్రేక్‌ఫాస్ట్.. బియ్యం లేకుండానే కరకరలాడే సాఫ్ట్ దోశ!

టేస్ట్ అట్లాస్ టాప్ లిస్ట్‌లో ఇండియన్ ఐస్‌క్రీమ్స్.. వీటిని హైదరాబాద్‌లోనే తినేయొచ్చని మీకు తెలుసా?

సమ్మర్ స్పెషల్.. శరీరానికి చలువ చేసే బెస్ట్ రైస్ డిషెస్ ఇవే!

తక్కువ వంట గ్యాస్‌తో రుచికరమైన భోజనం.. ఈ 7 వంటకాలను ట్రై చేయండి!

క్విక్ అండ్ ఈజీ.. 10 నిమిషాల్లో సిద్ధమయ్యే 7 సమ్మర్ నో-కుక్ మీల్స్

బెంగాల్ స్పెషల్.. జాల్ముడిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, జస్ట్ ఇవి ఉంటే చాలు!

ఒక్కసారి ఇలా సాంబార్ ట్రై చేసి చూడండి.. మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు!

వెజ్ ఓట్స్ ఉప్మా.. డయాబెటిస్ ఉన్నవారికి, డైట్ చేసేవారికి పర్ఫెక్ట్ బ్రేక్‌ఫాస్ట్!

×