E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

బియ్యం, పప్పు నానబెట్టే పని లేకుండా జస్ట్ 10 నిమిషాల్లో క్రిస్పీ రాగి దోశ!

బియ్యం, పప్పు నానబెట్టే పని లేకుండా జస్ట్ 10 నిమిషాల్లో క్రిస్పీ రాగి దోశ!
Advertisement

Instant Ragi Dosa: కరోనా తర్వాత చాలామంది ఆరోగ్యకరమైన జీవనం కోసం రకరకాల డైట్‌లు ఫాలో అవుతున్నారు. అయితే బరువు తగ్గడం కోసం కఠినమైన ఫాస్టింగ్‌లు వంటివి చేయకుండా.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చు. అవును మీరు విన్నది నిజమే. ముఖ్యంగా ఉదయాన్నే తీసుకునే బ్రేక్‌ఫాస్ట్‌లో పోషకాలు నిండుగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అలాంటప్పుడు రాగి దోశను ట్రై చేయడం ఉత్తమం.

ఇది కేవలం ఆరోగ్యకరమే కాదు.. సరైన పద్ధతిలో వేస్తే ఎంతో క్రిస్పీగా, రుచిగా వస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి, షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉండాలనుకునే వారికి ఇదొక పర్ఫెక్ట్ మీల్ అని చెప్పవచ్చు. తక్కువ సమయంలో, ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈ టేస్టీ దోశను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

రాగిదోశకు కావాల్సిన పదార్థాలు:

Advertisement

ఈ దోశ తయారీకి రెండు కప్పుల రాగి పిండి, అర కప్పు బియ్యం పిండి, పావు కప్పు పుల్లటి పెరుగు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా జీలకర్ర, తగినంత ఉప్పు, సన్నగా తరిగిన కొత్తిమీర, దోశలు కాల్చడానికి తగినంత నూనె దగ్గర పెట్టుకోవాలి.

Also Read: మజ్జిగ చారు ఇలా చేస్తే.. అన్నం మొత్తం దీనితోనే తినేస్తారు, బామ్మల కాలం నాటి రహస్యం ఇదే!

తయారు చేసుకునే విధానం:

Advertisement

ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో రాగి పిండి, బియ్యం పిండి, పెరుగు, తగినంత ఉప్పు వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. ఇందులో తగినన్ని నీళ్లు పోస్తూ పిండిని మజ్జిగలాగా చాలా పల్చగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, కొత్తిమీర వేసి మరోసారి కలిపి 10 నిమిషాల పాటు పక్కన పెట్టాలి.

కొద్దిసేపటి తర్వాత స్టవ్ మీద దోశ పెనం పెట్టి బాగా వేడెక్కనివ్వాలి. పెనం బాగా కాలిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి, కలిపి పెట్టుకున్న పిండిని అంచు నుంచి లోపలికి రవ్వ దోశ లాగా చిలకరించాలి. దోశ చుట్టూ కొంచెం నూనె వేసి ఎర్రగా కాలే వరకు ఉంచాలి.

రాగి దోశ ఒకవైపు కాలడానికి కొంచెం సమయం పడుతుంది కాబట్టి.. ఓపిగ్గా వేయించాలి. దోశ అంచులు వాటంతట అవే పెనం నుండి విడిపోతున్నప్పుడు నెమ్మదిగా తిరగేసి మరో నిమిషం పాటు కాల్చుకుంటే ఎంతో క్రిస్పీగా ఉండే రాగి దోశ సిద్ధమవుతుంది. దీనిని వేడివేడిగా అల్లం చట్నీ లేదంటే పల్లీల చట్నీతో తింటే అమృతంలా ఉంటుంది.

Also Read: రెస్టారెంట్ స్టైల్ పనీర్ బటర్ మసాలా.. ఒక్కసారి తింటే ఈ రుచిని అస్సలు మర్చిపోలేరు!

Related News

పిల్లలు ఇష్టంగా తినే ఈజీ బ్రేక్‌ఫాస్ట్.. బియ్యం లేకుండానే కరకరలాడే సాఫ్ట్ దోశ!

టేస్ట్ అట్లాస్ టాప్ లిస్ట్‌లో ఇండియన్ ఐస్‌క్రీమ్స్.. వీటిని హైదరాబాద్‌లోనే తినేయొచ్చని మీకు తెలుసా?

సమ్మర్ స్పెషల్.. శరీరానికి చలువ చేసే బెస్ట్ రైస్ డిషెస్ ఇవే!

తక్కువ వంట గ్యాస్‌తో రుచికరమైన భోజనం.. ఈ 7 వంటకాలను ట్రై చేయండి!

క్విక్ అండ్ ఈజీ.. 10 నిమిషాల్లో సిద్ధమయ్యే 7 సమ్మర్ నో-కుక్ మీల్స్

బెంగాల్ స్పెషల్.. జాల్ముడిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, జస్ట్ ఇవి ఉంటే చాలు!

ఒక్కసారి ఇలా సాంబార్ ట్రై చేసి చూడండి.. మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు!

వెజ్ ఓట్స్ ఉప్మా.. డయాబెటిస్ ఉన్నవారికి, డైట్ చేసేవారికి పర్ఫెక్ట్ బ్రేక్‌ఫాస్ట్!

Big Stories

×