E-Paper
Advertisement

గ్యాస్ కార్లు vs ఎలక్ట్రిక్ కార్లు.. థర్మల్ ఇమేజింగ్‌ చూస్తే షాకవ్వాల్సిందే!

గ్యాస్ కార్లు vs ఎలక్ట్రిక్ కార్లు.. థర్మల్ ఇమేజింగ్‌ చూస్తే షాకవ్వాల్సిందే!
Advertisement

Electric Cars vs Gas Cars: గ్యాస్‌ కార్లు, ఎలక్ట్రిక్ కార్లలో ఏది మంచిది అనేది చాలా కాలంగా చర్చ జరుగుతుంది. ఖర్చు, మైలేజ్‌, రేంజ్‌, మెయింటెనెన్స్‌ లాంటి పలు  అంశాల గురించి ఇప్పటికే చాలా పోలికలు కొనసాగుతున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని థర్మల్ ఇమేజింగ్ చిత్రాలు ఈ రెండు వాహనాల మధ్య ఉన్న అసలు తేడాను చాలా స్పష్టంగా చూపిస్తున్నాయి. ఇంతకీ ఈ ఫోటోలో ఏం చెప్పాయనేది ఇప్పుడు తెలుసుకుందాం..

కార్ల పనితీరు స్పష్టంగా వెల్లడించిన థర్మల్ ఇమేజెస్

సాధారణంగా బయట నుంచి చూస్తే గ్యాస్ కారు, ఎలక్ట్రిక్ కారు డిఫరెంట్ గా కనిపించవు. ఒకటి కొంచెం ఎక్కువ శబ్దం చేస్తుంది. మరొకటి నిశ్శబ్దంగా నడుస్తుంది. కానీ, థర్మల్ కెమెరాతో చూస్తే వాటి పని తీరు ఎంత భిన్నంగా ఉంటుందో అర్థమవుతుంది. థర్మల్ ఇమేజింగ్‌లో గ్యాస్ కార్ ముందు భాగం ఎక్కువగా ఆరెంజ్ కలర్ లో కనిపిస్తుంది. కారణం దాని ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్. ఇంధనం కాల్చి శక్తిని ఉత్పత్తి చేసే ప్రక్రియలో భారీగా వేడి విడుదల అవుతుంది. ఆ వేడి ఇంజిన్‌, ఎగ్జాస్ట్‌, ఇతర భాగాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఫ్యూయెల్ ద్వారా వచ్చిన పవర్ లో కొంత భాగం కారు నడిచేందుకు ఉపయోగపడితే,  ఎక్కువ భాగం వేడి రూపంలో బయటకు వెళ్లిపోతుంది.

పూర్తి భిన్నంగా ఎలక్ట్రిక్ కార్లు

Advertisement

ఎలక్ట్రిక్ కార్లలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇవి బ్యాటరీ, ఎలక్ట్రిక్ మోటార్ సహాయంతో పనిచేస్తాయి. మోటార్ ఎక్కువ వేడి ఉత్పత్తి చేయదు. సో, థర్మల్ కెమెరాలో ఇవి చాలా చల్లగా కనిపిస్తాయి. కొద్దిగా వేడి ప్రధానంగా ఎలక్ట్రానిక్ భాగాలు, చక్రాలు, లైట్ల దగ్గర మాత్రమే కనిపిస్తుంది. అందుకే ఎలక్ట్రిక్ కార్లు శక్తిని మరింత సమర్థంగా ఉపయోగిస్తాయని నిపుణులు చెబుతున్నారు.  వేడి రూపంలో తక్కువ శక్తి వృథా కావడం EVల పెద్ద అడ్వాంటేజ్ గా భావిస్తున్నారు.  బ్యాటరీలో నిల్వ ఉన్న శక్తి ఎక్కువ భాగం వాహనాన్ని ముందుకు నడిపేందుకు ఉపయోగపడుతుంది. ఈ కారణంగా ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువ ఎనర్జీ ఎఫిషియెన్సీ కలిగి ఉంటాయని చెబుతారు.

కారు ఎక్కువ కాలం మన్నికగా ఉంటుందంటే?

మరో ముఖ్యమైన అంశం కారులోని భాగాల మన్నిక. గ్యాస్ కార్లలో ఇంజిన్ ఎక్కువ వేడి ఉత్పత్తి చేయడం వల్ల కూలింగ్ సిస్టమ్‌ పై ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. ఇంజిన్ ఆయిల్‌, రేడియేటర్‌, ఇతర భాగాలకు నిరంతర మెయింటెనెన్స్ అవసరం అవుతుంది. కానీ, ఎలక్ట్రిక్ కార్లలో వేడి తక్కువగా ఉండటంతో ఆయా భాగాలపై ఒత్తిడి కూడా తక్కువగా ఉంటుంది. దీని వల్ల కొన్ని భాగాలు ఎక్కువ కాలం పని చేసే అవకాశం ఉంటుందని ఆటో నిపుణులు చెప్తున్నారు.

Advertisement

EV కార్లు, గ్యాస్ కార్ల మధ్య చర్చ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కొన్ని అధ్యయనాలు గ్యాస్ కార్ల యజమానులు తమ వాహనాలను చాలా సంవత్సరాలు వాడుతున్నారని చెబుతుంటే, మరికొన్ని నివేదికల ప్రకారం EV యజమానులు కొత్త టెక్నాలజీ కోసం త్వరగా కార్లు మార్చుతున్నారని వెల్లడిస్తున్నాయి. అయితే, థర్మల్ ఇమేజింగ్ మాత్రం గ్యాస్ కార్లు, ఎలక్ట్రిక్ కార్ల మధ్య ఉన్న ఎనర్జీ వినియోగ తేడాను చాలా స్పష్టంగా చూపించింది.

Read Also: ఇవాళ్టి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే.. దేశంలో అత్యంత ఎక్కువ రేట్లు హైదరాబాద్‌ లోనే!

Related News

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×