E-Paper
Advertisement

తమిళనాడులో ఏం జరిగిందో చూడండి.. వెన్నుపోటు పొడవడం కాంగ్రెస్‌ నైజం, ప్రధాని మోదీ ఘాటు విమర్శలు

తమిళనాడులో ఏం జరిగిందో చూడండి.. వెన్నుపోటు పొడవడం కాంగ్రెస్‌ నైజం,  ప్రధాని మోదీ ఘాటు విమర్శలు
Advertisement

PM Modi: కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ప్రధాని నరేంద్రమోదీ. ఆ పార్టీ చేస్తున్న రాజకీయాలపై అస్త్రాలను ఎక్కుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. మూడు దశాబ్దాలుగా డీఎంకేతో కాంగ్రెస్ పార్టీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అన్నారు. ఇప్పుడు టీవీకే పార్టీతో చేతులు కలిపిందన్నారు.

కాంగ్రెస్ పార్టీ ప్రధాని నరేంద్రమోదీ ఘాటు విమర్శలు

Advertisement

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి విజయ్ ప్రమాణ స్వీకారం చేసినందుకు ప్రధానమంత్రి మోదీ అభినందనలు తెలిపారు. ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు రాష్ట్రంతో కలిసి కేంద్రం పని చేస్తుందని హామీ ఇచ్చారు. బెంగుళూరులో బీజేపీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు హాజరయ్యారు ప్రధాని నరేంద్రమోదీ. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమిళనాడు రాజకీయాలకు తెరపైకి తెచ్చారు.

డీఎంకే పార్టీతో పొత్తు వల్లే కాంగ్రెస్‌ పార్టీ అనేక సార్లు సంక్షోభాల నుంచి బయటపడిందన్నారు. నిజానికి 2014కు ముందు 10 ఏళ్ల పాటు పాలన సాగించిన కాంగ్రెస్ పార్టీ, డీఎంకే వల్లే మనుగడ సాగించిందన్నారు. కాంగ్రెస్ శ్రేయస్సు కోసం నిరంతరం పని చేసిన డీఎంకే, రాజకీయ పరిస్థితులు మారిన వెంటనే మిత్రులను వదలి టీవీకేతో చేతులు కలిపిందని విమర్శించారు.

Advertisement

వెన్నుపోటు పొడవడం కాంగ్రెస్‌ నైజం.. తమిళనాడులో ఏం జరిగిందో చూడండి-ప్రధాని

అధికారంపై ఉన్న దురాశతో మిత్రుడికి వెన్నుపోటు పొడిచిందన్నారు. రాజకీయంగా తన ఉనికిని నిలుపుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీ ఎంతటి దారుణానికి తెగిస్తుందన్నారు. కర్ణాటకలో సుపరిపాలన అందించడంలో కాంగ్రెస్‌ విఫలమైందని దుయ్యబట్టారు. గడిచిన మూడేళ్లుగా ప్రజా సమస్యలు పరిష్కరించడానికి బదులు, అంతర్గత కలహాలు పరిష్కరించుకోవడానికి ప్రభుత్వ నేతలు ప్రయార్టీ ఇస్తున్నారని దుయ్యబట్టారు.

ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎంత కాలం కొనసాగుతారో, మరో వ్యక్తికి అవకాశం లభిస్తుందో లేదో కూడా ఆ పార్టీ నిర్ణయించలేకపోతోందన్నారు. సరైన ఎజెండా లేక కాంగ్రెస్‌కు ప్రజల్లో వ్యతిరేకత వస్తోందన్నారు. ఆ పార్టీకి ఆదరణ తగ్గితోందని, సురక్షిత పాలన, అభివృద్ధి కోసం బీజేపీ వైపు ప్రజలు చూస్తున్నారని చెప్పుకొచ్చారు.

ALSO READ: తమిళనాడు సీఎం విజయ్.. ప్రమాణ స్వీకారం తర్వాత తొలి సంతకం దానిపైనే

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బెంగాల్‌, అస్సాం ప్రజలు కాషాయ పార్టీకి పట్టం కట్టారని గుర్తు చేశారు. భవిష్యత్తు కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పకనే చెప్పారు. ప్రధాని వ్యాఖ్యలతో రానున్న రోజుల్లో తమిళనాడు చుట్టూ దక్షిణాది రాజకీయాలు తిరగడం ఖాయమనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

 

Related News

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

వైద్యులపై దాడికి దిగితే.. కనికరం చూపొద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ప్రాణం పోయే ఆఖరిక్షణం.. దేవదూతల్లా పెళ్లైన జంట ప్రత్యక్షం, యువ బైకర్ సేఫ్, వీడియో వైరల్

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. ఉత్తరాఖండ్‌లో హిమానీనదాల మాటేంటి? ముప్పు పొంచివుందా?

ప్రధాని మోదీ మరోసారి విజ్ఞప్తి.. బంగారం కొనుగోళ్లపై కీలక వ్యాఖ్యలు, స్వదేశీ మంత్రంతోపాటు

Big Stories

Advertisement
×