E-Paper
Advertisement

ఇవాళ్టి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే.. దేశంలో అత్యంత ఎక్కువ రేట్లు హైదరాబాద్‌ లోనే!

ఇవాళ్టి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే.. దేశంలో అత్యంత ఎక్కువ రేట్లు హైదరాబాద్‌ లోనే!
Advertisement

May 10 Fuel Price Update: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఇవాళ పెద్దగా మార్పులు లేవు. మే 10, 2026 నాడు ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు దాదాపు స్థిరంగానే కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌ లో ముడి చమురు ధరల ప్రభావం, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు విధించే వ్యాట్‌, స్థానిక పన్నుల ఆధారంగా ఒక్కో రాష్ట్రంలో ధరలు మారుతున్నాయి. దీంతో దేశంలోని నగరాల మధ్య ఇంధన ధరల్లో తేడాలు కనిపిస్తున్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే?

ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరలు లీటరుకు సుమారు రూ.94 నుంచి రూ.107 వరకు ఉండగా, డీజిల్ ధరలు రూ.87 నుంచి రూ.95 వరకు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.94.77గా ఉండగా, డీజిల్ ధర రూ.87.67గా ఉంది. ముంబైలో పెట్రోల్ రూ.103.54, డీజిల్ రూ.90.03గా నమోదైంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.105.45 కాగా, డీజిల్ రూ.92.02గా ఉంది.

పెట్రో ధరలు హైదరాబాద్ లోనే ఎక్కువ 

Advertisement

సౌత్ స్టేట్స్ లో పెట్రో ధరలు కొంత ఎక్కువగా ఉన్నాయి. చెన్నైలో పెట్రోల్ లీటరుకు రూ.100.84, డీజిల్ రూ.92.39గా ఉంది. బెంగళూరులో పెట్రోల్ ధర రూ.102.96 కాగా, డీజిల్ రూ.90.99గా నమోదైంది. హైదరాబాద్‌లో మాత్రం అత్యధిక ధరలు కనిపిస్తున్నాయి. ఇక్కడ పెట్రోల్ ధర రూ.107.45కు చేరుకోగా, డీజిల్ ధర రూ.95.70గా ఉంది.

చిత్తూరులోఅత్యధిక  డీజిల్ ధర

దేశవ్యాప్తంగా చూస్తే కొన్ని ప్రాంతాల్లో ఇంధన ధరలు మరింత ఎక్కువగా ఉండగా, మరికొన్ని ప్రాంతాల్లో తక్కువగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో డీజిల్ ధర అత్యధికంగా సుమారు రూ.98.23 వరకు ఉంది.అటు అండమాన్ నికోబార్ దీవుల్లోని పోర్ట్ బ్లెయిర్‌ లో డీజిల్ ధర దేశంలోనే అత్యల్పంగా సుమారు రూ.78.05గా ఉంది. స్థానిక పన్నుల కారణంగానే ఈ తేడాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ధరల సమీక్ష

Advertisement

ఇంధన ధరలు ప్రతి రోజు ఉదయం 6 గంటలకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సవరిస్తుంటాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరలు, డాలర్‌తో రూపాయి మారకం విలువ, రవాణా ఖర్చులు, స్థానిక పన్నులు వంటి అంశాల ఆధారంగా ఈ ధరలు నిర్ణయిస్తారు. కొన్నిసార్లు ధరల్లో మార్పులు లేకపోయినా, ప్రతి రోజు కొత్త ధరలను అధికారికంగా ప్రకటిస్తుంటారు. ఇక ప్రజలు తమ ప్రాంతానికి సంబంధించిన తాజా ఇంధన ధరలను చాలా సులభంగా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అందిస్తున్న SMS సేవ ద్వారా వినియోగదారులు తాజా ధరలను చెక్ చేసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం RSP తర్వాత సిటీ పిన్ కోడ్ టైప్ చేసి 92249 92249 నంబర్‌కు మెసేజ్ పంపితే ఆ ప్రాంతానికి సంబంధించిన తాజా పెట్రోల్, డీజిల్ ధరలు ఫోన్‌కు వస్తాయి.

Read Also: పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు విడుదల.. హైదరాబాద్‌లో రేట్లు ఎలా ఉన్నాయంటే?

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×