E-Paper
Advertisement

Car AC Mistakes: ఎండాకాలం ఈ మిస్టేక్స్ అస్సలు చేయకండి, లేదంటే కారు ఏసీ పని చేయదు!

Car AC Mistakes: ఎండాకాలం ఈ మిస్టేక్స్ అస్సలు చేయకండి, లేదంటే కారు ఏసీ పని చేయదు!
Advertisement

ఎండాకాలం వస్తే చాలా మంది కార్లలో ఏసీలు ఉపయోగిస్తారు. అయితే, సమ్మర్ లో కారు ఎయిర్ కండిషనింగ్ పనితీరు గురించి కామన్ గా ఫిర్యాదులు వస్తుంటాయి. ఏసీ వేసినా, కారు కూల్ కావడం లేదంటారు. అయితే, ఇందుకు యాంత్రిక లోపాల కంటే డ్రైవింగ్ అలవాట్ల మీదే ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ AC వినియోగం పెరుగుతుంది.  చాలా మంది వాహనదారులు తక్కువ రిఫ్రిజెరాంట్ స్థాయిలతో పాటు ఏసీ భాగాల వైఫల్యా కారణంగా ఇలా జరుగుతుందని భావిస్తారు. చాలా సందర్భాలలో సిస్టమ్ సాధారణంగా పని చేస్తుందని సాంకేతిక నిపుణులు గుర్తించారు. కారు ఎలా ఉపయోగించబడుతుంది? ఎలా మెయింటెయిన్ చేయబడుతుంది? అనే అంశాలు కారు కూలింగ్ మీద ఆధారపడి ఉంటాయి. కారులో ఏసీ సరిగా పని చేయాలంటే ఈ మిస్టేక్స్ అస్సలు చేయకూడదు.

⦿ కారు ఆన్ చేయగానే AC ఒకేసారి పెంచకూడదు!

ఎండలో నిలిపిన కారును స్టార్ట్ చేయగానే, వెంటనే ఏసీ ఆన్ చేయకూడదు. కారులోకి వచ్చిన వెంటనే ACని గరిష్ట శీతలీకరణకు మార్చడం చాలా తప్పు. క్యాబిన్ వేడెక్కినప్పుడు, కూలింగ్ అయ్యేందుకు ముందు కారులోని వేడి గాలిని ముందుగా బయటకు పంపాలి. బిల్ట్ అప్ వేడిని విడుదల చేయడానికి విండోలను ఓపెన్ చేయాలి. ఆ తర్వాత ఏసీని ఆన్ చేయాలి.

⦿ రీసర్క్యులేషన్ మోడ్ వాడకం

Advertisement

రీసర్క్యులేషన్ మోడ్ ను చాలా మంది తప్పుగా వాడుతారు. బయటి గాలిని పీల్చుకోవడానికి బదులుగా క్యాబిన్ గాలిని బయటకు పంపించడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. పీక్ హీట్ సమయంలో ఈ మోడ్ ఆన్ చేయాలి. వెచ్చని గాలిని కూల్ చేస్తుంది. రీసర్క్యులేషన్ మోడ్‌కు మారడం వల్ల క్యాబిన్ వేగంగా చల్లగా అవుతుంది. ఉష్ణోగ్రతను మరింత సమర్థవంతంగా కంట్రోల్ చేస్తుంది.

⦿ క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్‌ను పట్టించుకోకపోవడం

క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్‌ను విస్మరించడం వల్ల కూడా ఏసీ పనితీరు తగ్గుతుంది. దుమ్ము, చేరడం వల్ల వెంట్‌ ల ద్వారా గాలి ప్రవాహం సరిగా జరగదు. ఫలితంగా కారు త్వరగా కూల్ కాదు. తరచుగా దుమ్ముతో కూడిన భాగాలను శుభ్రం చేయాలి.

⦿ సాధారణ AC సర్వీసును వాడకూడదు

Advertisement

సాధారణ AC వాడకకపోవడం మంచింది. చిన్న లీక్‌ల కారణంగా రిఫ్రిజెరాంట్ స్థాయిలు తగ్గవచ్చు. కంప్రెసర్లు, కండెన్సర్లు లాంటివి నెమ్మదిగా అరిగిపోతాయి. కూలింగ్ పడిపోయే వరకుచెక్ చేయడం మర్చిపోతే, రిపేరు ఖర్చులు భారీగా పెరిగే అవకాశం ఉంటుంది.

⦿ పార్కింగ్ పద్దతులు

పార్కింగ్ పద్ధతులు క్యాబిన్ ఉష్ణోగ్రతను ప్రభావితం చేస్తాయి. ఎక్కువసేపు ఎండలో ఉంచిన కారులో లోపల వేడి పెరుగుతుంది. క్యాబిన్‌ను చల్లబరచడానికి అవసరమైన సమయం పెరుగుతుంది. అందుకే, నీడ ఉన్నప్రదేశాల్లో కారును పార్క్ చేయడం వల్ల, కారు ఏసీ వేయగానే ఈజీగా కూల్ అవుతుంది.

మొత్తంగా AC పనితీరు సిస్టమ్ స్థితిపై మాత్రమే కాకుండా వాహనదారుల డ్రైవింగ్ స్టైల్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. యాక్టివేషన్‌కు ముందు క్యాబిన్‌ను వెంటిలేట్ చేయడం, సరైన మోడ్‌ను ఎంచుకోవడం, సర్వీస్ షెడ్యూల్‌ ఫాలో కావడం లాంటివి పాటిస్తే కారు త్వరగా కూల్ అవుతుంది.

Read Also: ఇలా ఆన్, ఆఫ్ చేస్తున్నారా? అయితే, మీ కారు గోవిందా!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×