E-Paper
Advertisement

Viral Video: యమహా అద్భుతం.. ఈ బైక్ పడేసినా పడిపోదు!

Viral Video: యమహా అద్భుతం.. ఈ బైక్ పడేసినా పడిపోదు!
Advertisement

Yamaha Self-Balancing Bike: ఆటో దిగ్గజం యమహా.. ఎప్పటికప్పుడు సరికొత్త టెక్నాలజీని తీసుకొస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉంది. తాజాగా ఈ కంపెనీ మరో అద్భుతమైన టెక్నాలజీని పరిచయం చేసింది. ఏకంగా సెల్ఫ్ బ్యాలెన్సింగ్ బైక్ ను ఆవిష్కనించింది.  ఈ బైక్ భవిష్యత్ టెక్నాలజీకి ప్రతిరూపంగా అభివర్ణించింది. ఈ బైక్‌ ను యమహా ‘మోటరాయిడ్’ కాన్సెప్ట్ పేరుతో అభివృద్ధి చేసింది. ఇది సాధారణ బైక్‌ లా కాకుండా, ఆటోమేటిక్ గా నిలబడుతుంది. కింద పడేసేందుకు ప్రయత్నించినా పడిపోదు. అంతేకాదు, రైడర్‌ను గుర్తించడం లాంటి ప్రత్యేక ఫీచర్లతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

స్టాండ్ లేకుండా నిలబడే యమహా బైక్

సాధారణంగా మనం చూసే బైక్‌ లు నిలబడాలంటే స్టాండ్ అవసరం. కానీ ఈ మోటరాయిడ్ బైక్‌ లో స్టాండ్ అవసరం లేదు. ఇందులో ఉన్న ప్రత్యేకమైన టెక్నాలజీ కారణంగా ఆటోమేటిక్ గా బ్యాలెన్స్ చేసుకుంటూ నిలబడుతుంది. ఇందుకోసం యమహా యాక్టివ్ మాస్ సెంటర్ కంట్రోల్ సిస్టమ్ (AMCES) అనే టెక్నాలజీని ఉపయోగించింది. ఈ బైక్ బరువును లోపలే కంట్రోల్ చేస్తూ, సెంటర్ ఆఫ్ గ్రావిటీని సర్దుబాటు చేసి బైక్ పడిపోకుండా నిలబెడుతుంది.

రైడర్ ను గుర్తించేలా ఏఐ ఫీచర్లు

Advertisement

ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ బైక్ కేవలం నిలబడడమే కాదు, రైడర్‌ ను గుర్తిస్తుంది కూడా.  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా యజమాని ముఖాన్ని, చేతి సిగ్నల్స్ ను గుర్తించి రియాక్ట్ అవుతుంది. అంటే, యజమాని దగ్గరకు రాగానే బైక్ అతడి వైపు రావడం, వారి సూచనలకు అనుగుణంగా కదలడం చేస్తుంది. ఈ బైక్‌లో మరో ప్రత్యేకత ఏమిటంటే..  ఇది మనిషి, యంత్రం మధ్య ఒక కొత్త రకం సంబంధాన్ని ఏర్పరచేలా రూపొందించబడింది. సాధారణంగా వాహనం ఒక సాధనం మాత్రమే. కానీ మోటరాయిడ్ మాత్రం పార్ట్ నర్ గా కొనసాగేలా యమహా రూపొందిస్తోంది. ఇది రైడర్ బాడీ మూవ్ మెంట్స్ ను గుర్తించి, దానికి అనుగుణంగా స్పందించే హ్యూమన్ మెషీన్ ఇంటర్‌ ఫేస్‌ను కలిగి ఉంది.

ఎలక్ట్రిక్ వెహికల్ గా అందుబాటులోకి..

Advertisement

ఈ బైక్ పెట్రో వెర్షన్ లో కాకుండా ఎలక్ట్రిక్ మోడల్ గా రానుంది. భవిష్యత్తులో కాలుష్యం తగ్గించడానికి, స్మార్ట్ మొబిలిటీని పెంచడానికి ఇలాంటి బైక్స్ ఉపయోగపడుతాయని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఇది మార్కెట్‌లో అందుబాటులో లేని కాన్సెప్ట్ మోడల్. కానీ,  భవిష్యత్తులో ఇలాంటి బైక్‌ లు సాధారణంగా మారే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా యమహా సెల్ఫ్ బ్యాలెన్సింగ్ బైక్ అనేది ఒక వాహనం మాత్రమే కాదు, టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,  భవిష్యత్ ప్రయాణానికి గుర్తుగా నిలువబోతోంది. ఇప్పటి వరకు చూసిన బైక్‌ లకు భిన్నంగా, మనిషితో కలిసి పని చేసే స్మార్ట్ మెషీన్‌ గా మారే అవకాశం కనిపిస్తోంది.

Read Also: ఆ టైమ్ లో పెట్రోల్ కొట్టిస్తే ఎక్కువ వస్తుందా? ఇన్నాళ్లూ ఈ విషయం తెలియదే!

Related News

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×