E-Paper
Advertisement

TTP Warns PSL 2026: త‌ల‌లు తెగిపడ‌తాయి, వెంట‌నే పాకిస్తాన్ ను వ‌దిలి వెళ్లిపోండి..విదేశీ క్రికెట‌ర్ల‌కు ఉగ్ర‌వాదుల హెచ్చ‌రిక‌

TTP Warns PSL 2026: త‌ల‌లు తెగిపడ‌తాయి, వెంట‌నే పాకిస్తాన్ ను వ‌దిలి వెళ్లిపోండి..విదేశీ క్రికెట‌ర్ల‌కు ఉగ్ర‌వాదుల హెచ్చ‌రిక‌
Advertisement

TTP Warns PSL 2026:  పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament) మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ టోర్నమెంట్ కు అడుగడుగున చిక్కులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఈ టోర్నమెంటును ప్రేక్షకులు లేకుండానే నిర్వహిస్తామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( Pakistan Cricket Board) ప్రకటించింది. టికెట్లు కొనుగోలు చేసిన వాళ్లకు 72 గంటల్లోనే డబ్బులు వాపస్ కూడా ఇస్తామని వెల్లడించింది. ఈ బాధలో ఉన్న అభిమానులకు మరో ఊహించని షాక్ తగిలింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ సందర్భంగా విదేశీ క్రికెటర్లు పాల్గొనకూడదని పాకిస్తాన్ ఉగ్రవాదులే హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు తెహ్రీక్ ఎ తాలిబన్ పాకిస్తాన్ ( Tehrik-i-Taliban Pakistan) ఉగ్రవాద సంస్థ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. పాకిస్తాన్ లోనే ఉంటే ఏదైనా ప్రమాదం జరగవచ్చు అని హెచ్చరికలు జారీ చేసింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఏ క్షణమైన దాడి జరిగే ప్రమాదం ఉందని తెలిపింది. అందుకే విదేశీ క్రికెట‌ర్లు త‌మ దేశాల‌కు వెళ్లిపోవాల‌ని సూచ‌న‌లు చేసింది తెహ్రీక్ ఎ తాలిబన్ పాకిస్తాన్.

Also Read:  Clash in SRH: కావ్య మారన్ కు మ‌రో త‌ల‌నొప్పి.. SRH లో ప్లేయ‌ర్ల మ‌ధ్య గొడ‌వ‌..కెప్టెన్ ఇషాన్ పైనే తిరుగుబాటు

విదేశీ క్రికెటర్లు వెంటనే పాకిస్తాన్ నుంచి వెళ్లిపోండి…TTP వార్నింగ్

Advertisement

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( PSL 2026) మార్చి 26వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తెహ్రీక్ ఎ తాలిబన్ పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ నుంచి స్ట్రాంగ్ వార్నింగ్ వచ్చింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ఆడేందుకు వచ్చిన విదేశీ క్రికెటర్లు వెంటనే తమ దేశాలకు వెళ్ళిపోవాలని హెచ్చరికలు జారీ చేసింది. ఆఫ్ఘనిస్తాన్ ఏ క్షణమైనా పాకిస్తాన్ స్టేడియాలపై దాడులు చేసే ప్రమాదం ఉందని.. ఇతర భద్రత కారణాల వల్ల విదేశీ క్రికెటర్లు పాకిస్తాన్ లో ఉండడం ఏ మాత్రం సేఫ్ కాదని ఈ ఉగ్రవాద సంస్థ సూచనలు చేసింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంటు ఆడకుండా వెంటనే తమ దేశాలకు టికెట్లు బుక్ చేసుకోవాలని కోరింది.

అలా కాదని ప్రాణాలకు తెగించి క్రికెట్ ఆడతామంటే తామేమి చేయలేమని వెల్లడించింది. ఒకవేళ మ్యాచ్ జరిగేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం తామేమి చేయలేమని, ఇప్పుడే జాగ్రత్తగా ఇంటికి వెళ్లాలని వార్నింగ్ ఇచ్చింది తెహ్రీక్ ఎ తాలిబన్ పాకిస్తాన్. ఈ మేరకు TTP ఉగ్రవాద సంస్థ అధికారి జమాత్ ఉల్ అహ్రార్ ప్రకటన విడుదల చేశారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా క్రికెటర్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, డారెల్ మిచెల్, మాక్సిమామ లాంటి పేర్లను కూడా తెహ్రీక్ ఎ తాలిబన్ పాకిస్తాన్ ప్రస్తావిస్తూ వార్నింగ్ ఇచ్చింది. వెంటనే తమ దేశాలకు వెళ్లిపోవాలని సూచనలు చేసింది. మరి దీనిపై పాకిస్తాన్ సర్కార్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Advertisement

Also Read: Tanveer Ahmed: ఐపీఎల్ జోలికి వెళ్లొద్దు రా..వెంట‌నే PSL షెడ్యూల్ మార్చండి, లేక‌పోతే సంక‌నాకి పోతాం

 

Related News

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×