E-Paper
Advertisement

ఏప్రిల్ 2026లో టాప్ 10 బైక్స్.. ఫస్ట్ ప్లేస్ లో హీరో స్ప్లెండర్‌!

ఏప్రిల్ 2026లో టాప్ 10 బైక్స్.. ఫస్ట్ ప్లేస్ లో హీరో స్ప్లెండర్‌!
Advertisement

Best Selling Bikes April 2026: ఇండియన్ టూ వీలర్ మార్కెట్ మంచి జోష్ లో దూసుకెళ్తోంది. ఏప్రిల్ 2026లో అమ్మకాలు జోరందుకున్నాయి. గత ఏడాదితో పోలిస్తే టాప్ 10 బైక్‌ల మొత్తం అమ్మకాలు 32 శాతం కంటే ఎక్కువ వృద్ధిని నమోదు చేశాయి. 2025 ఏప్రిల్‌లో 6.95 లక్షల యూనిట్లు అమ్ముడవగా, 2026 ఏప్రిల్‌ లో ఈ సంఖ్య 9.22 లక్షలకు చేరింది. ఇందులో హీరో స్ప్లెండర్ మరోసారి దేశంలో అత్యధికంగా అమ్ముడైన బైక్‌ గా గుర్తింపు తెచ్చుకుంది.

ఒకే నెలలో 3.09 లక్షల స్ప్లెండర్ అమ్మకాలు

హీరో స్ప్లెండర్ అమ్మకాలు ఒక్క ఏడాదిలోనే భారీగా పెరిగాయి. 2025 ఏప్రిల్‌లో 1.97 లక్షల యూనిట్లు అమ్ముడవగా, ఈసారి 3.09 లక్షల యూనిట్లు విక్రయమయ్యాయి. దాదాపు 56 శాతం వృద్ధితో స్ప్లెండర్ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. మంచి మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ బైక్‌కు ఇప్పటికీ భారీ డిమాండ్ ఉంది.

రెండు, మూడో స్థానాల్లో షైన్, పల్సర్

Advertisement

ఇక రెండో స్థానంలో హోండా షైన్ నిలిచింది. 1.82 లక్షల యూనిట్ల అమ్మకాలతో ఇది స్థిరమైన ప్రదర్శన ఇచ్చింది. గత ఏడాదితో పోలిస్తే 8 శాతం వృద్ధి సాధించింది. 100cc, 125cc ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉండటం షైన్‌ కు ప్లస్ పాయింట్‌గా మారింది. మూడో స్థానంలో బజాజ్ పల్సర్ ఉంది. 1.31 లక్షల యూనిట్ల అమ్మకాలతో పల్సర్ సిరీస్ మార్కెట్లో మంచి స్థిరత్వాన్ని చూపించింది. 125cc నుంచి 400cc వరకు పలు వేరియంట్లు అందుబాటులో ఉండటంతో యువతలో మంచి ఆదరణ కొనసాగుతోంది. N, NS, RS, క్లాసిక్ సిరీస్‌ లు పల్సర్  కస్టమర్లను ఆకర్షిస్తోంది.

హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ ఈసారి అందరినీ ఆశ్చర్యపరిచింది. గత ఏడాది 41 వేల యూనిట్లు మాత్రమే అమ్ముడవగా, ఈసారి అమ్మకాలు 91 వేల దాటాయి. దాదాపు 121 శాతం వృద్ధి నమోదు కావడం విశేషం. తక్కువ ధరలో మంచి మైలేజ్ ఇవ్వడం దీనికి ప్రధాన బలం. టీవీఎస్ అపాచీ కూడా మంచి అమ్మకాలు సాధించింది. 49 వేలకుపైగా యూనిట్లు అమ్ముడవగా, గతేడాదితో పోలిస్తే 8 శాతం వృద్ధి సాధించింది. స్పోర్టీ లుక్, పెర్ఫార్మెన్స్ కారణంగా యువతలో అపాచీకి మంచి క్రేజ్ ఉంది.

Advertisement

హోండా CB యూనికార్న్ 51 శాతం వృద్ధితో ఆరో స్థానంలో నిలిచింది. ఇక రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350, బుల్లెట్ 350 మోడళ్లు కూడా టాప్ 10లో చోటు దక్కించుకుంది. క్లాసిక్ 350 అమ్మకాలు 37 వేల దాటగా, బుల్లెట్ 350కు కూడా మంచి స్పందన లభించింది. ఈ లిస్టులో అత్యంత వేగంగా దూసుకొచ్చిన బైక్ హీరో గ్లామర్. గత ఏడాది కేవలం 4,941 యూనిట్లు మాత్రమే అమ్ముడవగా, ఈసారి 26 వేలకుపైగా యూనిట్లు సేల్ అయ్యాయి.  దాదాపు 438 శాతం వృద్ధితో గ్లామర్ రికార్డు సృష్టించింది. అయితే, టీవీఎస్ రైడర్ మాత్రం నిరాశపరిచింది. గతేడాదితో పోలిస్తే అమ్మకాలు తగ్గి 29 వేల యూనిట్లకు పడిపోయాయి. టాప్ 10లో నెగటివ్ గ్రోత్ నమోదు చేసిన ఏకైక బైక్ ఇదే కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

Read Also:  ఓలా ఎలక్ట్రిక్‌ కు భారీ షాక్.. నష్టాలు తగ్గినా లాభాల్లోకి రాని ఓలా ఎలక్ట్రిక్!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×