E-Paper
Advertisement

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!
Advertisement

Best Mileage Cars Under Rs.5 Lakh: కొత్త కారు కొనాలనుకునే చాలా మంది మొదట చూసేది ధర, తర్వాత మైలేజ్. ముఖ్యంగా రూ.5 లక్షల లోపు బడ్జెట్ ఉన్నవాళ్లు.. తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లను  తీసుకోవాలని చూస్తుంటారు. ప్రస్తుతం భారత మార్కెట్లో ఈ ధరలో మంచి పనితీరు, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు, ఎక్కువ ఫ్యూయల్ ఎఫిషియెన్సీతో కొన్ని కార్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో టాప్ 3 మోడల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1.మారుతి సుజుకి ఆల్టో K10

రూ.5 లక్షల బడ్జెట్‌ లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఆల్టో K10 ఒకటి. సిటీలో రోజువారీ ప్రయాణాలకు బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తోంది. 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే ఈ కారు పనితీరు కూడా బాగుంటుంది. ఈ కారు లీటరుకు సుమారు 24  కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. ప్రారంభ ధర సుమారు రూ.3.70 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా ఉంటుంది. తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు, మంచి సర్వీస్ నెట్‌వర్క్, ఎక్కువ రీసేల్ విలువ ఈ కారు ప్రత్యేకతలుగా చెప్పుకోవచ్చు.

2.మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో

Advertisement

ఎస్ ప్రెస్సో చిన్న సైజు SUV లుక్‌ తో ఆకట్టుకుంటుంది. హ్యాచ్‌ బ్యాక్ కంటే కొంచెం ఎత్తుగా ఉండటం వల్ల డ్రైవింగ్ సమయంలో మంచి విజిబిలిటీ లభిస్తుంది. ఈ కారు లీటరుకు సుమారు 24 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ప్రారంభ ధర సుమారు రూ.4.15 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఎత్తైన గ్రౌండ్ క్లియరెన్స్, విశాలమైన క్యాబిన్, సులభమైన డ్రైవింగ్ ఎక్స్ పీరియెన్స్ దీని ప్రత్యేకతలుగా చెప్పుకోవచ్చు. సిటీతో పాటు గ్రామీణ రోడ్లపై కూడా ఈ కారు సౌకర్యవంతంగా ప్రయాణిస్తుంది.

3.రెనాల్ట్ క్విడ్

స్టైలిష్ డిజైన్, అత్యాధునిక ఫీచర్లు కోరుకునే వారికి రెనాల్ట్ క్విడ్ బెస్ట్ ఆప్షన్. ముఖ్యంగా యూత్ లో ఈ కారుకు మంచి ఆదరణ ఉంది. ఈ కారులో పెద్ద టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్, మంచి డిజైన్, సౌకర్యవంతమైన ఇంటీరియర్ లభిస్తాయి. ఈ కారు లీటరుకు సుమారు 21 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. దీని ప్రారంభ ధర సుమారు రూ.4.23 లక్షలు (ఎక్స్ షోరూమ్).

ఏ కారు తీసుకుంటే మంచిది?

Advertisement

ఎక్కువ మైలేజ్, తక్కువ మెయింటెయిన్ ఖర్చు కావాలంటే మారుతి ఆల్టో K10 మంచి ఆప్షన్. SUV   లుక్, ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ కావాలనుకుంటే మారుతి ఎస్ ప్రెస్సో తీసుకోవాలి. స్టైలిష్ డిజైన్‌ తో పాటు ఆధునిక ఫీచర్లు కావాలంటే రెనాల్ట్ క్విడ్ను కొనవచ్చు. రోజువారీ ప్రయాణాలు చేసే వారికి ఇవి ఇంధన ఖర్చును తగ్గించడంతో పాటు మెయింటెనెన్స్ ఖర్చును కూడా తగ్గిస్తాయి.

Read Also: హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

Related News

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×