E-Paper
Advertisement

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక..  సత్తా చాటిన తెలుగు కుర్రాడు!
Advertisement

NEXA Awards 2026:అవార్డు అనేది ఒక నటుడి ప్రతిభకు దక్కే ఫలితం. అంతేకాదు ఆ అవార్డు లభించడం వల్ల ఆ నటీనటులలో ఇంకా బాగా నటించాలి అనే పట్టుదల పెరుగుతుంది. అలా విజయానికి చిహ్నంగా నిలిచే ఈ అవార్డులు సెలబ్రిటీలను ఎక్కడికో తీసుకెళ్తాయి. అంతేకాదు ఈ అవార్డు అందుకోవడం కోసమైనా సరే అద్భుతంగా నటించే నటీనటులు కూడా లేకపోలేదు. ఇదిలా ఉండగా ఇటీవల జూలై 18వ తేదీన 72వ జాతీయ చలనచిత్రం అవార్డుల ప్రకటన ఘనంగా జరిగింది. ముఖ్యంగా సినిమాలలో సత్తా చాటిన సెలబ్రిటీలకు ఈ అవార్డును అందజేస్తారు.

ఘనంగా నెక్సా ఇండియన్ స్ట్రీమింగ్ అకాడమీ అవార్డ్స్ వేడుక..

అయితే ఇప్పుడు ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు, దర్శకులు, వెబ్ సిరీస్ లను సత్కరిస్తూ.. మారుతి సుజుకి నెక్సా ఇండియన్ స్ట్రీమింగ్ అకాడమీ అవార్డ్స్ 2026 వేడుక చాలా ఘనంగా జరిగింది. ముఖ్యంగా మారుతి సుజుకి నెక్సా ఇండియన్ స్ట్రీమింగ్ అకాడమీ అవార్డ్స్ మూడవ ఎడిసన్ ముంబైలోని ఫైర్ మాంట్ హోటల్లో జూలై 19వ తేదీన చాలా ఘనంగా జరిగింది. భారతదేశ నలుమూలల నుండి ఓటీటీ రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ఈ అవార్డులతో సత్కరించారు.

Advertisement

also read:సెన్సార్ పూర్తి చేసుకున్న నయనతార ‘హాయ్’.. రిలీజ్ డేట్ లాక్!

సందడి చేసిన ఇండియన్ సెలబ్రిటీస్..

అయితే ఈ అవార్డుకి టాలీవుడ్ నటుడు ఎంపికవడం గమనార్హం. విభిన్నమైన కథలతో, పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ.. తెలుగు నటులలో ఒకరిగా పేరు సొంతం చేసుకున్న రాగ్ మయూర్ ముంబై వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక నెక్సా స్ట్రీమింగ్ అకాడమీ అవార్డ్ ను సొంతం చేసుకున్నారు. ఉత్తమ నటుడిగా సివరపల్లి వెబ్ సిరీస్ లో ఆయన పోషించిన పాత్రకు అవార్డు లభించింది. పైగా టాలీవుడ్, బాలీవుడ్ తో పాటు అన్ని సినీ పరిశ్రమల సెలబ్రిటీలు ఈ ఈవెంట్లో సందడి చేశారు.

ఉత్తమ నటుడిగా తెలుగు హీరో..

Advertisement

ఇకపోతే దేశవ్యాప్తంగా ప్రకటించిన అవార్డులలో తెలుగు నటుడు రాగ్ మయూర్ ఈ అవార్డును అందుకోవడంతో పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక రాగ్ మయూర్ విషయానికి వస్తే.. 2021 లో వచ్చిన బండి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఈయన.. ఆ తర్వాత వీరాంజనేయులు విహారయాత్ర, కీడా కోలా, మిత్రమండలి, పరదా, శుభం, గాంధీ తాత వంటి చిత్రాలలో హీరోగా, కమెడియన్ గా, విలన్ గా కూడా నటించి మెప్పించారు. ఇక ఇప్పుడు సూపర్ హిట్ వెబ్ సిరీస్ పంచాయత్ కు రీమేక్ గా వచ్చిన సివరపల్లి వెబ్ సిరీస్ లో హీరోగా నటించి ఈ అవార్డును అందుకున్నారు. ప్రస్తుతం ఇది అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలో అనుమాన పక్షి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Related News

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

Big Stories

Advertisement
×