E-Paper
Advertisement

Upcoming Electric SUVs: టాటా సియెర్రా To మారుతి సుజుకి ఇ విటారా.. త్వరలో లాంచ్ కాబోతున్న క్రేజీ ఈవీలు!

Upcoming Electric SUVs:  టాటా సియెర్రా To మారుతి సుజుకి ఇ విటారా.. త్వరలో లాంచ్ కాబోతున్న క్రేజీ ఈవీలు!
Advertisement

భారతీయ మార్కెట్ లోకి సరికొత్త ఎలక్ట్రిక్ కార్లు అడుగు పెట్టబోతున్నాయి. మారుతి సుజుకి, టాటా మోటార్స్, టయోటా కంపెనీలకు చెందిన మోడల్స్ ఉన్నాయి. మరికొద్ది రోజుల్లోనే ఈ కార్లు విడుదల కాబోతున్నాయి. ఇంతకీ ఆ కార్లు ఏవి? వాటి ఫీచర్లు, రేంజ్ సహా ఇతర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ టాటా సియెర్రా EV

Advertisement

టాటా కంపెనీకి చెందిన పాపులర్ మోడల్స్ లో ఒకటైన టాటా సియెర్రా ఇప్పుడు ఈవీగా మార్కెట్ లోకి అడుగు పెట్టబోతోంది. టాటా మోటార్స్ వచ్చే త్రైమాసికంలో ఈ కారును విడుదల చేయాలని భావిస్తుంది. ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. కేవలం 24 గంటల్లో 70 వేల రిజర్వేషన్లు వచ్చాయి. సియెర్రా EV రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది. హారియర్ EV నుంచి పెద్ద యూనిట్ పొందుతుందని భావిస్తున్నారు. ఒకే ఛార్జ్ తో 500 కి.మీ కంటే ఎక్కువ పరిధిని అందించగలదు. వేగవంతమైన ఛార్జింగ్ సామర్థ్యంతో పాటు, ఎలక్ట్రిక్ SUV ట్రిపుల్ డిస్‌ ప్లేలు, పనోరమిక్ సన్‌ రూఫ్, లెవల్ 2 డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, ఇతర ప్రీమియం ఫీచర్లను కలిగి ఉంటుంది.

⦿ టాటా పంచ్ EV ఫేస్‌ లిఫ్ట్

Advertisement

పంచ్ EV ఫే స్‌లిఫ్ట్ కు సంబంధించిన ఫోటోలు లాంచ్ ముందే విడుదల అయ్యాయి. ఫిబ్రవరి 20న ఈ కారు మార్కెట్ లోకి లాంచ్ అయ్యింది. టాటా EV లైనప్ నుంచి డిజైన్ మాదిరిగానే పంచ్ EV క్యాబిన్ లోపల మరిన్ని ప్రీమియం ఫీచర్లతో అందించబడుతుంది.డ్రైవింగ్ పరిధి కూడా గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు.

⦿ మారుతి సుజుకి ఇ విటారా

పర్పస్ బిల్ట్ హార్టెక్ట్ ఇ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడిన ఇ విటారా BNCAP భద్రతా రేటింగ్ లో 5 స్టార్స్ సాధించింది. ఎలక్ట్రిక్ SUV కీలక పరికరాలలో పెద్ద టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌ మెంట్ ఇంటర్‌ ఫేస్, ఆల్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ ప్లే, లెవల్ 2 డ్రైవర్ అసిస్టెన్స్ టెక్నాలజీ, పనోరమిక్ సన్‌ రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌ ను కూడా కలిగి ఉంటుంది. మరికొద్ది రోజుల్లో ఇ విటారా ప్రారంభంతో పూర్తిగా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్ విభాగంలోకి అధికారికంగా అడుగుపెడుతుంది. ఈ SUV రెండు బ్యాటరీ కాన్ఫిగరేషన్లతో అందించబడుతుంది. 49 kWh, 61 kWh, పెద్ద ప్యాక్ ఒకే ఛార్జ్ పై 543 కి.మీ రేంజ్ ను అందిస్తుంది.

Read Also: ఫస్ట్ డే 10 వేల బుకింగ్స్, టాటా హారియర్ EV దుమ్మురేపుతోందిగా!

⦿ టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా

ఈ కారు e విటారాతో అండర్‌ పిన్నింగ్స్ ను పంచుకుంటూ, టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా మరింత ప్రత్యేకమైన  డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇది వచ్చే నెలలో షోరూమ్‌లలోకి రానుంది. 49 kWh, 61 kWh బ్యాటరీ ప్యాక్‌ తో అమర్చబడి ఉంటుంది. ఒకే ఛార్జ్ తో రియల్ వరల్డ్ లో 500 కి.మీ కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది.

Read Also: మరింత కొత్తగా మార్కెట్ లోకి మారుతి సుజుకి బ్రెజ్జా, కీ ఛేంజెస్ ఇవే!

Related News

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

కారులో రాకెట్ టెక్నాలజీ.. స్పేస్‌ ఎక్స్‌ తో టెస్లా కొత్త ప్రయోగం చూస్తే మతిపోవాల్సిందే!

మహీంద్రా XUV 3XO సరికొత్త రికార్డు.. 5 లక్షలు దాటిన సేల్స్!

మారుతి కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ. 1.65 లక్షల తగ్గింపు!

హ్యుందాయ్ క్రెటా సరికొత్త రికార్డు.. 15 లక్షలు దాటిన అమ్మకాలు!

ట్రాక్షన్ కంట్రోల్, ఫాస్ట్ ఛార్జింగ్‌.. అప్ డేటెడ్ టీవీఎస్ రైడర్ లో అదిరిపోయే ఫీచర్లు!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డ్రైవర్ లేకుండానే నడుస్తుంది.. కొత్త టెక్నాలజీ చూస్తే పిచ్చెక్కాల్సిందే!

మైలేజ్‌లో గ్లాంజా.. బూట్ స్పేస్‌లో ఆల్ట్రోజ్.. ఏ CNG కారు కొంటే బెస్ట్?

Big Stories

Advertisement
×