E-Paper
Advertisement

Visakhapatnam Mayor: టీడీపీ ప్రభుత్వంలో పదవి ఉన్నా సంతోషం సున్నా.. సీనియర్ నాయకత్వానికి దక్కని గౌరవం..!

Visakhapatnam Mayor: టీడీపీ ప్రభుత్వంలో పదవి ఉన్నా సంతోషం సున్నా.. సీనియర్ నాయకత్వానికి దక్కని గౌరవం..!

Visakhapatnam Mayor: ఏ రాజకీయ నాయకుడైన పదవి దక్కాక అధికారం, దర్జా, దర్పం ప్రదర్శిస్తాడు.. పదవి అలంకారప్రాయం అయినా, అధికారం మూడు నాళ్ల ముచ్చట అని తేలినా, ఆది నుండి అవమానాలు ఎదురైనా, తనను ఎవరైనా చిన్న చూపు చూడటం లాంటివి అస్సలు ఊహించలేడు.. అయితే విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావుకి అదే పరిస్థితులు ఎదురవుతూ తెగ ఫీల్ అయిపోతున్నారంట. నగర ప్రధమపౌరుడిగా ఆయన ముందుండి నడిపించాల్సిన ప్రభుత్వ కార్యక్రమాలు ఏవైనా ఆయన్ని పక్కన పెట్టేస్తున్నారంట.. మంత్రులకు, అధికారులకు, అందరికీ చిన్న చూపే.. ఆ పదవికి పవర్ లేదు అనుకుంటున్నారో? లేక పదవీకాలం అయిపోతుందిలే అని భావిస్తున్నారో? తెలియదు కానీ ప్రథమ పౌరుడిని చిన్నచూపు చూస్తున్నారంట.. ఆ వ్యవహారం మేయర్‌కి మింగుడుపడకుండా తయారైందున్నారు.

సీనియర్ రాజకీయ నాయకుడు..

విశాఖ నగరానికి ప్రథమ పౌరుడు పీలా శ్రీనివాసరావు.. మీకు అర్థం కాలేదనుకుంటా అదేనండి మహా విశాఖ నగర మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీలా శ్రీనివాసరావు టీడీపీలో సీనియర్ నాయకుడు, ఒకప్పుడు విశాఖ జిల్లా టిడిపి అధ్యక్షుడు 6 నెలల క్రితం విశాఖ మేయర్ గా ఎన్నికయ్యారు. అంత బ్యాక్‌గ్రౌండ్ ఆయన్ని, ఆయన హోదాని అవమానిస్తూ మాట్లాడుతున్నాం అనుకుంటున్నారేమో.. కానే కాదు.. అంత సీనియర్ రాజకీయ నాయకుడు, ఇప్పుడు రాజకీయాల్లో ఎమ్మెల్యేలుగా చలామణి అవుతూ, అధికారాన్ని, పదవులను అనుభవిస్తున్న ఎంతోమందికి జిల్లా అధ్యక్షుడి హోదాలో బి ఫాములు ఇచ్చిన నాయకుడిగా పీలా శ్రీనివాసరావుకు పేరు ఉన్నా.. ప్రస్తుతం మేయర్ గా కొసాగుతున్నా.. సముచిత గౌరవం ఇచ్చే ప్రజా ప్రతినిధులు కానీ, అధికారులు గానీ ఎవ్వరు కనిపించకపోవడం ఆయన దురదృష్టమే అన్న టాక్ వినిపిస్తోంది.

టిడిపిలో కార్యకర్త స్థాయి నుండి..

గత 30 సంవత్సరాలకు పైనే పీలా శ్రీనివాసరావు టిడిపిలో కార్యకర్త స్థాయి నుండి విశాఖ జిల్లా టిడిపి అధ్యక్షుడి స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం మేయర్ గా కొనసాగుతున్నారు. పీలా శ్రీనివాసరావు ఆర్థికంగా బలమైన నాయకుడు. ఆయన సోదరుడు, అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ కూడా రాజకీయాల్లో ప్రభావితం చూపించిన వ్యక్తి.. పెందుర్తి, అనకాపల్లిలలో వాళ్లకు ఉన్న ఆస్తుల గురించి లెక్కపెట్టడం కష్టం అంటారు. తాతలు తండ్రుల నుంచి సంక్రమించిన ఆస్తులతో ఆర్థికంగా నిలబడి రాజకీయాల్లో కొనసాగుతున్న వ్యక్తి పీలా శ్రీనివాసరావు.

Also Read: Madanapalle Crime: మదనపల్లిలో విషాదం.. ఏడేళ్ల బాలికను చంపేసి డ్రమ్ములో కుక్కి, అసలేం జరిగిందంటే?

విశాఖ మేయర్ మార్పుతో..

పదవుల కోసం ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో సాగిలపడింది లేదు. జీవితంలో ఒక్కసారైనా విశాఖ మేయర్ పదవిని చేపట్టాలని చిరకాల కోరిక మాత్రం పీలా శ్రీనివాసరావుకి ఉండిపోయింది… ఆర్థిక స్థోమత, టిడిపి సీనియర్ నాయకుడిగా పేరు ఉన్నా పదవి మాత్రం జీవీఎంసీ కార్పొరేటర్ స్థాయికే పరిమితమవుతూ వచ్చింది. 2025 ఏప్రిల్ లో జరిగిన విశాఖ మేయర్ మార్పుతో 33 ఏళ్ల తర్వాత విశాఖ నుంచి టీడీపీ మొదటి మేయర్ గా పీలా శ్రీనివాసరావు ఎన్నికయ్యారు… అంత పేరు పలుకుబడి అన్నీ ఉన్నా, మారుతున్న రాజకీయ పరిణామాల్లో పీలా శ్రీనివాసరావు గుర్తింపు లేని నాయకుడిగా మారిపోయి, అధికారం కంటే అవమానాల్ని ఎక్కువగా భరిస్తున్నట్లు కనిపిస్తుంది

టిడిపి నుండి మేయర్..

ఎప్పటికైనా విశాఖ మేయర్ పీఠంపై కూర్చోవాలని ఆశించిన పీలా శ్రీనివాసరావు 2025 ఏప్రిల్ లో వైసీపీ మేయర్ ని దించేసి, టిడిపి నుండి మేయర్ గా ఎన్నికయ్యారు. కేవలం 11 నెలలు మాత్రమే పదవి ఉందని తెలిసినా తనకున్న పలుకుబడిన ఉపయోగించి మేయర్ గా ఎన్నికయ్యారు. చూపులకు గాని మాటలకు గాని శాంతి స్వభావిగా కనిపించే మేయర్ చిన్న వ్యక్తి అనుకుంటున్నారో? లేదా పట్టించుకోకపోయినా పర్లేదు అనుకుంటున్నారో తెలియదు కానీ ప్రస్తుత విశాఖ జిల్లాలోని ప్రజాప్రతినిధులు కానీ, ఉన్నత స్థాయి అధికార యంత్రాంగం గాని ఆయనకు కనీస గౌరవం ఇవ్వకపోవడం చర్చకు దారితీస్తుంది.

గీతం యూనివర్సిటీకి భూములు..

గత నెలలో జరిగిన విశాఖ ఉత్సవాల్లో నగర ప్రథమ పౌరుడిగా ముఖ్య భూమిక పోషించాల్సిన మేయర్ పీలా శ్రీనివాసరావుకు వేదిక మీద మారుమూలన సీటు కేటాయించడంతో అవమానానికి గురై నేరుగా జిల్లా కలెక్టర్ తోనే గొడవ పడాల్సిన పరిస్థితి నెలకొంది. అంతేకాదు జీవీఎంసీ కౌన్సిల్లో గీతం యూనివర్సిటీకి భూముల క్రమబద్ధీకరణ అంశాన్ని తీర్మానం చేయడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయిస్తే, కార్పొరేటర్లు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ పోడియంను చుట్టుముట్టినా మేయర్ కు కనీస రక్షణగా కూడా అధికారులు గానీ కూటమి కార్పొరేటర్లు గాని ముందుకు రాకపోవడం గమనార్హం.

Also Read: Thorrur Municipality: ఉత్కంఠగా మారిన తొర్రూరు మున్సిపల్ రాజకీయం.. ఇక అందరి చూపు అటువైపే..!

కనీసం గుర్తించకపోవడం..

పార్టీ కార్యక్రమాల నిర్వహణలో ప్రాధాన్యత ఇవ్వకపోయినా విశాఖ మేయర్ గా డివిజన్లలో జరిగే కార్యక్రమాలు కానీ, మంత్రుల, ఎమ్మెల్యేల సమక్షంలో జరిగే కార్యక్రమాలకు కానీ మేయర్ ను కచ్చితంగా ఆహ్వానించాల్సి ఉంటుంది. కానీ మేయర్ ఎక్కడ కనిపించకపోవడం, టీడీపీలో సీనియర్లుగా చెప్పుకునే ప్రజాప్రతినిధులు ఆయనకు కనీసం గుర్తించకపోవడం నిజంగా అవమానించడమే అన్న చర్చ జోరుగా సాగుతోంది.

సొంత వ్యక్తిగా భావించకపోవడం

మరోపక్క పార్టీ కార్యక్రమాలతో పాటు, ప్రభుత్వ కార్యక్రమాలను కూడా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు… జీవీఎంసీ పరిధిలో ముగ్గురు జనసేన ఎమ్మెల్యేలు, ఒక బిజెపి ఎమ్మెల్యే ఉండడం ఈ ముగ్గురు మేయర్ ను సొంత వ్యక్తిగా భావించకపోవడంతో ఎలాంటి కార్యక్రమాలకు పిలవకుండా చిన్నచూపు చూస్తున్నారని ప్రచారం జరుగుతుంది. దానికి తోడు భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తన నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాల్లో ఎవ్వరిని అడుగుపెట్టనీయరు. గాజువాక ఎమ్మెల్యేగా టిడిపి రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు తన పనులు తాను చేసుకుంటూ పోతారు.

ఊహించని అవమానాలు..

జీవీఎంసీ పరిధిలో ఉన్న ఎనిమిది నియోజకవర్గాల్లో ఆరు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు తమ పని తాము చేసుకుంటూ పోతుంటే, మేయర్ గా ఉండి ఎలాంటి గౌరవం, మర్యాద లేకుండా ఏంటి ప్రయోజనం అని పీలా శ్రీనివాసరావు సన్నిహితుల దగ్గర వాపోతున్నట్లు తెలుస్తోంది. దానికి తోడు విశాఖ ఎంపీ శ్రీభరత్ అనధికారిక విశాఖ జిల్లా మంత్రిగా కొనసాగుతున్న నేపథ్యంలో ఎంపీ భరత్ హాజరయ్యే ఏ కార్యక్రమంలోనూ మేయర్ పీలా శ్రీనివాసరావు కనిపించరు. అంగ బలం, అర్థబలం రాజకీయ నాయకుడిగా సీనియారిటీ ఉన్నా 33 ఏళ్ల రాజకీయ జీవితం తర్వాత మేయర్ పదవిని ఆశించిన పీలా శ్రీనివాసరావుకు ఆ స్థాయిలో గౌరవం లభించడం లేదు సరికదా, అడుగడుగునా ఊహించని అవమానాలు ఎదురవుతుండడంతో పదవి మూడు నాళ్ళ ముచ్చటే, అధికారం, దర్పం అంతా పేరుకే తప్ప ఎలాంటి ప్రయోజనం లేవని ఆయన ఫీలైపోతున్నారంట.

ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం..

ఎంతోమంది ప్రజాప్రతినిధులకు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా తన చేతుల మీద బీఫాంలో అందించిన వ్యక్తి ఈరోజు అదే ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యానికి గురవుతుండటంతో పాటు, అధికారులు ప్రోటోకాల్ ను విస్మరిస్తుండడంతో కోరుకున్న పదవి చేతిలో ఉన్నా సంతోషం కరువైందని ఈ సీనియర్ టిడిపి నాయకుడు బాద పడుతుంటారని సన్నిహితులు చెప్తున్నారు. ఇంకో నెలతో జీవీఎంసీ కౌన్సిల్ పదవి ముగుస్తున్న నేపథ్యంలో పీలా శ్రీనివాస్ రాజకీయ భవిష్యత్తు 11 నెలల మేయర్ పదవితో ముగుస్తుందా? రానున్న కౌన్సిల్లో తన రాజకీయ చాణక్యతను చూపించి మళ్లీ మేయర్ పీఠాన్ని చేజిక్కించుకుంటారా? మళ్లీ మేయర్ అయి తన పవర్ చూపిస్తారా? అన్నది చూడాలి.

Also Read: Medak Municipality: ఢిల్లీలో కయ్యం గల్లీలో స్నేహం.. ఇదేం విచిత్ర రాజకీయం: పద్మ దేవేందర్ రెడ్డి

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×