E-Paper
Advertisement

ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ల లాంచ్ డేట్ ఫిక్స్.. వారెవ్వా.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ల లాంచ్ డేట్ ఫిక్స్.. వారెవ్వా.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!
Advertisement

Ethanol Cars Launched Soon: ప్రపంచ పర్యావరణ దినోత్సవం అయిన జూన్ 5న భారత ఆటోమొబైల్ రంగంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. ఆ రోజున మారుతి సుజుకి కొత్త ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్యాసింజర్ కారును ఆవిష్కరించనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.  ఈ కొత్త మోడల్ కారు పూర్తిగా E100 ఇథనాల్‌ తో నడవనుంది. అంటే, పెట్రోల్ అవసరం లేకుండా 100 శాతం ఇథనాల్ తోనే ఈ కారు పని చేస్తుంది. ఈ కారు దేశంలో ప్రత్యామ్నాయ ఇంధన రంగంలో కీలక ముందడుగు కాబోతోంది.

అధికారికంగా మోడల్ పేరు ప్రకటించకపోయినా..

మారుతి సుజుకి ఇప్పటి వరకు అధికారికంగా మోడల్ పేరును ప్రకటించలేదు. అయితే, గతంలో కంపెనీ ప్రదర్శించిన వాహనాల ఆధారంగా చూస్తే మారుతి సుజుకి వ్యాగన్ ఆర్, మారుతి సుజుకి ఫ్రాంక్స్ మోడళ్లు ఈ టెక్నాలజీకి అనువుగా ఉండే అవకాశముందని ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు.

నితిన్ గడ్కరీ ఏం చెప్పారంటే?

Advertisement

ఇక ఫ్లెక్స్-ఫ్యూయల్ కార్ల గురించి నితిన్ గడ్కరీ కీలక విషయాలు వెల్లడించారు. ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల వినియోగాన్ని పెంచడం ప్రభుత్వం ప్రధాన లక్ష్యాలలో ఒకటన్నారు. ఇథనాల్ ఆధారిత ఇంధనం వల్ల విదేశీ చమురు దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని, అదే సమయంలో కాలుష్యం కూడా తగ్గుతుందని వివరించారు. ప్రస్తుతం దేశం సుమారు 87 శాతం పెట్రోల్, డీజిల్ అవసరాలకు దిగుమతులపై ఆధారపడుతోందని ఆయన గుర్తుచేశారు.

అందుబాటులో E20 ఫ్యూయెల్

దేశంలో ఇప్పటికే E20 ఇంధనం అందుబాటులో ఉంది. ఇకపై E22, E25, E27, E30 లాంటి ఎక్కువ ఇథనాల్ మిశ్రమాల దిశగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనివల్ల ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలకు అవసరమైన మౌలిక వసతులు క్రమంగా అభివృద్ధి చెందుతున్నాయి.

ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ల ఇంజిన్ ఎలా ఉంటుంది?

Advertisement

ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల్లో సాధారణ పెట్రోల్ ఇంజన్లతో పోలిస్తే కొన్ని మార్పులు అవసరం అవుతాయి. ఇథనాల్ ఎక్కువ తుప్పు పట్టించే గుణం కలిగి ఉండటంతో ఇంధన లైన్లు, ఇంజెక్టర్లు, సీల్స్ లాంటి భాగాలను ప్రత్యేకంగా రూపొందించాలి. అలాగే, ఇంజిన్ ట్యూనింగ్ కూడా మారుతుంది. ఈ మార్పుల వల్ల వాహనం తయారీ ఖర్చు సుమారు రూ.40,000 నుంచి రూ.50,000 వరకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

మారుతి సుజుకి ఇప్పటికే ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీపై పని చేస్తున్నట్లు గతంలోనే స్పష్టం చేసింది. అయితే, ప్రారంభ దశలో ఉత్పత్తి పరిమితంగా ఉండే అవకాశం ఉంది. భవిష్యత్తులో డిమాండ్ పెరిగిన తర్వాత మాత్రమే పెద్ద స్థాయిలో ఉత్పత్తి జరుగుతుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. E100 ఇథనాల్ వాహనాల ప్రవేశం భారత ఆటోమొబైల్ రంగంలో కొత్త మలుపు కానుంది. ఇథనాల్ పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా భారత ఇంధన స్వావలంబనకు కూడా తోడ్పడుతుందని ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు.

Read Also: ఒకే ఛార్జ్ తో 300 కి.మీ రేంజ్.. తక్కువ ధరలో బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Related News

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

బజాజ్ బిగ్ రికార్డ్.. 3 లక్షల EV అమ్మకాలు దాటేసింది!

8 నెలల్లోనే 10 లక్షలు.. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్ లో అదిరిపోయే రికార్డ్!

హ్యుందాయ్ కొత్త SUV ఇంటీరియర్ లీక్.. క్రెటాకు పోటీ తప్పదా?

మాన్యువల్ కార్ల కంటే ఆటోమేటిక్ కార్లే ఫాస్టా? ఇదీ అసలు కథ!

ఏంటీ.. మారుతీ, హుందాయ్‌లో 5 స్టార్ సేఫ్టీ కార్లు ఉన్నాయా? ఇదిగో లిస్టు!

యమహా R2 వచ్చేసింది.. ఈ బైక్‌ లో అదిరిపోయే 5 హైలైట్స్ ఇవే!

సింపుల్ ఫ్లిప్ అప్ కాదు.. ఈ హెల్మెట్ 180 డిగ్రీలు తిరుగుతుంది!

Big Stories

Advertisement
×