E-Paper
Advertisement

వేసవిలో కూల్ డ్రైవ్ కోసం.. బెస్ట్ బడ్జెట్ కార్లు ఇవే!

వేసవిలో కూల్ డ్రైవ్ కోసం.. బెస్ట్ బడ్జెట్ కార్లు ఇవే!
Advertisement

Top Budget-Friendly Cars with Smart AC Features: భారత్ లో వేసవి ప్రభావం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఉష్ణోగ్రతలు 40 నుంచి 50 డిగ్రీల వరకు నమోదు అవుతాయి. సమ్మర్ లో కారు లోపల ఉష్ణోగ్రత మరింత ఎక్కువగా అనిపిస్తుంది. ఈ  నేపథ్యంలో చాలా మంది కారు కొనుగోలు చేసే వాళ్లు మైలేజ్, లుక్ తో పాటు కంఫర్ట్ ఫీచర్లపై కూడా ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉందా? లేదా? అని చూస్తున్నారు. ఇది కారులోని ఉష్ణోగ్రతను మనం సెట్ చేసిన స్థాయిలోనే ఉంచుతుంది, మళ్లీ మళ్లీ AC సబర్దుబాటు చేయాల్సి అవసరం ఉండదు. ఇప్పుడు ఈ ఫీచర్ రూ. 10 లక్షల లోపే కొన్ని కార్లలో అందుబాటులో ఉంది. అలాంటి టాప్ 5 చౌకైన కార్ల గురించి తెలుసుకుందాం..

⦿ టాటా టియాగో

బడ్జెట్‌ ధరలోనే మంచి ఫీచర్లను అందించే హ్యాచ్‌ బ్యాక్ టాటా టియాగో. XZ వేరియంట్ నుంచి ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ లభిస్తుంది. దీని ధర సుమారు రూ. 6.40 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ తో మంచి పవర్ ను అందిస్తుంది. సిటీలో రోజువారీ ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది.

⦿ నిస్సాన్ మాగ్నైట్

Advertisement

నిస్సాన్ మాగ్నైట్ కూడా తక్కువ ధరలో SUV స్టైల్ కావాలనుకునేవారికి మంచి ఆప్షన్. దీని ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వేరియంట్ రూ. 6.76 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 1.0 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్, టర్బో పెట్రోల్ ఇంజన్ ఎంపికలు ఉండటం వల్ల, మీ అవసరానికి తగ్గట్టు ఎంచుకోవచ్చు. స్టైలిష్ లుక్‌ తో పాటు ప్రాక్టికాలిటీ కూడా ఇందులో ఉంటుంది.

⦿ మారుతి సుజుకి బాలెనో

మారుతి సుజుకి బాలెనో భారత మార్కెట్లో మంచి ప్రజాదరణ పొందిన హ్యాచ్‌ బ్యాక్. జీటా, ఆల్ఫా వేరియంట్లలో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ లభిస్తుంది. ధర సుమారు రూ. 8.19 లక్షల నుంచి మొదలవుతుంది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ తో మంచి మైలేజ్, సాఫ్ట్ డ్రైవింగ్ అనుభవం ఇస్తుంది. నగరంతో పాటు హైవేపై కూడా బాగా పనికొస్తుంది.

⦿ టాటా ఆల్ట్రోజ్

Advertisement

టాటా ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌ బ్యాక్‌ గా మంచి ఫీచర్లు అందిస్తుంది. క్రియేటివ్ S వేరియంట్ నుంచి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అందుబాటులో ఉంటుంది.  దీని ధర సుమారు రూ. 8.27 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లు ఉంటాయి. మంచి బిల్డ్ క్వాలిటీ, సేఫ్టీతో రోజువారీ వినియోగానికి బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

⦿ హ్యుందాయ్ ఐ20

హ్యుందాయ్ ఐ20 స్టైలింగ్, ఫీచర్లలో ఎప్పుడూ ముందుంటుంది. స్పోర్జ్ వేరియంట్ నుంచి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ లభిస్తుంది, దీని ధర రూ. 7.74 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో స్మూత్ డ్రైవింగ్ అనుభవాన్ఇన అందిస్తుంది. iVT ఆటోమేటిక్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

Read Also: భారత్‌ లోకి హమ్మర్ EV ఎంట్రీ.. ధర ఏకంగా రూ. 4.5 కోట్లు!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×