E-Paper
Advertisement

తక్కువ ధరలో బెస్ట్ EV స్కూటర్లు.. మంచి రేంజ్‌ తో టాప్ 5 మోడళ్లు!

తక్కువ ధరలో బెస్ట్ EV స్కూటర్లు.. మంచి రేంజ్‌ తో టాప్ 5 మోడళ్లు!
Advertisement

Affordable Electric Scooters 2026:  భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు భారీ డిమాండ్ పెరుగుతోంది. పెట్రోల్ ధరలు పెరగడం, రోజువారీ ఖర్చులు తగ్గించుకోవాలనే ఆలోచనతో చాలా మంది EV స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా తక్కువ ధరలో మంచి రేంజ్,  మంచి పనితీరు, సర్వీస్ సపోర్ట్ ఉన్న స్కూటర్ల కోసం వినియోగదారులు ఎక్కువగా చూస్తున్నారు. అలాంటి వారికి మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

⦿ కోమాకి ఎక్స్-వన్ సిరీస్

తక్కువ ధరలో EV స్కూటర్ కొనాలనుకునే వారికి ఇది మంచి ఎంపికగా మారింది. ఈ స్కూటర్ తక్కువ వేగంతో పని చేస్తుంది. డ్రైవింగ్ లైసెన్స్, RTO రిజిస్ట్రేషన్ అవసరం ఉండదు. రోజువారీ తక్కువ దూర ప్రయాణాలు, షాపింగ్, కాలనీ పరిధిలో తిరగడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. బ్యాటరీ వేరియంట్‌ను బట్టి ఒకసారి ఛార్జ్ చేస్తే 60 నుంచి 150 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.

⦿ యాకుజా రూబీ

Advertisement

తేలికైన డిజైన్‌తో వచ్చే ఈ స్కూటర్ తక్కువ దూర ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. ఇందులో 250 వాట్ల BLDC మోటార్ ఉంటుంది. పూర్తి ఛార్జ్‌ తో సుమారు 55 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. రివర్స్ గేర్, మొబైల్ ఛార్జింగ్, రీజెనరేటివ్ బ్రేకింగ్ లాంటి ఉపయోగకరమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

⦿ ఓలా S1 X

కొంచెం ఎక్కువ వేగం, మెరుగైన పనితీరు కోరుకునే వారికి ఓలా S1 X మంచి ఎంపికగా చెప్పవచ్చు. ముఖ్యంగా 2kWh బ్యాటరీ వేరియంట్ బడ్జెట్ సెగ్మెంట్‌లో మంచి ఆదరణ పొందుతోంది. ఈ స్కూటర్ గంటకు 85 నుంచి 90 కిలోమీటర్ల వరకు వేగాన్ని అందుకుంటుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 90 కిలోమీటర్లకు పైగా ప్రయాణించవచ్చు. ఫిజికల్ కీ, డిస్‌ ప్లే, మల్టిపుల్ రైడింగ్ మోడ్స్ లాంటి ఆధునిక ఫీచర్లు ఇందులో ఉంటాయి.

⦿ హీరో విడా VX2 గో

Advertisement

కుటుంబ అవసరాలకు అనువైన ఎలక్ట్రిక్ స్కూటర్‌గా గుర్తింపు పొందుతోంది. 2.2kWh బ్యాటరీతో వచ్చే ఈ స్కూటర్ నగర ప్రయాణాలకు బాగా సరిపోతుంది. గంటకు 80 కిలోమీటర్ల వరకు వేగాన్ని అందిస్తుంది. బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ ప్లాన్ ద్వారా కొనుగోలు ఖర్చు తగ్గించుకునే అవకాశం ఉంది.

⦿ ఆంపియర్ మాగ్నస్ నియో

ఇది సౌకర్యవంతమైన రైడింగ్ ఎక్స్ పీరియెన్స్ అందిస్తుంది. సిటీ రైడింగ్‌ కు అనువైన ఈ స్కూటర్ పూర్తి ఛార్జ్‌ తో 80 నుంచి 95 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. గంటకు 65 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించే అవకాశం ఉంటుంది.  దేశ వ్యాప్తంగా సర్వీస్ నెట్‌ వర్క్ అందుబాటులో ఉండటం కూడా దీనికి మరో ప్లస్ పాయింట్.  తక్కువ బడ్జెట్‌లో మంచి EV స్కూటర్ కొనాలనుకునే వారికి మార్కెట్లో ఇప్పుడు బోలెడు ఆప్షన్స్ ఉన్నాయి. రోజువారీ ప్రయాణ దూరం, అవసరమైన వేగం, బడ్జెట్‌ ను బట్టి సరైన స్కూటర్‌ను ఎంచుకుంటే ఖర్చు తగ్గుతుంది. ప్రయాణం కూడా సౌకర్యవంతంగా ఉంటుంది.

Read Also: 2026 సుజుకి బర్గ్మాన్ స్ట్రీట్ మైలేజ్ టెస్ట్.. సిటీ, హైవేలో ఎంత ఇచ్చిందంటే?

Related News

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

బజాజ్ బిగ్ రికార్డ్.. 3 లక్షల EV అమ్మకాలు దాటేసింది!

8 నెలల్లోనే 10 లక్షలు.. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్ లో అదిరిపోయే రికార్డ్!

హ్యుందాయ్ కొత్త SUV ఇంటీరియర్ లీక్.. క్రెటాకు పోటీ తప్పదా?

మాన్యువల్ కార్ల కంటే ఆటోమేటిక్ కార్లే ఫాస్టా? ఇదీ అసలు కథ!

Big Stories

Advertisement
×