E-Paper
Advertisement

బీఆర్ఎస్‌కు మంత్రి బండి సంజయ్ కౌంటర్.. రాజీనామా డిమాండ్ అసలు కథ, కొడుకు కేసు గురించి

బీఆర్ఎస్‌కు మంత్రి బండి సంజయ్ కౌంటర్..  రాజీనామా డిమాండ్ అసలు కథ, కొడుకు కేసు గురించి
Advertisement

Bandi Sanjay:  తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడంలో బీజేపీ కీలక పాత్ర పోషించిందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఆ కక్షతో బీఆర్ఎస్ నేతలు తాను పదవికి రాజీనామా చేయాలని డిమాండ్  చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కుట్రలో భాగంగా ఆ పార్టీ ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తోందని ఆరోపించారు.

బీఆర్ఎస్‌కు మంత్రి బండి సంజయ్ కౌంటర్

Advertisement

బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు కేంద్రమంత్రి బండి సంజయ్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, లోక్‌సభ లో ఒక్క ఎంపీ లేని బీఆర్ఎస్ దయాదాక్షిణ్యాలపై మోదీ ప్రభుత్వం నడవడం లేదన్నారు. ఫామ్ హౌస్‌లో కూర్చుని వారు ఏదైనా చెబుతారన్నారు.

కేసీఆర్ అవినీతి సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో కూల్చి,  కుటుంబ పాలనను అంతం చేసింది తామేనన్నారు. అందుకే తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు. కేటీఆర్.. ఫేక్ మీడియా ఫ్యాక్టరీని నడుపుతున్నారని విమర్శించారు. సోషల్ మీడియా వేదికగా తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేయిస్తున్నారని రుసరుసలాడారు.

Advertisement

బీఆర్ఎస్ రాజీనామా డిమాండ్ వెనుక కారణం చెప్పిన కేంద్రమంత్రి,

కొందరు స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. తాను కొత్త పార్టీ పెడతానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తన గురించి, నిజాయితీ గురించి ప్రజలకు తెలుసన్నారు. బీజేపీలో ప్రతి ఒక్కరూ కార్యకర్తలేనన్నారు. కమిట్‌మెంట్‌తో పనిచేసే పార్టీ కార్యకర్తను మీ చివరి కోరిక ఏంటని అడిగితే చనిపోయిన తర్వాత బీజేపీ జెండా కప్పాలని కోరుకుంటామని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

తాను ఎలాంటి వ్యక్తినో ప్రజలు, పార్టీ కార్యకర్తలకు తెలుసన్నారు. పోక్సో కేసులో తన కుమారుడిని స్వయంగా పోలీసులకు అప్పగించానని అన్నారు. కొడుకును పోలీసులకు అప్పగించిన సందర్భం ఎక్కడైనా ఉందా అంటూ ఎదురు ప్రశ్నలు వేశారు. విచారణకు పూర్తిస్థాయిలో సహకరించాలనే కుమారుడిని అప్పగించినట్లు మనసులోని మాట బయటపెట్టారు.  ఈ కేసు హైకోర్టు పరిధిలో ఉండడంతో ఎక్కువగా మాట్లాడలేనని స్పష్టంచేశారు.

ALSO READ: కాంగ్రెస్ కార్యకర్తలకు బంపర్ భరోసా.. కష్టపడితే గుర్తింపు గ్యారెంటీ.. ఎంపీ చామల

 

Related News

తెలంగాణ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రానున్న 2, 3 రోజుల్లో నోటిఫికేషన్!

తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల.. చివరి తేది..?

రాజ్యాంగానికి తీవ్ర ముప్పు..13 కోట్ల ఓట్లు మాయం.. కేంద్రంపై విరుచుకుపడ్డ మధుయాష్కి!

‘కేసీఆర్ ఫామ్ హౌస్ నీళ్లను రైతులకు ఇస్తాం’.. ఎంపీ చామల సంచలన హామీ!

అనిరుధ్ – కావ్యా మారన్ పెళ్లి రిసెప్షన్.. సీఎం రేవంత్, కేటీఆర్‌కు ఆహ్వానం!

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×