E-Paper
Advertisement

ఫ్రంట్ లోడ్ Vs టాప్ లోడ్.. బట్టలు బాగా ఉతికేది ఏది? ఇంటికి ఏ వాషింగ్ మిషన్ బెస్ట్?

ఫ్రంట్ లోడ్ Vs టాప్ లోడ్.. బట్టలు బాగా ఉతికేది ఏది? ఇంటికి ఏ వాషింగ్ మిషన్ బెస్ట్?
Advertisement

Front Load vs Top Load Washing Machine: ఈ రోజుల్లో ప్రతి ఇంట్లోనూ వాషింగ్ మిషన్ ఒక నిత్యావసర వస్తువుగా మారిపోయింది. అయితే కొత్తగా వాషింగ్ మిషన్ కొనాలనుకునే ప్రతి ఒక్కరినీ ప్రధానంగా ఓ సమస్య వేధిస్తుంటుంది. ఫ్రంట్ లోడ్ (Front load) మిషన్ కొనాలా? లేక టాప్ లోడ్ (Top load) మిషన్ కొనాలా? అని చాలా మంది సతమతమవుతుంటారు. బట్టలను ఏది శుభ్రంగా ఉతుకుతుందో అర్థంకాక కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఈ నేపథ్యంలో బట్టల సేఫ్టీ పరంగా రెండింటిలో ఏది బెస్టో ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

బట్టలు ఉతకడంలో ఏది బెస్ట్?

డైరెక్ట్ పాయింట్‌కి వస్తే.. టాప్ లోడ్ మిషన్లతో పోలిస్తే ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్లే బట్టలను చాలా శుభ్రంగా ఉతుకుతాయి. ఎందుకంటే ఫ్రంట్ లోడ్ మిషన్లలో బట్టలు గుండ్రంగా తిరుగుతూ, ఒకదానిపై ఒకటి పడుతూ (Tumbling action) సహజంగా చేత్తో ఉతికినట్లు క్లీన్ అవుతాయి. అదే టాప్ లోడ్ విషయానికి వస్తే.. ఇందులో బట్టలు నీటిలో మునిగి, కింద ఉండే అజిటేటర్ లేదా పల్సేటర్ సాయంతో అటు ఇటు తిరుగుతాయి. ఇది కూడా బాగానే బట్టలను క్లీన్ చేసినప్పటికీ.. ఫ్రంట్ లోడ్ ఇచ్చే అంత పర్‌ఫెక్ట్ ఫినిషింగ్ మాత్రం ఇవ్వలేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

బట్టల లైఫ్ దేనిలో ఎక్కువ?

Advertisement

మనం వేసుకునే ఖరీదైన దుస్తులు ఎక్కువ కాలం మన్నాలంటే బట్టలు ఉతికే మిషన్ కూడా ముఖ్యమే అని నిపుణులు అంటున్నారు. టాప్ లోడ్ మిషన్లలో బట్టలు ఒకదానికొకటి గట్టిగా ముడుచుకుపోవడం వల్ల బట్టల దారాలు త్వరగా బలహీనపడే అవకాశం ఉంది. కానీ ఫ్రంట్ లోడ్ మిషన్లలో బట్టలు చాలా సున్నితంగా ఉతకబడతాయి. కాబట్టి దుస్తులు పాడవకుండా ఎక్కువ కాలం కొత్తవిలా ఉండాలంటే ఫ్రంట్ లోడ్ బెస్ట్ ఛాయిస్ అని నిపుణులు తేల్చేస్తున్నారు.

నీరు, డిటర్జెంట్ ఆదా పరంగా..

ఇక పొదుపు విషయానికి వస్తే.. ఫ్రంట్ లోడ్ మిషన్లు చాలా తక్కువ నీటిని వాడుకుంటాయి. టాప్ లోడ్ మిషన్లలో డ్రమ్ నిండా నీరు నింపాల్సి వస్తుంది. కానీ ఫ్రంట్ లోడ్‌లో డ్రమ్ సగం కంటే తక్కువ నీటితోనే క్లీనింగ్ ప్రాసెస్ పూర్తవుతుంది. నీరు తక్కువగా వినియోగిస్తుంది కాబట్టి.. వాషింగ్ అయ్యే సర్ఫ్ (డిటర్జెంట్) కూడా తక్కువగానే పడుతుంది. కాబట్టి నీరు, డిటర్జెంట్ ఆదా పరంగా చూసిన ఫ్రంట్ లోడ్ బెస్ట్ అని నిపుణులు స్ఫష్టం చేస్తున్నారు.

పవర్ బిల్లు, స్పీడ్ వాషింగ్..

Advertisement

ఈ అంశాల్లో టాప్ లోడ్ మిషన్లదే పైచేయి అని నిపుణులు పేర్కొంటున్నారు. టాప్ లోడ్ మిషన్లలో వాషింగ్ సైకిల్ చాలా త్వరగా అయిపోతుంది. దీనివల్ల కరెంట్ తక్కువ ఖర్చవుతుంది. అదే ఫ్రంట్ లోడ్ మిషన్లలో బట్టలు పర్‌ఫెక్ట్‌గా క్లీన్ అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. పైగా ఇందులో నీటిని వేడి చేసే ఇన్‌బిల్ట్ హీటర్లు ఉండటం వల్ల కరెంట్ బిల్లు కాస్త ఎక్కువగా రావొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు ఫ్రంట్ లోడ్ తో పోలిస్తే.. టాప్ లోడ్ చాలా తక్కువ బడ్జెట్ లో లభిస్తాయని గుర్తుచేస్తున్నారు.

Also Read: పైసా ఖర్చు లేని సూపర్ ట్రిక్.. కేవలం 2 నిమిషాల్లో.. ఫ్రిడ్జ్ కూలింగ్ సమస్యకు పరిష్కారం!

ఫైనల్గా ఏది కొంటె బెటర్?

ఎలాంటి బడ్జెట్ పరిమితి లేకుండా, బట్టల నాణ్యత ముఖ్యం అని భావిస్తే.. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ బెస్ట్ అని నిపుణులు తేల్చేస్తున్నారు. అలా కాకుండా తక్కువ బడ్జెట్‌లో వేగంగా వాషింగ్ ను పూర్తి చేసేది కోరుకుంటే టాప్ లోడ్ తీసుకోవచ్చని హితవు పలుకుతున్నారు. ఫ్రంట్ లోడ్ తరహాలో వంగి వేయాల్సిన అవసరం కూడా దీనికి ఉండదని పేర్కొంటున్నారు. దీనివల్ల వృద్దులు, నడుం నొప్పి ఉన్నవారికి ప్రయోజనం చేకూరుతుందని స్పష్టం చేస్తున్నారు. మెుత్తం మీద మీ అవసరాలు, అభిరుచులకు తగ్గట్లు ఉన్న దానిని మీరే ఎంచుకోండి.

Also Read: ఎండలు మండుతున్నాయా? క్రోమా ఏసీ ఆఫర్లతో కూల్ అవ్వండి.. ఏకంగా రూ.40,000 వరకు సేవింగ్స్!

Related News

షావోమి అధునాతన ‘FX Mini LED’ టీవీలు.. ఆశ్చర్యపరిచే ఫీచర్లు.. భారీ స్క్రీన్‌పై విజువల్స్ పండగ!

కాలం మారిందోచ్.. ఇక వర్షాకాలంలో వెచ్చగా ఉంచే.. టాప్ 5 ఏసీలు ఇవే..!

iPhone 18 Proలో భారీ మార్పులు.. లాంచ్‌కు ముందే బ్యాటరీ, డిస్‌ప్లే ఫీచర్లు లీక్.. ధర కూడా పెరగనుందా?

వానలు వచ్చేస్తున్నాయ్.. ఏసీలో ఈ సెట్టింగ్స్ మారిస్తే.. ఇక వర్షాకాలంలోనూ హాయిగా ఉండొచ్చు!

OnePlus 13 నుంచి Nord సిరీస్ వరకు భారీ ఆఫర్లు.. జూన్ 10 వరకు బంపర్ డిస్కౌంట్స్!

కొత్త ఏసీ కొంటున్నారా? ఏఐ ఏసీ vs నార్మల్ ఏసీ.. ఏది బెస్ట్ ఛాయిస్?

టీచర్లు, ఆన్‌లైన్ ట్యూటర్ల పని సులువు చేసే టాప్-5 AI టూల్స్ ఇవే!

ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లను హ్యాకర్లు ఎలా దొంగిలిస్తున్నారో తెలుసా?

Big Stories

Advertisement
×