E-Paper
Advertisement

Cheapest Hero Bikes: లో మెయింటెనెన్స్, 70 కి.మీ మైలేజ్.. చీప్ అండ్ బెస్ట్ హీరో బైక్స్ ఇవే!

Cheapest Hero Bikes: లో మెయింటెనెన్స్, 70 కి.మీ మైలేజ్.. చీప్ అండ్ బెస్ట్ హీరో బైక్స్ ఇవే!
Advertisement

Best Hero Commuter Bikes: లో బడ్జెట్ లో ఎక్కువ మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ ఉన్న బైక్ కోసం చూస్తున్నట్లయితే, హీరో క్రేజీ బైక్స్ అందుబాటులో ఉంచింది. ఈ బైక్‌లు ఎక్కువ మైలేజ్ ఇంజిన్లు, అద్భుతమైన మైలేజ్, రోజువారీ ప్రయాణాలకు, అవసరాలకు అనుకూలంగా ఉంటాయి. ఈ లిస్టులో HF డీలక్స్ నుంచి స్ప్లెండర్ మోడల్స్ ఉన్నాయి. ఇంతకీ ఈ బైక్స్ ధరలు ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి? అనేది తెలుసుకుందాం..

చీప్ అండ్ బెస్ట్ హీరో బైక్స్

⦿ హీరో HF 100: హీరో HF 100 అనేది అత్యంత చౌకైన బైక్. దీని ధర రూ. 56,890 నుంచి రూ. 59,489 వరకు ఉంటుంది.  ఇది 97.2cc, ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ ను కలిగి ఉంటుంది. ఇది సుమారు 8 PS శక్తిని అందిస్తుంది. ఈ బైక్ 70 కిలో మీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది. దీని సింపుల్ డిజైన్, మంచి బిల్డ్ క్వాలిటీ, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు,  రోజువారీ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటాయి.

Advertisement

⦿ హీరో HF డీలక్స్: హీరో HF 100 కంటే కొంచెం ఎక్కువ ప్రీమియం మోడల్ కోసం చూస్తున్నట్లయితే, HF డీలక్స్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. దీని ధర రూ. 59,998 నుంచి రూ. 69,235 వరకు ఉంటుంది. HF డీలక్స్ 97.2cc ఇంజిన్‌ను  కలిగి ఉంది. 70 కిలో మీటర్ల వరకు మైలేజీ అందిస్తుంది. ఇది మెరుగైన గ్రాఫిక్స్, కొత్త కలర్ ఆప్షన్స్, సౌకర్యవంతమైన సీటును కలిగి ఉంది. ఇది రోజువారీ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది.

⦿ హీరో స్ప్లెండర్ ప్లస్:  హీరో స్ప్లెండర్ ప్లస్ దేశంలో అత్యధికంగా అమ్ముడైన బైక్‌లలో ఒకటి. దీని ధర రూ.74,152 నుంచి రూ.76,437 వరకు ఉంటుంది. ఇది 97.2cc ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. సుమారు 60-70 కిలో మీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది. దీని పవర్ ఫుల్ ఇంజిన్, తక్కువ సర్వీస్ లైఫ్, అద్భుతమైన రీసేల్ వ్యాల్యూ కలిసి వచ్చే అవకాశాలు. ఇది బజాజ్ ప్లాటినా, హోండా షైన్‌లతో పోటీ పడుతుంది.

Advertisement

⦿ హీరో ప్యాషన్ ప్లస్: ఈ బైక్ ధర రూ. 76,691 నుంచి రూ. 78,324 వరకు ఉంటుంది.  97.2cc ఇంజిన్‌ ను కలిగి ఉంటుంది. సుమారు 68-70 కిలో మీటర్ల మైలేజీని అందిస్తుంది. దీని అద్భుతమైన గ్రాఫిక్స్, సౌకర్యవంతమైన రైడింగ్ పొజిషన్, మంచి సస్పెన్షన్ యువతను ఆకట్టుకుంటుంది. హీరో ప్యాషన్ ప్లస్ గ్రామీణ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన బైక్ గా గుర్తింపు తెచ్చుకుంది.

⦿ హీరో స్ప్లెండర్+ XTEC

స్ప్లెండర్+ XTEC ధర రూ. 77,678 నుంచి రూ. 80,721 మధ్య ఉంటుంది. ఇది 97.2cc ఇంజిన్‌ను కలిగి ఉంటుంది.  సుమారు కిలో మీటర్ల మైలేజీని కలిగి ఉంటుంది. 73 కిలో మీటర్ల మైలేజీని అందిస్తుంది. ఈ బైక్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, కాల్, SMS అలర్ట్స్, డిస్క్ బ్రేక్స్ లాంటి ఫీచర్లతో వస్తుంది.

Read Also: రూ. 10 లక్షల లోపు బెస్ట్ సూపర్ బైక్‌లు, ఒక్కోదాని స్పీడ్ ఎంతో తెలుసా?

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×