E-Paper
Advertisement

Dharmavaram: రాష్ట్రంలో వింత కేసు.. భర్త ప్రియుడిపై పీఎస్‌లో ఫిర్యాదు చేసిన భార్య, అసలేం జరిగిందంటే..?

Dharmavaram: రాష్ట్రంలో వింత కేసు.. భర్త ప్రియుడిపై పీఎస్‌లో ఫిర్యాదు చేసిన భార్య, అసలేం జరిగిందంటే..?
Advertisement

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో వెలుగులోకి వచ్చిన ఒక వింత కేసు తీవ్ర సంచలనం రేపుతోంది. సాధారణంగా భర్తకు మరో మహిళతో అక్రమ సంబంధం ఉండటం చూస్తుంటాం.. కానీ ఇక్కడ భర్త మరొక మగాడితో సన్నిహితంగా ఉండటం.. అది గమనించిన భార్యను హతమార్చేందుకు కుట్ర పన్నడం కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ధర్మవరం పట్టణంలోని రామ్ నగర్ విద్యుత్ కార్యాలయంలో దాశరథి, మన్సూరుద్దీన్ లైన్ మెన్‌లుగా పనిచేస్తున్నారు. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా అనైతిక సంబంధం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఒకరోజు వీరిద్దరూ బెడ్ రూమ్‌లో అత్యంత సన్నిహితంగా ఏకాంతంగా గడుపుతుండగా భార్య తులసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తన భర్త ప్రవర్తన చూసి ఆమె షాక్‌కు గురయ్యారు.

Advertisement

ఈ విషయం ఎవరికైనా చెబితే ప్రాణాలతో వదలబోమని భర్త దాశరథి, అతని స్నేహితుడు మన్సూరుద్దీన్ కలిసి తులసికి ఓ రేంజ్ లో వార్నింగ్ కూడా ఇచ్చారు. అప్పటి నుండి ఆమెను వేధించడం మొదలుపెట్టారు. తనను చంపి సాక్ష్యం లేకుండా చేయాలని వారు ప్లాన్ చేస్తున్నట్లు తులసి గ్రహించింది. ప్రాణ భయంతో వణికిపోతున్న ఆమె చివరకు ధర్మవరం టూ టౌన్ పోలీసులను ఆశ్రయించింది.

తన భర్త, అతని ప్రియుడు మన్సూరుద్దీన్ నుండి తనకు రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకున్నారు. వారిద్దరూ కలిసి తనను ఏ క్షణమైనా చంపే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వింత ఉదంతంపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తూ ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

Advertisement

ALSO READ: RTC Driver Suicide: సంగారెడ్డిలో విషాదం.. మంజీరా నదిలోకి దూకి.. ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×