E-Paper
Advertisement

Superbikes Under Rs.10 Lakh: రూ. 10 లక్షల లోపు బెస్ట్ సూపర్ బైక్‌లు, ఒక్కోదాని స్పీడ్ ఎంతో తెలుసా?

Superbikes Under Rs.10 Lakh:  రూ. 10 లక్షల లోపు బెస్ట్ సూపర్ బైక్‌లు, ఒక్కోదాని స్పీడ్ ఎంతో తెలుసా?
Advertisement

Superbikes Under Rs 10 Lakh: చాలా మంది యువత సూపర్ బైక్స్ కొనుగోలుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. వారిని ఆకట్టుకునేలా ఆయా కంపెనీలు హైస్పీడ్ సూపర్ బైకులను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఒకవేళ మీరు కూడా రూ. 10 లక్షల బడ్జెట్ దాటకుండా సూపర్ బైక్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, పలు ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. రూ. 10 లక్షల పవర్ ఫుల్ బైక్స్ లో కవాసకి Z900, సుజుకి GSX-8R, ట్రయంఫ్ డేటోనా 660, కవాసకి నింజా 650, ట్రయంఫ్ ట్రైడెంట్ 660 లాంటి మోడల్స్ ఉన్నాయి. వాటిలో, కవాసకి Z900  948cc ఇన్‌లైన్ ఫోర్ ఇంజిన్‌తో 123.2 bhpని ఉత్పత్తి చేస్తుంది. ఈ ధరలో అత్యంత శక్తివంతమైనదిగా గుర్తింపు తెచ్చుకుంది.

రూ. 10 లక్షల లోపు సూపర బైక్స్

⦿ సుజుకి GSX-8R: ఈ బైక్ ధర రూ. 9.88 లక్షలు ఉంటుంది. ఇది 776cc లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ తో పని చేస్తుంది. ఇది ఆరు స్పీడ్ గేర్‌ బాక్స్‌ తో జత చేయబడి 14-లీటర్ ఇంధన ట్యాంక్‌ను కలిగి ఉంటుంది. ఈ మోడల్ 23.8 కిలో మీటర్ల మైలేజీని అందిస్తుంది.

Advertisement

⦿ ట్రయంఫ్ డేటోనా 660: ట్రయంఫ్ డేటోనా 660 ప్రారంభ ధర రూ. 9.88 లక్షలు. ఈ బైక్ 660cc, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ ను కలిగి ఉంది. ఇది 93.7 hp, 69 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. డేటోనా 660 ఆరు స్పీడ్ గేర్‌ బాక్స్, 14 లీటర్ ఇంధన ట్యాంక్ సామర్థ్యంతో వస్తుంది.

⦿ కవాసకి నింజా 650: కవాసకి నింజా 650 కూడా ఈ లిస్టులో ఉంది. ఇది రూ. 7.91 లక్షల ధరకు లభిస్తుంది. ఈ కవాసకి బైక్ 649cc ఇంజిన్‌ తో వస్తుంది. ఇది 67.06 hp గరిష్ట శక్తిని, 62.1 Nm గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఆరు స్పీడ్ గేర్‌ బాక్స్, 15 లీటర్ ఇంధన ట్యాంక్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

Advertisement

Read Also: మార్కెట్ లోకి బజాజ్ చేతక్ C25.. ఏథర్ రిజ్టా, TVS iQube, Ola S1 Xతో పోల్చితే బెస్టా? కాదా?

⦿ కవాసకి Z900: కవాసకి Z900  ధర రూ. 9.99 లక్షలు ఉంటుంది. ఇది 948cc, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ తో పని చేస్తుంది. ఈ యూనిట్ 123.29 hp, 98.6 Nm టార్క్‌ ను అందిస్తుంది. ఇది 17 లీటర్ ఇంధన ట్యాంక్‌ను కలిగి ఉంది. ఆరు స్పీడ్ గేర్‌ బాక్స్‌ తో వస్తుంది.

⦿ ట్రయంఫ్ ట్రైడెంట్ 660:  ట్రయంఫ్ ట్రైడెంట్ 660 ధర రూ. 8.99 లక్షలు ఉంది. ఈ మోడల్ 660cc లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ తో అమర్చబడి ఉంది, ఇది 79.9 hp శక్తిని మరియు 64 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ ఆరు స్పీడ్ గేర్‌ బాక్స్‌ తో వస్తుంది. 14 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

Read Also: అప్రిలియా RS 457 To కవాసకి నింజా 300.. 5 లక్షల్లోపు బెస్ట్ ఫాస్టెస్ట్ బైక్స్ ఇవే!

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×