E-Paper
Advertisement

ఫస్ట్ టైమ్ కారు కొంటున్నారా? ఈ టాప్ 5 మోడల్స్ ట్రై చేయండి!

ఫస్ట్ టైమ్ కారు కొంటున్నారా? ఈ టాప్ 5 మోడల్స్ ట్రై చేయండి!
Advertisement

Best First Cars in India: మొదటిసారి కారు కొనాలనుకునే వారికి సరైన ఎంపిక అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. కారు కొనేటప్పుడు బడ్జెట్, మైలేజ్, మెయింటెనెన్స్ ఖర్చులు, సేఫ్టీ ఫీచర్లు ఇలా ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. అందుకే, తొలిసారి కారు కొనుగోలుదారులకు సులభంగా ఉపయోగించుకునే, నమ్మకంగా ఉండే ఐదు కార్ల మోడల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ మారుతి సుజుకి ఆల్టో K10

మారుతి సుజుకి ఆల్టో K10 దేశంలో చాలా మంది మొదటి కారుగా ఎంచుకునే మోడల్. చిన్న సైజు, తక్కువ ధర, మంచి మైలేజ్ ఇవన్నీ దీని ప్రత్యేకతలు. సిటీ ట్రాఫిక్‌ లో సులభంగా నడిపే అవకాశం ఉంటుంది. మెయింటెనెన్స్ ఖర్చు కూడా తక్కువగా ఉండటం వల్ల కొత్తగా డ్రైవింగ్ ప్రారంభించే వారికి ఇది మంచి ఎంపిక.

⦿ రెనాల్ట్ క్విడ్

Advertisement

రెనాల్ట్ క్విడ్ లుక్ పరంగా చిన్న SUVలా కనిపిస్తుంది. బడ్జెట్‌లో ఉండి కూడా స్టైలిష్ డిజైన్ ను అందిస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ కొంచెం ఎక్కువగా ఉండటంతో గుంతల రోడ్లపై కూడా సౌకర్యంగా ఉంటుంది. మైలేజ్ కూడా బాగానే ఉంటుంది. మొదటి కారుగా కొంచెం డిఫరెంట్ లుక్ కావాలనుకునే వారికి ఇది సరిపోతుంది.

⦿ టాటా టియాగో

టాటా టియాగో కారు సేఫ్టీ పరంగా మంచి పేరు సంపాదించింది. బలమైన బాడీ నిర్మాణం, స్టేబుల్ డ్రైవింగ్ ఎక్స్ పీరియెన్స్  దీని ప్రత్యేకత. ఇంటీరియర్ కూడా సింపుల్‌ గా, ఉపయోగకరంగా ఉంటుంది. కుటుంబంతో ప్రయాణించాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్. అలాగే మైలేజ్, మెయింటెనెన్స్ ఖర్చులు కూడా తక్కువగా ఉంటాయి.

⦿ హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్

Advertisement

హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ కూడా కంఫర్ట్, ఫీచర్ల విషయంలో కొంచెం ప్రీమియం ఫీలింగ్ ఇస్తుంది. స్మూత్ డ్రైవింగ్, మంచి ఇన్‌టీరియర్ క్వాలిటీ, యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లు దీన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. సిటీ డ్రైవింగ్ కోసం అనుకూలంగా ఉంటుంది. మొదటి కారు కొంచెం ఫీచర్ రిచ్‌గా ఉండాలని అనుకునే వారికి సరైన ఎంపికగా చెప్పుకోవచ్చు.

⦿ మారుతి సుజుకి స్విఫ్ట్

ఈ లిస్టులో చివరిది మారుతి సుజుకి స్విఫ్ట్. ఇది యువతలో చాలా పాపులర్. స్పోర్టీ లుక్, మంచి పనితీరు, ఈజీ హ్యాండ్లింగ్   ప్రధాన ఆకర్షణలు. మైలేజ్ కూడా బాగుంటుంది. డ్రైవింగ్‌ లో కొంచెం ఫన్ ఎక్స్ పీరియెన్స్ కావాలనుకునే వారికి ఇది బాగా నచ్చుతుంది.

మొదటి కారు కొనేటప్పుడు పెద్దగా ఖర్చు చేయడం కంటే, ఉపయోగకరంగా ఉండే, నమ్మకమైన మోడల్‌ను ఎంచుకోవడం మంచిది. పై చెప్పిన కార్లు బడ్జెట్‌కు సరిపోవడంతో పాటు, డ్రైవింగ్ నేర్చుకోవడానికి కూడా సులభంగా ఉంటాయి. మీ అవసరాలు, ప్రయాణ శైలి, బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుని సరైన కారును ఎంచుకుంటే, మీ మొదటి కారు ఎక్స్ పీరియెన్స్  మరింత బాగుంటుంది.

Read Also: చెత్త రోడ్ల పైనా చెడుగుడు ఆటుకుంటూ దూసుకెళ్లే క్రేజీ కార్లు ఇవే!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×