E-Paper
Advertisement

Hyderabad: ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం, ప్రజల కోసం కష్టపడి పని చేస్తాం

Hyderabad: ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం, ప్రజల కోసం కష్టపడి పని చేస్తాం
Advertisement

Hyderabad: వివాదాస్పద సమస్య కు పరిస్కారం లభించిందని అన్నారు ఎమ్మెల్సీ కోదండరామ్. చాలా రోజుల తర్వాత ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశానని, లక్ష్యాలను ఎంచుకొని పని చేస్తానన్నారు. తనకు మంత్రి పదవి పై ఆశ లేదని తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డికి, గవర్నర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఇద్దరు సభ్యులు.

ఎమ్మెల్సీగా కోదండరామ్, అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం

Advertisement

ఎట్టకేలకు మంత్రి అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరామ్‌లు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, మండలి డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాష్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రులు, ప్రభుత్వ విప్ లు, ఎంఎల్సీ లు, ఎంఎల్ఏలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ కోదండరామ్, పదవులు అలంకారాలు కాదన్నారు. ప్రజల కోసం పని చేయడానికే పదవులన్నారు. ఆదివాసీల భూ సమస్య, రిజర్వేషన్ల పెంపు, నిరుద్యోగ సమస్య, ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశాలను ఎంచుకుని పని చేయడానికి ముందుకు సాగుతామన్నారు.

Advertisement

ప్రజల కోసం కష్టపడి పని చేస్తామని వెల్లడి

లక్ష్యాలను ఎంచుకొని పని చేస్తానని, మంత్రి పదవిపై తనకు ఆశ లేదన్నారు. ఇప్పటి వరకు చేస్తున్న పనిని సమర్ధవంతంగా చేయడానికి ఎమ్మెల్సీ ఉపయోగ పడుతుందన్నారు. దివంగత ప్రొఫెసర్ జయశంకర్‌కు ఇచ్చిన మాట ప్రకారం ముందుకు సాగుతానని అననారు. అనేక కేసులు, ఎన్నోసార్లు ఇబ్బందులు పడ్డామని, అయినా పని ఆగలేదన్నారు.

గతంలో ఏ రకంగా జీవన శైలి ఉండేదో భవిషత్తు‌లో అదే విధంగా ఉంటుందన్నారు. ప్రజల కోసం నిలబడతానని, ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు. ఒకాయన తాను పోరాడుతానా లేదా అని అన్నారని, పోరాడి చేసి చూపిస్తానని చెప్పారు.

ALSO READ:  బీఆర్ఎస్ పార్టీ పాతికేళ్ల ప్రస్థానం.. రానున్న రోజుల్లో అనేక సవాళ్లు

అంతకుముందు మంత్రి అజారుద్దీన్ మాట్లాడారు. సిఎం రేవంత్‌రెడ్డితోపాటు రాహుల్‌గాంధీ, ఖర్గే, సోనియాగాంధీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనకోసం ముఖ్యమంత్రి చాలా చేశారని అన్నారు. సహచర మంత్రులకు, పీసీసీ‌కి కృతజ్ఞతలు తెలిపారు.

తనకు పొలిటికల్ ఫాన్స్ కంటే క్రికెట్ ఫాన్స్ ఎక్కువని, పనిలో పనిగా పొలిటికల్ ఫాన్స్‌ని పెంచుకుంటానన్నారు. ప్రజల కోసం ఇంకా కష్టపడి పని చేస్తానని, మైనారిటీల అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. మైనారిటీల సంక్షేమానికి సిఎం చాలా చేశారని, ప్రత్యర్థి పార్టీ లు రకరకాలుగా మాట్లాడడం సహజమన్నారు.

 

Related News

హైదరాబాద్ MVSR కాలేజీ దాండియా వేడుకల్లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!

క్యూనెట్ రూ.10,000 కోట్ల కుంభకోణం.. మరో కీలక నిందుతుడు అరెస్ట్?

వాహన ఫిట్‌నెస్ టెస్ట్ విధానంలో.. తెలంగాణ సర్కార్ కీలక మార్పులు..?

మూసీ తరహాలోనే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. సర్కార్ సంచలన నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వ ఆఫీసుల్లో.. ఏసీల వాడకం పై కొత్త రూల్స్ ఇవే..?

విద్యాసంస్థల్లో దాడులా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ మాస్ వార్నింగ్!

గత ఏడాది కంటే భారీగా పెరిగిన విద్యుత్ వాడకం.. ఓక్కరోజులోనే ఇంత వాడేసారా..?

తెలంగాణ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రానున్న 2, 3 రోజుల్లో నోటిఫికేషన్!

Big Stories

Advertisement
×