E-Paper
Advertisement

చెత్త రోడ్ల పైనా చెడుగుడు ఆటుకుంటూ దూసుకెళ్లే క్రేజీ కార్లు ఇవే!

చెత్త రోడ్ల పైనా చెడుగుడు ఆటుకుంటూ దూసుకెళ్లే క్రేజీ కార్లు ఇవే!
Advertisement

Top 8 Cars for Bad Roads in India: దేశంలో సిటీ రోడ్లు, హైవేలు బాగానే ఉన్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. గుంతలు, గతుకులు, ప్రయాణానికి ఇబ్బంది కరమైన రోడ్లు ఉంటాయి. ఈ రోడ్ల మీద కార్లు ప్రయాణించాలాంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొన్నిసార్లు వెళ్లడం కూడా సాధ్యం కాకపోవచ్చు. ఇలావటి రోడ్లపై కూడా సౌకర్యంగా ప్రయాణించే కార్లను ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం. గతుకుల రోడ్లపై కూడా సులభంగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించే అద్భుతమైన కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ సిట్రోయెన్ C3

సిట్రోయెన్ C3 కారు దాని సస్పెన్షన్ వల్లే ప్రత్యేకంగా గుర్తింపు పొందింది. చిన్న గుంతలు, పాడైన రోడ్లు ఉన్నా  ప్రయాణం స్మూత్ గా ఉంటుంది. 180 మిల్లీ మీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటం వల్ల స్పీడ్ బ్రేకర్లు కూడా సులభంగా దాటుతుంది. అయితే, వేగంగా నడిపితే కొద్దిగా బాడీ రోల్ కనిపిస్తుంది.

⦿ మహీంద్రా బొలెరో

Advertisement

మహీంద్రా బొలెరో గ్రామీణ ప్రాంతాల్లో చాలా కాలంగా మంచి ఆదరణ దక్కించుకుంది. బలమైన నిర్మాణం, సింపుల్ ఇంజన్ పనితీరు దీని ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. గుంతల రోడ్లపై కూడా స్థిరంగా ప్రయాణిస్తుంది. కొత్త మోడల్‌ లో సేఫ్టీ ఫీచర్లు కూడా మెరుగయ్యాయి.

⦿ హోండా ఎలివేట్

ఈ కారుకు 220 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటం వల్ల పెద్ద గుంతల్లో కూడా పెద్దగా ఇబ్బంది లేకుండా ప్రయాణిస్తుంది. సస్పెన్షన్ కొద్దిగా గట్టిగా ఉన్నప్పటికీ, కఠినమైన రోడ్లను సులభంగా దాటుతుంది. చిన్న పట్టణాల్లో డ్రైవ్ చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది.

⦿ రెనాల్ట్ డస్టర్

Advertisement

ఈ కారు నిజంగా కఠినమైన రోడ్ల కోసం తయారైన SUV. 212 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్, బలమైన సస్పెన్షన్ వల్ల పర్వత మార్గాలు, పాడైన రోడ్లు కూడా సులభంగా దాటుతుంది. హైవేపై కూడా చక్కగా ప్రయాణిస్తుంది.

⦿ మారుతి సుజుకి జిమ్నీ

ఇది పూర్తిగా ఆఫ్ రోడ్ కోసం రూపొందించిన కారు. దీని లాడర్ ఫ్రేమ్ నిర్మాణం, 4×4 సిస్టమ్ కారణంగా బురద, రాళ్లు, లోతైన గుంతలు కూడా పెద్ద సమస్య కావు. అయితే, సిటీ డ్రైవింగ్‌లో కొంచెం కఠినంగా అనిపిస్తుంది.

⦿ మహీంద్రా స్కార్పియో ఎన్

ఇది కూడా బలమైన SUVగా గుర్తింపు తెచ్చుకుంది. ఎత్తైన సీటింగ్ పొజిషన్ వల్ల రోడ్డు స్పష్టంగా కనిపిస్తుంది. డీజిల్ ఇంజన్ లో ఎండ్ టార్క్ వల్ల ఎగుడుదిగుడు రోడ్లపై డ్రైవ్ చేయడం సులభం. అయితే ఇరుకైన ప్రదేశాల్లో కొంచెం జాగ్రత్త అవసరం.

⦿ మహీంద్రా XUV700

ప్రీమియం ఫీచర్లతో పాటు మంచి రైడ్ క్వాలిటీని అందిస్తుంది. కఠినమైన రోడ్లపై కూడా సౌకర్యంగా ప్రయాణించవచ్చు. టెక్నాలజీ, కంఫర్ట్ రెండూ ఇందులో ఉంటాయి.

⦿ టాటా సఫారీ

ఈ కారు బలమైన నిర్మాణంతో పాటు మంచి సస్పెన్షన్ కలిగిన SUV. గుంతల రోడ్లు, గ్రామీణ మార్గాలు సులభంగా దాటుతుంది. రఫ్ రోడ్ మోడ్ లాంటి ఫీచర్లు దీని సామర్థ్యాన్ని మరింత పెంచుతాయి.  మొత్తంగా గుంతల రోడ్లపై డ్రైవింగ్ చేసే వారికి గ్రౌండ్ క్లియరెన్స్, సస్పెన్షన్, బలమైన నిర్మాణం లాంటి అంశాలను పరిశీలించాయి. అప్పుడు ప్రయాణం సాఫీగా కొనసాగుతుంది.

Read Also: భారత్‌లోకి నిస్సాన్ ప్యాట్రోల్ ఎంట్రీ, ల్యాండ్ క్రూయిజర్‌కు షాక్ తప్పదా?

Related News

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

బజాజ్ బిగ్ రికార్డ్.. 3 లక్షల EV అమ్మకాలు దాటేసింది!

8 నెలల్లోనే 10 లక్షలు.. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్ లో అదిరిపోయే రికార్డ్!

హ్యుందాయ్ కొత్త SUV ఇంటీరియర్ లీక్.. క్రెటాకు పోటీ తప్పదా?

మాన్యువల్ కార్ల కంటే ఆటోమేటిక్ కార్లే ఫాస్టా? ఇదీ అసలు కథ!

ఏంటీ.. మారుతీ, హుందాయ్‌లో 5 స్టార్ సేఫ్టీ కార్లు ఉన్నాయా? ఇదిగో లిస్టు!

యమహా R2 వచ్చేసింది.. ఈ బైక్‌ లో అదిరిపోయే 5 హైలైట్స్ ఇవే!

సింపుల్ ఫ్లిప్ అప్ కాదు.. ఈ హెల్మెట్ 180 డిగ్రీలు తిరుగుతుంది!

Big Stories

Advertisement
×