E-Paper
Advertisement

కియా To టాటా.. తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ డీజిల్ AT SUVలు ఇవే!

కియా To టాటా.. తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ డీజిల్ AT SUVలు ఇవే!
Advertisement

Top Diesel SUVs Under 15 Lakhs: భారత్ లో డీజిల్ SUVలకు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఎక్కువ టార్క్, మంచి మైలేజ్, లాంగ్ డ్రైవ్స్‌ కు అనువుగా ఉండటం వల్ల చాలా మంది కొనుగోలుదారులు డీజిల్ కార్లను ఇష్టపడుతున్నారు. అదే సమయంలో ఆటోమేటిక్ ట్రాన్స్‌ మిషన్ సౌకర్యాన్ని కోరుకుంటున్నారు. డ్రైవింగ్ మరింత సులభంగా, కంఫర్ట్‌ గా ఉండేలా చూసుకుంటున్నారు. రూ. 15 లక్షల లోపు ఒక డీజిల్ ఆటోమేటిక్ SUV కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈ టాప్ 5 మోడళ్లను ఓసారి చెక్ చేయండి.

⦿ కియా సోనెట్

ఈ లిస్టులో బెస్ట్ కారు కియా సోనెట్. ఇది కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌ లో చాలా పాపులర్ మోడల్. ఇందులో 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్‌ తో పాటు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌ బాక్స్ లభిస్తుంది. ఇది 116 PS పవర్, 250 Nm టార్క్ ఇస్తుంది. ఫీచర్లలో పెద్ద టచ్‌ స్క్రీన్, BOSE సౌండ్ సిస్టమ్, సన్‌ రూఫ్ లాంటి ప్రీమియం ఆప్షన్లు కూడా ఉంటాయి.

⦿ హ్యుందాయ్ వెన్యూ

Advertisement

ఆ తర్వాత హ్యుందాయ్ వెన్యూ ఉంటుంది. ఇది సోనెట్‌ మాదిరిగానే ఉంటుంది. ఎందుకంటే అదే ఇంజిన్‌ ను కలిగి ఉంటుంది. కానీ, వెన్యూలో కొత్త టెక్నాలజీ ఫీచర్లు ఎక్కువగా ఉంటాయి. డ్యూయల్ 12.3 ఇంచ్ స్క్రీన్లు, వెంటిలేటెడ్ సీట్లు, ADAS లాంటి ఆధునిక ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. సిటీ డ్రైవింగ్ కోసం మంచి ఎంపిక.

⦿ టాటా నెక్సాన్

టాటా నెక్సాన్ దేశంలో ఎక్కువగా అమ్ముడవుతున్న SUVలలో ఒకటి. ఇందులో 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్‌ తో 6-స్పీడ్ AMT గేర్‌ బాక్స్ ఉంటుంది. 115 PS పవర్, 260 Nm టార్క్‌ తో మంచి పనితీరును కలిగి ఉంటుంది. నెక్సాన్ భద్రత, ఫీచర్లలో ఇది చాలా బలంగా ఉంటుంది. పనోరమిక్ సన్‌ రూఫ్, పెద్ద టచ్‌ స్క్రీన్, ADAS లాంటి ఫీచర్లు ఉన్నాయి.

⦿ కియా సెల్టోస్

Advertisement

కియా సెల్టోస్ పెద్ద SUV అయినప్పటికీ, దాని ఎంట్రీ లెవల్ డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్ రూ. 15 లక్షలలోపే వస్తుంది. అదే 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్‌తో 6-స్పీడ్ AT ఉంటుంది. పెద్ద సైజ్, ప్రీమియం లుక్, ఎక్కువ ఫీచర్లతో మంచి వాల్యూను ఇస్తుంది. పనోరమిక్ సన్‌ రూఫ్, హెడ్స్ అప్ డిస్‌ ప్లే, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ లాంటి హైఎండ్ ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.

⦿ మహీంద్రా XUV 3XO

ఈ లిస్టులో చివరి కారు మహీంద్రా XUV 3XO. ఇది సబ్‌ కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌ లో ఒక బలమైన పోటీదారుగా కొనసాగుతోంది. ఇందులో 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ 300 Nm టార్క్ ఇస్తుంది. 6-స్పీడ్ AMT గేర్‌బాక్స్‌తో మంచి డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఫీచర్లలో పనోరమిక్ సన్‌ రూఫ్, హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, ADAS లాంటి ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి.

Read Also: 8 ఏళ్ల వారెంటీతో.. జస్ట్ రూ. 49,999కే అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్!

Related News

ఇండియాలో టెస్లా రోడ్‌స్టర్ బుకింగ్స్.. వామ్మో.. రిజర్వేషన్ కోసం రూ.2.50 కోట్లా?

మారుతి జిమ్నీ To మహీంద్రా థార్.. రూ.20 లక్షల లోపు పవర్‌ఫుల్ 4×4 SUVలు ఇవే!

రెడ్ అండ్ బ్లాక్ లుక్‌లో హ్యుందాయ్ బేయాన్.. ఫీచర్లు అదుర్స్!

క్లాసిక్ లుక్.. మోడ్రన్ టెక్నాలజీ.. ట్రయంఫ్ బోన్నెవిల్ T40 వచ్చేసింది!

టెస్లా రోడ్‌స్టర్‌లో ఎయిర్ థ్రస్టర్లు.. ఫెరారీకి ఈ ఆలోచన 2018లో వచ్చిందా?

రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ vs గ్రాండ్ విటారా vs టయోటా హైరైడర్.. వీటిలో ఏది కొనాలంటే?

స్కోడా కార్లపై అదిరిపోయే ఆఫర్లు.. కైలాక్‌పై ఏకంగా రూ.90 వేల తగ్గింపు!

డౌన్ పేమెంట్ లేకుండానే బైక్ కొనేయండి.. జావా, యెజ్డీ అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్లు!

Big Stories

Advertisement
×