E-Paper
Advertisement

మారుతి To రెనాల్ట్.. పెట్రో బాధలు తప్పించే బెస్ట్ 5 కార్లు ఇవే!

మారుతి To రెనాల్ట్.. పెట్రో బాధలు తప్పించే బెస్ట్ 5 కార్లు ఇవే!
Advertisement

Best Mileage Cars In India 2026: కారు కొనేటప్పుడు చాలా మంది ముందుగా చూసేది మైలేజీ, తర్వాత మెయింటెనెన్స్ కాస్ట్. పెట్రోల్‌, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం ఉపయోగించుకునే కార్లకు ఎక్కువ డిమాండ్ ఉంది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు, రోజువారీ ప్రయాణం ఎక్కువగా చేసే ఉద్యోగులు, చిన్న కుటుంబాలు తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు ఉన్న కార్లను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం భారత మార్కెట్లో ఫ్యూయెల్ ఎఫిషియెన్సీ, తక్కువ సర్వీస్ ఖర్చులు, మంచి పనితీరు కారణంగా కొన్ని కార్లు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. వాటిటో టాప్ 5 కార్ల గురించి ఇప్పుడు  తెలుసుకుందాం.

⦿ మారుతి సుజుకి సెలెరియో

ప్రస్తుతం దేశంలో అత్యంత ఎక్కువ మైలేజీ ఇచ్చే పెట్రోల్ కార్లలో ఒకటిగా కొనసాగుతోంది. ఈ కారు లీటర్ పెట్రోల్‌ కు దాదాపు 26.68 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది.  ప్రారంభ ధర సుమారు రూ.4.99 లక్షలు. ముఖ్యంగా చిన్న కుటుంబాలకు, సిటీ ప్రయాణాలకు ఇది బాగా సరిపోతుంది. మెయింటెనెన్స్ ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది.

⦿ మారుతి సుజుకి ఆల్టో K10

Advertisement

బడ్జెట్ కార్లలో ఆల్టోకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ కారు పెట్రోల్‌ తో పాటు సీఎన్‌జీ వేరియంట్‌ లో కూడా అందుబాటులో ఉంది. పెట్రోల్ మోడల్ మంచి మైలేజీ ఇవ్వడమే కాకుండా, సీఎన్‌జీ వేరియంట్‌ లో మరింత ఇంధన ఆదా లభిస్తుంది. తక్కువ సర్వీస్ ఛార్జీలు, చవకైన స్పేర్ పార్ట్స్, ఈజీ మెయింటెనెన్స్ కారణం ఎక్కువ మంది కొనుగోలుదారులను ఆకర్షిస్తోంది.

⦿ మారుతి సుజుకి వాగన్ ఆర్

ఈ కారు కూడా తక్కువ మెయింటెనెన్స్ ఖర్చును కలిగి ఉంటుంది. విశాలమైన క్యాబిన్, మంచి హెడ్‌ రూమ్,  కుటుంబ అవసరాలకు అనుకూలమైన డిజైన్ కారణంగా ఈ కారు ఫ్యామిలీ వినియోగదారులకు బెస్ట్ ఆప్షన్ గా నిలిచింది. దీని సీఎన్‌జీ వేరియంట్ దాదాపు 34 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది.

⦿ రెనాల్ట్ క్విడ్

Advertisement

దేశంలో అత్యంత సరసమైన కార్లలో రెనాల్ట్ క్విడ్ ఒకటి. ప్రారంభ ధర సుమారు రూ.4.70 లక్షల నుంచి ఉంటుంది. తక్కువ బడ్జెట్‌ లో స్టైలిష్ లుక్‌ తో కూడిన కారును కోరుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. సుమారు 22 కి.మీ మైలేజీ ఇస్తుంది.

⦿ మారుతి సుజుకి స్విఫ్ట్

మారుతి సుజుకి స్విఫ్ట్ కు యువతలో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. స్పోర్టీ డిజైన్‌ తో పాటు మంచి పనితీరు, మెరుగైన మైలేజీ ఆకట్టుకుంటుంది. పెట్రోల్, సీఎన్‌జీ వేరియంట్లలో కూడా మంచి ఫ్యూయెల్ ఎఫిషియెన్సీ అందిస్తుంది. మెయింటెనెన్స్ ఖర్చులు కూడా ఇతర ప్రీమియం హ్యాచ్‌ బ్యాక్‌ లతో పోలిస్తే తక్కువగానే ఉంటాయి.

Read Also: టాటా To మహీంద్రా.. భారత మార్కెట్‌లో దుమ్మురేపుతున్న ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Related News

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

కారులో రాకెట్ టెక్నాలజీ.. స్పేస్‌ ఎక్స్‌ తో టెస్లా కొత్త ప్రయోగం చూస్తే మతిపోవాల్సిందే!

మహీంద్రా XUV 3XO సరికొత్త రికార్డు.. 5 లక్షలు దాటిన సేల్స్!

మారుతి కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ. 1.65 లక్షల తగ్గింపు!

హ్యుందాయ్ క్రెటా సరికొత్త రికార్డు.. 15 లక్షలు దాటిన అమ్మకాలు!

ట్రాక్షన్ కంట్రోల్, ఫాస్ట్ ఛార్జింగ్‌.. అప్ డేటెడ్ టీవీఎస్ రైడర్ లో అదిరిపోయే ఫీచర్లు!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డ్రైవర్ లేకుండానే నడుస్తుంది.. కొత్త టెక్నాలజీ చూస్తే పిచ్చెక్కాల్సిందే!

మైలేజ్‌లో గ్లాంజా.. బూట్ స్పేస్‌లో ఆల్ట్రోజ్.. ఏ CNG కారు కొంటే బెస్ట్?

Big Stories

Advertisement
×