E-Paper
Advertisement

ఐకూ దెబ్బ మామూలుగా లేదుగా.. 8000mAh బ్యాటరీతో 15T మోడల్ వచ్చేస్తోంది.. ఆ రోజే లాంచ్!

ఐకూ దెబ్బ మామూలుగా లేదుగా.. 8000mAh బ్యాటరీతో 15T మోడల్ వచ్చేస్తోంది.. ఆ రోజే లాంచ్!
Advertisement

iQOO 15T: ఐకూ బ్రాండ్ నుంచి మరో పవర్‌ఫుల్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రావడానికి సిద్ధమైంది. మే 20న చైనాలో iQOO 15T మోడల్‌ను కంపెనీ లాంచ్ చేయబోతోంది. అయితే విడుదలకు ముందే ఈ ఫోన్ ఫీచర్లు మొబైల్ ప్రియుల్లో భారీ అంచనాలను పెంచేస్తున్నాయి. ముఖ్యంగా కెమెరా, బ్యాటరీ విభాగాల్లో సరికొత్త రికార్డులు సృష్టించేలా ఈ ఫోన్‌ను రూపొందించారు.

అల్ట్రా క్లియర్ 200MP కెమెరా:

ఈ ఫోన్‌లో అత్యంత ప్రధానమైన ఆకర్షణ దీని కెమెరా సెటప్. ఐకూ చరిత్రలోనే మొదటిసారిగా 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అందిస్తున్నారు. దీనివల్ల ఫొటోలను ఎంత జూమ్ చేసినా స్పష్టత తగ్గదు. వివో ప్రీమియం ఫోన్లలో ఉండే స్టెబిలైజేషన్ టెక్నాలజీని దీనిలో వాడటం వల్ల ఫొటోలు, వీడియోలు షేక్ అవ్వకుండా వస్తాయి. 4x లాస్‌లెస్ జూమ్, విభిన్న ఫోకల్ లెంగ్త్‌లలో పోర్ట్రెయిట్ షాట్స్, ఏఐ ఇమేజింగ్ టూల్స్ కూడా ఉన్నాయి. దీనితో పాటు 50MP అల్ట్రా వైడ్ కెమెరా, సెల్ఫీల కోసం 16MP ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.

భారీ బ్యాటరీ.. ఫాస్ట్ ఛార్జింగ్:

Advertisement

ఇందులో ఏకంగా 8000mAh బ్యాటరీని అమర్చారు. ఫోన్ స్లిమ్‌గా ఉంటూనే ఇంత పెద్ద బ్యాటరీని అందించడం విశేషం. దీనికి తోడు 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. దీనివల్ల ఇంత పెద్ద బ్యాటరీ కూడా చాలా వేగంగా ఛార్జ్ అవుతుంది. గేమ్స్ ఆడేటప్పుడు, ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు ‘గ్లోబల్ డైరెక్ట్ డ్రైవ్ పవర్ సప్లై 2.0’ టెక్నాలజీని ఉపయోగించారు.

Also Read: పాత ఫోన్ ఇస్తే రూ.22,000 డిస్కౌంట్.. Oppo Find X9s లాంచ్ ఆఫర్స్ లీక్!

అద్భుతమైన డిస్‌ప్లే:

Advertisement

గేమింగ్, వీడియో ఎక్స్‌పీరియన్స్ కోసం ఈ ఫోన్‌లో 6.82 ఇంచుల ఫ్లాట్ 2K డిస్‌ప్లేను అందించారు. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌తో పనిచేస్తుంది. దీనివల్ల స్క్రీన్ టచ్ రెస్పాన్స్ చాలా స్మూత్‌గా ఉంటుంది. ఇక సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే.. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ OriginOS 6 వెర్షన్‌తో రన్ అవుతుంది.

గ్లోబల్ మార్కెట్‌లోకి ఎప్పుడంటే?

ఈ ఫోన్ పర్ఫార్మెన్స్ కోసం ‘డైమెన్సిటీ 9500 మాన్‌స్టర్ ఎడిషన్’ ప్రాసెసర్‌ను వాడారు. భారీ గేమ్స్ కూడా ఇందులో ఎలాంటి లాగ్ లేకుండా నడుస్తాయి. గ్రాఫిక్స్ మరింత మెరుగ్గా కనిపించడం కోసం ఐకూ సొంతంగా తయారు చేసిన Q3 ఈ-స్పోర్ట్స్ చిప్‌ను కూడా అమర్చారు. ఇది రే-ట్రేసింగ్, 144fps గేమింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. చైనా లాంచ్ తర్వాత ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

Also Read: పాత డిజైన్‌కు గుడ్‌బై చెప్పిన శాంసంగ్.. సరికొత్త గ్లామరస్ లుక్‌తో వచ్చేస్తోన్న Galaxy A27!

Related News

ఇంట్లో Wi-Fi డెడ్ జోన్స్‌కు సింపుల్ సొల్యూషన్.. పాత ఆండ్రాయిడ్ ఫోన్‌తో ఇలా చేయండి!

వాషింగ్ మెషీన్‌ను ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? ఈ విషయం తెలుసా?

AIతో పెరుగుతున్న సైబర్ మోసాలు.. మీ డబ్బు, వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోండిలా!

BSNL కనివిని ఎరుగని ప్లాన్స్.. రోజుకు రూ.5 మాత్రమే.. 80 రోజులపాటు మీ ఇష్టం!

కొత్త 5G ఫోన్‌తో ఫిలిప్స్ రీ-ఎంట్రీ.. సెప్టెంబర్ 2న ఏం లాంచ్ చేయనుందంటే?

బ్యాటరీ ఎక్కువకాలం మన్నాలంటే 80-20 రూల్ పాటించాల్సిందేనా?

ఒకప్పుడు ఇవే స్టేటస్ సింబల్.. 90లలో ఫేమస్ అయిన 5 ఫోన్లు ఇవే!

మ్యాక్‌లో సిస్టమ్ స్టోరేజ్ పెరిగిపోయిందా? ఈ సింపుల్ ప్రాసెస్ ద్వారా ఖాళీ చేసి స్పీడ్ పెంచండి!

Big Stories

Advertisement
×