E-Paper
Advertisement

అల్లా మీద ఒట్టు..బాబ‌ర్ భ‌యంక‌రంగా ఆడుతున్నాడు, 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మాదే

అల్లా మీద ఒట్టు..బాబ‌ర్ భ‌యంక‌రంగా ఆడుతున్నాడు, 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మాదే
Advertisement

Tanveer Ahmed:  పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament) తుది దశకు వచ్చేసింది. ఈ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ రేపు నిర్వహించబోతున్నారు. హైదరాబాద్ కింగ్స్ మెన్ వర్సెస్ పెషావర్ జల్మీ ( Peshawar Zalmi) జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ లాహోర్ లోని గడాఫీ స్టేడియం ( Lahore, Gaddafi Stadium) వేదికగా జరగనుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ స్టార్ ఆటగాడు తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లో బాబర్ ఆజం ( Babar azam ) భయంకరమైన ఫామ్ లో ఉన్నాడని వెల్లడించారు. అతన్ని ఆపడం ఎవడి తరం కాదంటూ వ్యాఖ్యానించారు. ఇదే ఊపుతో 2027 వన్డే వరల్డ్ కప్ ( 2027 world cup ) పాకిస్తాన్ సొంతం చేసుకునే దిశగా బాబర్ ఆజం పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు. అల్లా మీద ఒట్టేసి చెబుతున్నా… బాబర్ ఆజం ఆధ్వర్యంలో 2027 వన్డే వరల్డ్ కప్ టైటిల్ పాకిస్తాన్ సొంతం చేసుకుంటుందని షాకింగ్ స్టేట్మెంట్ చేశారు. అలా జరగకపోతే బట్టలు లేకుండా పాకిస్తాన్ వీధుల్లో తిరుగుతానని శపథం చేశారు.

Also Read: Islamabad United vs Hyderabad Kingsmen, Eliminator 2 PSLలో  మ‌రో అరాచ‌కం.. డ‌బ్బులు లేక ఆంటీల‌తో క్లీన్ చేయిస్తున్నారు, దొంగ‌ల్లా దూరేస్తున్నారు

పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ 2026లో అదరగొడుతున్న బాబర్ ఆజం

Advertisement

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో బాబర్ ఆజం అత్యున్నత ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. గత రెండు సంవత్సరాలుగా చెత్త‌ ప్రదర్శన ఘన బరుస్తున్న బాబర్ ఆజం, పాకిస్తాన్ జట్టులో స్థానం కోల్పోవడమే కాకుండా కెప్టెన్సీ ని కూడా వదులుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇలాంటి గడ్డు పరిస్థితులలో పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ను ఆయుధంగా మలుచుకున్నాడు బాబర్. ఈ క్రమంలోనే పెషావర్ జల్మీ ( Peshawar Zalmi) జట్టును ఫైనల్ దాకా తీసుకువెళ్లాడు. అంతేకాదు ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు పది మ్యాచ్ లు ఆడిన బాబర్ ఆజం, 588 పరుగులు సాధించాడు. ఇందులో అతని బ్యాటింగ్ అవరేజ్ 84 కాగా, స్ట్రైక్ రేట్ 146 గా ఉంది. ఈ టోర్నమెంట్ లో రెండు సెంచరీలు నమోదు చేసిన బాబర్ ఆజం, మూడు అర్థ సెంచరీలు కూడా చేశాడు.

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ గెల‌వ‌డం ప‌క్కా

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంటులో బాబర్ అద్భుతంగా రాణించిన నేపథ్యంలో తన్వీర్ అహ్మద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే పాకిస్తాన్ జట్టుకు బాబర్ ఆజం కెప్టెన్ కాబోతున్నాడని జోష్యం చెప్పారు. అతని ఆధ్వర్యంలోనే 2027 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ అడుగుపెడుతుందని వెల్లడించారు. 99.9 శాతం 2027 వన్డే వరల్డ్ కప్ ను బాబర్ ఆజం ఆధ్వర్యంలోని పాకిస్తాన్ జట్టు కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అలా జరగకపోతే పాకిస్తాన్ లో బట్టలు లేకుండా తిరుగుతానని శపథం చేశారు.

Advertisement

Also Read: Ramiz Raja Hug: కామెంట్రీలో చేస్తుండ‌గా రొమాన్స్‌..రమీజ్ రాజా, లీసా హాట్ వీడియో వైర‌ల్

 

https://www.facebook.com/photo/?fbid=993232756950800&set=a.808612632079481

Related News

ఐపీఎల్ గురించి త‌ప్పుగా మాట్లాడితే, ప‌ళ్లు రాల‌గొడ‌తా..ఇంట‌ర్వ్యూలోనే ఇచ్చిప‌డేసిన దినేష్ కార్తీక్‌

PCB మ‌రో దిక్కుమాలిన కండీష‌న్‌.. ‘పాడెల్’ ఆడితేనే జ‌ట్టు ఛాన్స్‌

ఐపీఎల్ ప‌ర‌మ చెత్త లీగ్…అందులో ఆడ‌టం కంటే, ఇంట్లో కూర్చోండి

స్పెయిన్ ఆట‌గాడి నిర్ల‌క్ష్యం..కింద ప‌డి రెండు ముక్క‌లైన‌ ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ ట్రోఫీ?

కొంప‌ముంచిన ధర్మేంద్ర ప్రధాన్…గంభీర్ మెడ‌పైకి క‌త్తి? ఢిల్లీలో కొత్త టెన్ష‌న్‌

ఓరేయ్ వైభ‌వ్..నువ్వు మ‌గాడివైతే జింబాబ్వేపై సెంచ‌రీ కొట్టు !

బౌలింగ్ స‌రిగ్గా చేయ‌లేద‌ని ధోని ప‌చ్చిబూతులు తిట్టాడు, లైవ్ మ్యాచ్ లోనే అవ‌మానించాడు

AB డివీలియర్స్ లాగా ఆడి, టీమిండియాను చిత్తుగా ఓడిస్తా

Big Stories

Advertisement
×